తెలుగు న్యూస్  /  Entertainment  /  Swathimuthyam Trailer Launched As Bellamkonda Ganesh Making Tollywood Debut

Swathimuthyam Trailer: నవ్వులే నవ్వులు.. స్వాతిముత్యం మూవీ ట్రైలర్‌ వచ్చేసింది

HT Telugu Desk HT Telugu

26 September 2022, 15:44 IST

    • Swathimuthyam Trailer: నవ్వులే నవ్వులు పంచుతూ స్వాతిముత్యం మూవీ ట్రైలర్‌ వచ్చేసింది. సోమవారం (సెప్టెంబర్ 26) ఈ మూవీ ట్రైలర్‌ను మేకర్స్‌ లాంచ్‌ చేశారు.
స్వాతిముత్యం మూవీలో వర్ష బొల్లమ్మ
స్వాతిముత్యం మూవీలో వర్ష బొల్లమ్మ

స్వాతిముత్యం మూవీలో వర్ష బొల్లమ్మ

Swathimuthyam Trailer: స్వాతిముత్యం అంటూ మరో వారసుడు టాలీవుడ్‌ తెరపైకి వచ్చేస్తున్నాడు. అతని పేరు బెల్లంకొండ గణేష్. ఇతడు ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేశ్‌ రెండో తనయుడు. ఇప్పటికే టాలీవుడ్‌లో తనకంటూ ఓ పేరు సంపాదించుకున్న బెల్లంకొండ శ్రీనివాస్‌ తమ్ముడు. గణేష్‌ నటించిన స్వాతిముత్యం ట్రైలర్‌ సోమవారం (సెప్టెంబర్ 26) లాంచ్ అయింది.

ట్రెండింగ్ వార్తలు

Heeramandi: ఆ పాకిస్థాన్ నటీనటులతో హీరామండి వెబ్ సిరీస్: సంజయ్ లీలా భన్సాలీ సంచలన కామెంట్స్

Ramayana: రణ్‍బీర్ కపూర్, సాయిపల్లవి ఫొటోల లీక్‍తో దర్శకుడు సీరియస్.. కొత్తగా ఏ నిర్ణయం తీసుకున్నారంటే..

Zee Telugu New Serial: జీ తెలుగులో సరికొత్త సీరియల్ జానకి రామయ్యగారి మనవరాలు.. ఎప్పటి నుంచంటే?

Heeramandi OTT Streaming: తెలుగులోనూ స్ట్రీమింగ్‍కు వచ్చిన హీరామండి వెబ్ సిరీస్: వివరాలివే

ఈ సినిమాలో గణేష్ సరసన వర్ష బొల్లమ్మ నటిస్తోంది. మిడిల్‌ క్లాస్‌ మెలోడీస్‌ మూవీతో ఈ కన్నడ బ్యూటీ తెలుగు తెరకు పరిచయమైన విషయం తెలిసిందే. తన అందం, నటనతో ఆ మూవీలోనే ఆకట్టుకుంది. ఇప్పుడు మరో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఒకప్పటి విశ్వనాథ్‌, కమల్‌హాసన్‌ సూపర్‌ హిట్‌ మూవీ స్వాతిముత్యం టైటిల్‌తో వస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ చూస్తుంటే.. కామెడీ ఎంటర్‌టైనర్‌గా కనిపిస్తోంది.

ఓ హీరో, ఓ హీరోయిన్‌.. ఇద్దరి మధ్య ప్రేమ. పెళ్లి చేసుకుందామని డిసైడ్‌ అవుతారు. పెళ్లికి ఏర్పాట్లు కూడా జరుగుతుంటాయి. సడెన్‌గా ఓ సమస్య వచ్చి పడుతుంది. అది పెద్ద సమస్యే. అసలు ఆ సమస్య ఏంటి? ఇది వీళ్ల పెళ్లిని ఎలాంటి మలుపులు తిప్పింది? చివరికి ఈ సమస్యను పరిష్కరించి పెళ్లి చేసుకుంటారా అన్నది ఈ స్వాతిముత్యం కథ.

"నిన్న రాత్రి ఓ సినిమా చూశానండి. అందలోనూ హీరో, హీరోయిన్లు అచ్చూ మనలాగే కాఫీ షాప్‌లో కలుసుకుంటారు" అనే హీరోయిన్‌ డైలాగ్‌తో ఈ స్వాతిముత్యం ట్రైలర్‌ మొదలవుతుంది. ముందు లవ్‌ ప్రపోజ్‌ చేయడం, తర్వాత అందుకు హీరోయిన్‌ అంగీకరించడం, తర్వాత చాటింగ్‌లు, మీటింగ్‌లు జరిగిపోతూ ఉంటాయి. తీరా పెళ్లి సమయానికి మనం కొంచెం బుక్కయిపోయామంటూ ఇందులో కీలకమైన పాత్ర పోషిస్తున్న కమెడియన్‌ వెన్నెల కిశోర్‌ చెప్పడంతో కథ మలుపు తిరుగుతుంది.

ఈ ట్విస్ట్‌ తర్వాత కూడా ట్రైలర్‌ ఫన్నీగానే సాగిపోతూ ఉంటుంది. గోదావరి ప్రాంతంలో తీసిన ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను బాగా ఆకట్టుకునేలానే ఉంది. అయితే ఈ సినిమా గాడ్‌ఫాదర్‌, ఘోస్ట్‌లాంటి పెద్ద సినిమాలతో పోటీ పడుతూ దసరా సందర్భంగా అక్టోబర్‌ 5న రిలీజ్ కాబోతోంది. లక్ష్మణ్‌ కే కృష్ణ డైరెక్ట్‌ చేసిన ఈ స్వాతిముత్యం మూవీని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ తెరకెక్కించింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.