Surekha Vani: ఆ క్వాలిటీస్ ఉన్న వాడు కావాలి - రెండో పెళ్లిపై సురేఖవాణి ఇంట్రెస్టింగ్ కామెంట్స్
26 August 2022, 10:41 IST
రెండో పెళ్లిపై నటి సురేఖవాణి (Surekha Vani) ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాను కోరుకునే లక్షణాలున్న వ్యక్తి దొరికితే తప్పకుండా మళ్లీ పెళ్లి చేసుకుంటానని తెలిపింది.
సురేఖవాణి
గత కొన్నాళ్లుగా సినిమా కంటే సోషల్ మీడియా ద్వారానే ఎక్కువగా వార్తల్లో నిలుస్తోంది సురేఖవాణి. తన కూతురు సుప్రితతోకలిసి ఆమె పోస్ట్ చేసిన వీడియోలు పలు మార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోల్లో అందాల ప్రదర్శన విషయంలో కూతురితో పోటీపడుతూ కనిపించింది సురేఖవాణి. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తన రెండో పెళ్లిపై ఆమె ఆసక్తికర కామెంట్స్ చేసింది.
రెండో పెళ్లికి దూరంగా ఉండాలని అనుకున్నానని, కానీ తాను మళ్లీ పెళ్లి చేసుకుంటే చూడాలని ఉందని కూతురు సుప్రితఅడుగుతోందని సురేఖ వాణి చెప్పింది. సుప్రీత కోరిక భవిష్యత్తులో తీరుతుందికావచ్చునని సురేఖ వాణి పేర్కొన్నది. ‘మంచి హైట్, పర్సనాలిటీ తో పాటు బాగా డబ్బున్న వాడు బాయ్ ఫ్రెండ్ గా రావాలని కోరుకుంటున్నా. అన్నింటికంటే నా మనసును బాగా అర్థం చేసుకునే వాడై ఉండాలి. అలాంటి వ్యక్తి ఇప్పటివరకు ఎదురుపడలేదు.
ఒకవేళ దొరికితే తప్పకుండా అతడినే పెళ్లి చేసుకుంటా’ అని తెలిపింది. సురేఖవాణి భర్త తేజ అనారోగ్య సమస్యలతో చాలా ఏళ్ల క్రితమే చనిపోయాడు. కాగా సురేఖ వాణి కూతురు సుప్రిత త్వరలో త్వరలో హీరోయిన్ గా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది. లేచింది మహిళ లోకం అనే సినిమా చేయబోతున్నది. ఇందులో సుప్రితతో పాటు మంచు లక్ష్మి కీలక పాత్రను పోషిస్తోంది.