తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Suresh Krishna Police Story: డైరెక్ట్‌గా ఓటీటీలోకి బాషా డైరెక్ట‌ర్ సురేష్ కృష్ణ పోలీస్ స్టోరీ మూవీ

Suresh Krishna Police Story: డైరెక్ట్‌గా ఓటీటీలోకి బాషా డైరెక్ట‌ర్ సురేష్ కృష్ణ పోలీస్ స్టోరీ మూవీ

HT Telugu Desk HT Telugu

24 July 2023, 12:02 IST

google News
  • Suresh Krishna Police Story: బాషా ఫేమ్ సురేష్ కృష్ణ నిర్మించిన తెలుగు మూవీ పోలీస్ స్టోరీ డైరెక్ట్‌లో ఓటీటీలో రిలీజ్ కానుంది. ఏ ఓటీటీలో ఎప్పుడు ఈ మూవీ రిలీజ్ కానుందంటే...

 పోలీస్ స్టోరీ మూవీ
పోలీస్ స్టోరీ మూవీ

పోలీస్ స్టోరీ మూవీ

Suresh Krishna Police Story: ర‌జ‌నీకాంత్ బాషా, చిరంజీవి మాస్ట‌ర్‌, డాడీ, ప్ర‌భాస్ రాఘ‌వేంద్ర‌తో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో స్టార్ హీరోల‌తో ప‌లు సినిమాల్ని తెర‌కెక్కించాడు సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సురేష్ కృష్ణ‌. గ‌త ప‌దేళ్లుగా ఇండ‌స్ట్రీకి దూరంగా ఉంటోన్న సురేష్ కృష్ణ తాజాగా ప్రొడ్యూస‌ర్‌గా మారాడు. పోలీస్ స్టోరీ కేస్ వ‌న్ పేరుతో ఓ తెలుగు మూవీని నిర్మించాడు. రామ్ విఘ్నేష్ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలో రిలీజ్ కానుంది.

ఈటీవీ విన్ ఓటీటీలో జూలై 28 నుంచి ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. క్రైమ్ ఇన్వేస్టిగేష‌న్ థ్రిల్ల‌ర్‌గా రూపొందిన ఈ మూవీలో శ్రీనాథ్ మాగంటి, శ్వేతా అవ‌స్థి హీరోహీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమా ట్రైల‌ర్‌ ఇటీవ‌ల రిలీజైంది. ఓ ఐటీ కంపెనీలో అర్ధ‌రాత్రి 12 గంట‌ల‌కు మ‌ర్డ‌ర్ జ‌రుగుతుంది. సినిమాలు, న‌వ‌ల‌ల ద్వారా క్రైమ్ నుంచి త‌ప్పించుకోవ‌డం ఎలాగో తెలిసిన అస‌లైన క్రిమిన‌ల్‌ను ఓపోలీస్ ఆఫీస‌ర్ ఎలా ప‌ట్టుకున్నాడు?

ఈ కేసు ఇన్వేస్టిగేష‌న్‌లో పై అధికారుల నుంచి అత‌డికి ఎలాంటి ఒత్తిడులు ఎదుర‌య్యానే అంశాల‌తో ట్రైల‌ర్ ఇంట్రెస్టింగ్‌గా సాగింది. ఈ సినిమాకు మీనాక్షి భుజంగ్ సంగీతాన్ని అందించారు.

చిన్న సినిమాల్ని, వెబ్‌సిరీస్‌ల‌ను నిర్మించాల‌నే ఆలోచ‌న‌తో సురేష్ కృష్ణ ప్రైవేట్ లిమిటెడ్ అనే బ్యాన‌ర్‌ను సురేష్ కృష్ణ ప్రారంభించాడు. హిట్‌, హిట్ 2 తో పాటు ప‌లు సినిమాల్లో డిఫ‌రెంట్ క్యారెక్ట‌ర్స్ చేశాడు శ్రీనాథ్ మాగంటి.

తదుపరి వ్యాసం