Telugu TV Serials Latest TRP Ratings: సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్‌లో భారీ మార్పులు.. దూసుకొచ్చిన జీ తెలుగు సీరియల్స్
10 July 2023, 15:52 IST
- Telugu TV Serials Latest TRP Ratings: సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్‌లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా జీ తెలుగు సీరియల్స్ టాప్ 5, టాప్ 10లోకి దూసుకు రావడం విశేషం.
స్టార్ మాలో వచ్చే బ్రహ్మముడి సీరియల్
Telugu TV Serials Latest TRP Ratings: తెలుగు టీవీ సీరియల్స్ లేటెస్ట్ టీఆర్పీ రేటింగ్స్ లో మార్పులు జరిగాయి. జూన్ 17 నుంచి జూన్ 23తో ముగిసిన వారానికిగాను సీరియల్స్ టీఆర్పీ రేటింగ్స్ బయటకు వచ్చాయి. సాధారణంగా ఎప్పుడూ స్టార్ మా, జీ తెలుగు సీరియల్సే టాప్ 10లో ఉండటం సహజం. ఈసారి కూడా అదే జరిగింది.
అయితే ఆశ్చర్యకరంగా జీ తెలుగు సీరియల్స్ టాప్ 5లోకి కూడా దూసుకువచ్చాయి. టాప్ 10ను ఈ రెండు ఛానెల్స్ సీరియల్స్ షేర్ చేసుకోవడం విశేషం. ఎప్పటిలాగే స్టార్ మాలో వచ్చే బ్రహ్మముడి సీరియల్ ఈసారి కూడా టాప్ లో కొనసాగింది. అయితే రెండోస్థానంలో నుంచే జాబితాలో మార్పులు జరిగాయి. అనూహ్యంగా జీ తెలుగు సీరియల్ ప్రేమ ఎంత మధురం రెండోస్థానంలోకి రావడం విశేషం.
టాప్ 5లో మూడు స్టార్ మా సీరియల్స్, రెండు జీ తెలుగు సీరియల్స్ ఉన్నాయి. స్టార్ మా నుంచి బ్రహ్మముడితోపాటు కృష్ణా ముకుందా మురారి, నాగ పంచమి సీరియల్స్ టాప్ 5లో ఉండగా.. జీ తెలుగు నుంచి ప్రేమ ఎంత మధురం, త్రినయని ఉన్నాయి. అయితే కేవలం అర్బన్ రేటింగ్స్ చూసినప్పుడు టాప్ 5లో జీ తెలుగు సీరియల్స్ ఉన్నాయి. అర్బన్, రూరల్ రేటింగ్స్ చూస్తే స్టార్ మా హవానే కొనసాగింది.