తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Hanuman Ott: భారీ ధరకు హనుమాన్ ఓటీటీ రైట్స్.. తేజ కెరీర్‌లో మైలురాయి.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Hanuman OTT: భారీ ధరకు హనుమాన్ ఓటీటీ రైట్స్.. తేజ కెరీర్‌లో మైలురాయి.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Sanjiv Kumar HT Telugu

12 January 2024, 12:18 IST

google News
  • Hanuman OTT Rights: జనవరి 12 శుక్రవారం విడుదలైన హనుమాన్ మూవీకి సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. ఈ నేపథ్యంలో హనుమాన్ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్, డిజిటల్ పార్టనర్, హక్కులపై ఆసక్తి నెలకొంది. ప్రముఖ ఓటీటీ సంస్థ హనుమాన్ మూవీని భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

భారీ ధరకు హనుమాన్ ఓటీటీ రైట్స్.. తేజ కెరీర్‌లో మైలురాయి.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?
భారీ ధరకు హనుమాన్ ఓటీటీ రైట్స్.. తేజ కెరీర్‌లో మైలురాయి.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?

భారీ ధరకు హనుమాన్ ఓటీటీ రైట్స్.. తేజ కెరీర్‌లో మైలురాయి.. ఎందులో స్ట్రీమింగ్ అంటే?

Hanuman OTT Release: ఇంతింతై.. వటుడింతై.. అన్నట్లు చిన్న సినిమాగా మొదలై భారీ చిత్రంగా ఇప్పుడు ప్రేక్షకులకు కనిపిస్తోంది హనుమాన్. మొదట తెలుగుతోపాటు భారతీయ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా నిర్మిద్దామనుకున్న హనుమాన్ మూవీ ఇప్పుడు అంతర్జాతీయ భాషల్లో సైతం విడుదలై పాన్ వరల్డ్ చిత్రంగా పేరు తెచ్చుకుంది. జనవరి 12న అంటే శుక్రవారం తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఇంగ్లీష్, స్పానిష్, కొరియన్, చైనీస్, జపనీస్ భాషల్లో హనుమాన్ విడుదలైంది.

హనుమాన్ సినిమాకు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. పెయిడ్ ప్రీమియర్స్, సినిమా షోస్ చూసిన ప్రేక్షకులు హనుమాన్ సినిమాను ఆకాశానికి ఎత్తుతున్నారు. డైరెక్టర్ ప్రశాంత్ వర్మపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. అంతేకాకుండా ఆదిపురుష్ డైరెక్టర్ ఓం రౌత్‌ను ఈ సినిమా చూసి నేర్చుకోమంటూ ఉచిత సలహాలు కూడా ఇస్తున్నారు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో హనుమాన్ మూవీతో సంక్రాంతి పండుగ వాతావరణం నెలకొంది.

ఈ నేపథ్యంలో హనుమాన్ ఓటీటీ హక్కులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. హనుమాన్ మూవీని ప్రముఖ ఓటీటీ జీ5 డిజిటల్ రైట్స్ సొంతం చేసుకుంది. ఇక మూవీ పాన్ ఇండియా స్థాయిలో ఉండటంతో దానికి తగినట్లుగానే ఓటీటీ హక్కులు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. హనుమాన్ సినిమాను జీ5 సంస్థ మొత్తంగా రూ. 16 కోట్లకు కొనుగోలు చేసినట్లు సమాచారం. అందులో హనుమాన్ తెలుగు వెర్షన్‌కు రూ. 11 కోట్లు, హిందీ వెర్షన్‌కు రూ. 5 కోట్లు వెచ్చించినట్లు టాక్.

దీంతో తేజ సజ్జా నటించిన నాలుగో సినిమాకు ఇంత పెద్ద స్థాయిలో ఓటీటీ హక్కులు అమ్ముడుపోవడం అతని కెరీర్‌లో మైలురాయిగా నిలిచింది. దీంతో తేజ సజ్జా రికార్డ్ కొట్టినట్లే. ఇక హనుమాన్ ఓటీటీ విడుదలపై భిన్నాభిప్రాయాలు వెలువడనున్నాయి. ఇప్పటికైతే సినిమా థియేట్రికల్ రిలీజ్‌ తర్వాత నాలుగు వారాలకు ఓటీటీలో విడుదల చేస్తారు. కొన్నిసార్లు సినిమా హిట్, ప్లాప్, కలెక్షన్స్‌ను బట్టి డేట్స్ మారుస్తుంటారు.

మరికొన్ని సార్లు సినిమాను ఎప్పుడు విడుదల చేయాలనేది ఓటీటీ సంస్థల చేతుల్లో ఉంటుంది. ప్రస్తుతానికి అయితే హనుమాన్ మూవీ మార్చి నెలలో ఓటీటీలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. మార్చి రెండో వారంలో హనుమాన్ ఓటీటీలోకి విడుదల అయ్యే అవకాశం ఉంది. అయితే, హనుమాన్ మూవీ మంచి థియేట్రికల్ సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ మూవీ అని చూసిన ప్రేక్షకులు అంటున్నారు. ఓటీటీ కంటే థియేటర్‌లో గ్రాఫికల్ విజువల్స్ బాగా ఎంజాయ్ చేయడానికి ఆస్కారం ఉంటుంది.

ఇదిలా ఉంటే హనుమాన్ మూవీని ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్‌పై కె నిరంజన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. హనుమాన్ చిత్రంలో తేజ సజ్జా హీరోగా, అమృత అయ్యర్ హీరోయిన్‌గా చేశారు. వీరితోపాటు సినిమాలో వినయ్ రాయ్, వరలక్ష్మీ శరత్ కుమార్, సముద్ర ఖని కీలక పాత్రలు పోషించగా.. రాజ్ దీపక్ శెట్టి, వెన్నెల కిశోర్, గెటప్ శ్రీను, సత్య ఇతరులు నటించారు. కాగా హనుమాన్ మూవీకి రూ. 50 కోట్ల బడ్జెట్ అయినట్లు సమాచారం.

50 కోట్ల బడ్జెట్‌లో హై క్వాలిటీ గ్రాఫిక్స్ తీశారని ఆడియెన్స్ మెచ్చుకుంటున్నారు. సంక్రాంతి విన్నర్ అంటూ పబ్లిక్ టాక్‌లో చెబుతున్నారు. ముఖ్యంగా హనుమాన్ మూవీలో బీజీఎమ్, ఎలివేషన్స్, క్లైమాక్స్ గూస్ బంప్స్ తెప్పించాయని ప్రశాంత్ వర్మను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం