Bellamkonda Suresh |నా పిల్లల జోలికి వస్తే ఊరుకోను... లీగల్ గానే వాడికి నరకం చూపిస్తానంటున్న బెల్లంకొండ సురేష్-bellamkonda suresh denies false allegations against his family ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Bellamkonda Suresh Denies False Allegations Against His Family

Bellamkonda Suresh |నా పిల్లల జోలికి వస్తే ఊరుకోను... లీగల్ గానే వాడికి నరకం చూపిస్తానంటున్న బెల్లంకొండ సురేష్

Nelki Naresh HT Telugu
Mar 12, 2022 01:08 PM IST

అప్పు తీసుకొని ఎగ్గొట్టినట్లు తనపై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని అన్నారు నిర్మాత బెల్లంకొండ సురేష్. తప్పుడు ఆరోపణలు చేస్తూ తన కుమారుల పేరును డ్యామేజ్ చేయడానికి కొందరు ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.

బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బెల్లంకొండ సురేష్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, బెల్లంకొండ సురేష్ (twitter)

పిల్లలే తనకు పంచ ప్రాణాలు అని, వారికి జోలికి వచ్చిన  వారు ఎవరైనా వదిలిపెట్టనని అన్నారు నిర్మాత బెల్లంకొండ సురేష్. తాను ఎవరి  దగ్గర డబ్బులు తీసుకొని ఎగ్గొట్టలేదని,  తన పిల్లల ఎదుగుదలను ఓర్వలేకనే కొందరు తమ కుటుంబంపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆయన పేర్కొన్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ తో పాటు ఆయన కుమారుడు,హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్... చరణ్ అనే వ్యక్తి దగ్గర 85 లక్షలు అప్పు తీసుకున్నారని, ఆ అప్పు తిరిగి చెల్లించలేకపోవడంతో వారిపై కేసు నమోదైనట్లు ప్రచారం జరిగింది. ఈ వివాదంపై బెల్లంకొండ సురేష్ స్పందించారు. శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ చరణ్ తన ఊరికి చెందినవాడేనని,  టికెట్ల కోసం చాలా సార్లు ఫోన్ చేసేవాడని, అలాంటి వాడు తనకు డబ్బులు ఇచ్చాననడం పూర్తిగా అబద్దమని బెల్లంకొండ సురేష్ పేర్కొన్నారు. తాను డబ్బులు ఎగ్గొట్టినట్లు ఆధారాలు ఉండే చూపించాలని డిమాండ్ చేశారు. చరణ్ వెనకాల ఎవరు ఉండి ఈ నాటకాన్ని నడిపిస్తున్నారో తనకు తెలుసునని..ఎవరిని వదిలిపెట్టనని హెచ్చరించారు. ‘నా కుమారులు సాయిశ్రీనివాస్, గణేష్ ఎవరితో గొడవలు పడలేదు. సినిమా చేస్తానని మాటిచ్చి ఏ రోజు వెనక్కి తగ్గలేదు. మా అబ్బాయిల జోలికి రావడం బాధపెట్టింది. కోర్టు ద్వారా వాడిపై పరువు నష్టం దావా వేస్తా. క్రిమినల్ కేసు పెట్టబోతున్నా’ అని తెలిపారు. ఇల్లీగల్ కాకుండా లీగల్ గానే వారిని ఎదుర్కొంటానని, నరకం చూపిస్తానని అన్నారు. ‘శ్రీనివాస్ సినిమాలకు మంచి టీఆర్పీలు వస్తున్నాయి. ‘సీత’  సినిమా తెలుగులో పరాజయం పాలైన హిందీలో హిట్ అయ్యింది. అతడి ఇమేజ్ ను డ్యామేజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నాడు. మా అబ్బాయిని చరణ్ ఎప్పుడూ కలవలేదు’ అని చెప్పారు. 

నోటీసులు వచ్చాయన్నది అబద్దం

కోర్టు, పోలీసుల నుండి తనకు ఎలాంటి నోటీసులు రాలేదని బెల్లంకొండ సురేష్ పేర్కొన్నారు. ‘అప్పు ఇచ్చినట్లు ఆధారాలు ఉంటే చూపించమని చరణ్ కు  పోలీసులు పంపించిన  నోటీసును నాకు వచ్చినట్లుగా చూపిస్తూ మా కుటుంబానిపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. తన దగ్గర మేము డబ్బు తీసుకున్నట్లు ఆధారాలు ఉంటే పోలీసుల దగ్గరకు  వెళ్లాలి. కానీ మీడియా ముందు ఇష్టం వచ్చినట్లు మాట్లాడటం సరికాదు. ఈ ఆరోపణలు చేస్తున్న వారు క్షమించమని అడిగినా కూడా  నేను వాళ్లను వదిలిపెట్టను. తప్పుడు కేసులు, బ్లాక్ మెయిలింగ్ చేస్తున్న వారికి గుణపాఠం చెప్పి తీరుతాను’ అని బెల్లంకొండ సురేష్ అన్నారు. 

IPL_Entry_Point