తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ott Movie: సుహాస్ నయా సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ చూడొచ్చంటే..

OTT Movie: సుహాస్ నయా సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ చూడొచ్చంటే..

07 October 2024, 20:42 IST

google News
    • Gorre Puranama OTT Release Date: గొర్రె పురాణం సినిమా మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఖరారైంది. ఈ చిత్రంలో సుహాస్ హీరోగా నటించారు. డిఫరెంట్ స్టోరీ పాయింట్‍తో ఈ మూవీ రూపొందింది. ఏ ఓటీటీలోకి ఎప్పుడు ఈ చిత్రం రానుందంటే..
Gorre Puranam OTT: సుహాస్ ‘గొర్రె పురాణం’ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ చూడొచ్చంటే.. 
Gorre Puranam OTT: సుహాస్ ‘గొర్రె పురాణం’ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ చూడొచ్చంటే.. 

Gorre Puranam OTT: సుహాస్ ‘గొర్రె పురాణం’ సినిమా స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్.. ఎక్కడ చూడొచ్చంటే.. 

యంగ్ టాలెంటెడ్ యాక్టర్ సుహాస్ వరుస సినిమాలతో జోరు మీద ఉన్నారు. డిఫరెంట్ స్టోరీలను సెలెక్ట్ చేసుకుంటున్నారు. సుహాస్ హీరోగా నటించిన ‘గొర్రె పురాణం’ చిత్రం సెప్టెంబర్ 21వ తేదీన థియేటర్లలో రిలీజైంది. టైటిల్‍తోనే ఈ మూవీ ఆసక్తిని పెంచింది. ట్రైలర్ కూడా క్యూరియాసిటీ అధికం చేసింది. అయితే, థియేటర్లలోకి వచ్చాక గొర్రె పురాణం మూవీకి మిక్స్డ్ టాక్ వచ్చింది. ఇప్పుడు ఈ మూవీ ఓటీటీలోకి వచ్చే సిద్ధమైంది.

స్ట్రీమింగ్ డేట్ ఇదే

గొర్రె పురాణం సినిమా ఈ గురువారమే అక్టోబర్ 10వ తేదీన ఆహా ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఈ విషయాన్ని ఆ ప్లాట్‍ఫామ్ నేడు (అక్టోబర్ 10) వెల్లడించింది. ఈ చిత్రాన్ని త్వరలో తీసుకొస్తామంటూ ఆహా కొంతకాలంగా చెబుతూ వస్తోంది. ఇప్పుడు అక్టోబర్ 10న స్ట్రీమింగ్‍కు వస్తుందని డేట్ రివీల్ చేసింది ఆహా.

20 రోజులకే..

గొర్రె పురాణం చిత్రానికి థియేటర్లలో మిక్స్డ్ టాక్ వచ్చింది. అంచనాలను పెట్టుకున్న విధంగా ఈ చిత్రం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఆశించిన స్థాయిలో థియేట్రికల్ రన్, కలెక్షన్లు రాలేదు. దీంతో ఈ సినిమా థియేటర్లలో విడుదలైన 20 రోజులకే ఓటీటీలోకి స్ట్రీమింగ్‍కు వచ్చేస్తోంది. అక్టోబర్ 10న ఆహా ఓటీటీలో అడుగుపెట్టనుంది.

ముందుగా గొర్రె పురాణం మూవీని ఓటీటీకే మేకర్స్ అనుకున్నారట. అయితే సుహాస్ ఫుల్ ఫామ్‍లో ఉండటంతో థియేటర్ రిలీజ్‍ను ఎంచుకున్నారు. అయితే, ఆశించిన స్థాయిలో బాక్సాఫీస్ వద్ద ఫలితాన్ని ఈ చిత్రం దక్కించుకోలేదు. దీంతో మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తోంది. సుహాస్ హీరోగా నటించిన ప్రసన్న వదనం మూవీ ఆహా ఓటీటీలో భారీ వ్యూస్ దక్కించుకుంది. గొర్రె పురాణం ఎలా పర్ఫార్మ్ చేస్తుందో చూడాలి.

గొర్రె పురాణం చిత్రానికి బాబీ దర్శకత్వం వహించారు. రెండు వర్గాల మధ్య గొడవలకు గొర్రె ఎలా కారణమైందనే విషయం చుట్టూ ఈ మూవీ స్టోరీ సాగుతుంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌తో ఈ సినిమా వచ్చింది. అయితే, నరేషన్ నిరాశపరిచింది. ఈ మూవీలో సుహాస్‍తో పాటు పోసాని కృష్ణమురళి, రఘు కారుమంచి కీలకపాత్రలు చేశారు.

గొర్రె పురాణం మూవీకి పవన్ సీహెచ్ సంగీతం అందించగా.. సురేశ్ సారంగం సినిమాటోగ్రఫీ చేశారు. ప్రవీణ్ రెడ్డి ఈ చిత్రాన్ని ప్రొడ్యూజ్ చేశారు.

గొర్రె పురాణం స్టోరీలైన్

గొర్రె వల్ల హిందూ, ముస్లింల మధ్య గొడవలు జరగడం చుట్టూ గొర్రె పురాణం స్టోరీ నడుస్తుంది. ఓ హత్య కేసులో రవి (సుహాస్) జైలులో ఉంటాడు. కాగా, ఓ గొర్రెను బక్రీద్ కోసం అని రఫీక్ అనే ముస్లిం కొంటాడు. అయితే, అతడి వారి నుంచి తప్పించుకుంటుంది. గుడిలోకి ఆ గొర్రె వెళుతుంది. దీంతో దాన్ని తామే బలిస్తామంటూ హిందువులు వాదిస్తారు. మొత్తంగా హిందువులు, ముస్లింలు ఆ గొర్రె కోసం గొడవ పడతారు. ఇది కోర్టు వరకు చేరుతుంది. గొర్రె విషయంలో చివరికి ఏం తేలింది? దీని వెనుక కారణం ఏంటి? గొర్రెకు రవికి ఉన్న సంబంధం ఏంటి? అతడు ఎందుకు జైలు పాలయ్యాడనే విషయాలు గొర్రె పురాణం మూవీలో ప్రధానంగా ఉంటాయి. అక్టోబర్ 10 నుంచి ఈ మూవీని ఆహాలో చూసేయవచ్చు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం