తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ssmb28 Shooting: మహేష్ బాబు యాక్షన్ సీక్వెన్స్.. ప్రారంభమైన ఎస్ఎస్ఎంబీ28 కొత్త షెడ్యూల్

SSMB28 Shooting: మహేష్ బాబు యాక్షన్ సీక్వెన్స్.. ప్రారంభమైన ఎస్ఎస్ఎంబీ28 కొత్త షెడ్యూల్

Hari Prasad S HT Telugu

18 January 2023, 17:57 IST

    • SSMB28 Shooting: మహేష్ బాబు యాక్షన్ సీక్వెన్స్ తో తన కొత్త మూవీ కొత్త షెడ్యూల్ ప్రారంభించాడు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో ఎస్ఎస్ఎంబీ28 మూవీ షూటింగ్ హైదరాబాద్ లో మొదలైంది.
మహేష్ బాబు, త్రివిక్రమ్
మహేష్ బాబు, త్రివిక్రమ్

మహేష్ బాబు, త్రివిక్రమ్

SSMB28 Shooting: సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్. కొత్త ఏడాది మహేష్ కొత్త సినిమా కొత్త షెడ్యూల్ ఘనంగా ప్రారంభమైంది. సర్కారు వారి పాట సినిమా తర్వాత మరో మహేష్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఈ మధ్యే ఎస్ఎస్ఎంబీ 28 టీమ్ గుడ్ న్యూస్ చెప్పిన విషయం తెలిసిందే. ఈ సినిమాను ఆగస్ట్ 11న రిలీజ్ చేయనున్నట్లు అనౌన్స్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

Romeo OTT Release Date: విజయ్ ఆంటోనీ ‘రోమియో’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందంటే..

Manjummel Boys OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మల్ బాయ్స్: స్ట్రీమింగ్ వివరాలివే

Heeramandi OTT: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు

Sundar C: దేశం గర్వించే చిత్రం అవుతుంది.. తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ సుందర్ కామెంట్స్

ఇక ఇప్పుడీ మూవీ మరో షెడ్యూల్ కూడా ప్రారంభమైంది. హైదరాబాద్ లోని సారథి స్టూడియోస్ లో ఎస్ఎస్ఎంబీ 28 షూటింగ్ చేస్తున్నారు. ఇందులో భాగంగా మహేష్ బాబుపై యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరించారు. ఈ షెడ్యూల్ కు సంబంధించి పూర్తి వివరాలు రానున్న రోజుల్లో తెలియనున్నాయి. మార్చి 30 వ‌ర‌కు ఏక‌ధాటిగా షూటింగ్‌ను జ‌రుప‌నున్న‌ట్లు తెలిసింది.

ఈ షెడ్యూల్‌లో మ‌హేష్‌బాబు, పూజాహెగ్డేతో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించేందుకు ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ప్లాన్ చేస్తున్నారు. ఈ మూవీలో మహేష్ సరసన పూజా హెగ్డే, శ్రీలీల నటిస్తున్నారు. మరోవైపు షూటింగ్ పూర్తికాక‌ముందే ఈ సినిమా డిజిట‌ల్ రైట్స్‌ను నెట్‌ఫ్లిక్స్ భారీ ధ‌ర‌కు ద‌క్కించుకొంది. ఈ సినిమా డిజిట‌ల్‌రైట్స్‌ను కొనుగోలు చేసిన విష‌యాన్ని స్వ‌యంగా నెట్‌ఫ్లిక్స్ వెల్ల‌డించింది.

ఇక ఈ ఎస్ఎస్ఎంబీ 28కి తమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తోంది. నిజానికి ఈ సినిమాను రానున్న వేసవిలోనే రిలీజ్ చేయాలని భావించినా.. గతేడాది కృష్ణ మరణంతో మూవీ షూటింగ్ చాలా రోజుల పాటు నిలిచిపోయింది. దీంతో రిలీజ్ డేట్ ను వేసవి నుంచి ఆగస్ట్ నెలకు మార్చాల్సి వచ్చింది. ఈ సినిమా తర్వాత మహేష్.. రాజమౌళితో ఓ భారీ బడ్జెట్ సినిమా చేయనున్న విషయం తెలిసిందే.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.