తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Comedy Stock Exchange: అప్పుడు సుడిగాలి సుధీర్ - ఇప్పుడు శ్రీముఖి - కామెడీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ సీజ‌న్‌2కు యాంక‌ర్ ఛేంజ్‌!

Comedy Stock Exchange: అప్పుడు సుడిగాలి సుధీర్ - ఇప్పుడు శ్రీముఖి - కామెడీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ సీజ‌న్‌2కు యాంక‌ర్ ఛేంజ్‌!

28 November 2023, 10:10 IST

google News
  • Comedy Stock Exchange Season 2: కామెడీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ సీజ‌న్ 2 కు కొత్త యాంక‌ర్ వ‌చ్చేసింది. సీజ‌న్ వ‌న్‌కు సుడిగాలి సుధీర్‌, దీపికా యాంక‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రించారు. సీజ‌న్‌లో మాత్రం వారి స్థానంలో శ్రీముఖి క‌నిపించింది.

కామెడీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ సీజ‌న్ 2
కామెడీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ సీజ‌న్ 2

కామెడీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ సీజ‌న్ 2

Comedy Stock Exchange Season 2: జ‌బ‌ర్ధ‌స్త్‌కు పోటీగా కామెడీ స్టాక్ఎక్స్‌ఛేంజ్ పేరుతో ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్‌ కొత్త షోను మొద‌లుపెట్టింది.అనిల్ రావిపూడి జ‌డ్జ్‌గా ప్రారంభ‌మైన ఈ షోకు సుడిగాలి సుధీర్‌, దీపికా యాంక‌ర్స్‌గా వ్య‌వ‌హ‌రించారు. జ‌బ‌ర్ధ‌స్త్ తో పాపుల‌ర్ అయిన ప‌లువురు క‌మెడియ‌న్స్ కామెడీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్‌లో కంటెస్టెంట్స్‌గా పాల్గొన్నారు.

కామెడీ స్టాక్ ఎక్స్‌ఛేంజ్ ఫ‌స్ట్ సీజ‌న్ అనుకున్నంత‌గా స‌క్సెస్ కాలేక‌పోయింది. ఈ సారి ప‌లు మార్పుల‌తో సీజ‌న్ 2ను మొద‌లుపెట్ట‌బోతున్నారు. కామెడీ స్టాక్ఎక్స్‌ఛేంజ్ సీజ‌న్ 2 ప్రోమోను ఆహా ఓటీటీ రిలీజ్ చేసింది. ఈ ప్రోమోలో సుధీర్‌, దీపికా స్థానంలో శ్రీముఖి యాంక‌ర్‌గా క‌నిపించింది. న‌వంబ‌ర్ 30 నుంచి సీజ‌న్ 2 స్ట్రీమింగ్ కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ఈ సీజ‌న్‌లో అన్ని డ‌బుల్‌...ఎంట‌ర్‌టైన్‌మెంట్ అన్‌స్టాప‌బుల్ అంటూ ఈప్రోమోలో అనిల్ రావిపూడి చెప్ప‌డం ఆస‌క్తిని పంచుతోంది. హ‌రి, స‌ద్దాం. రోహిణి, అవినాష్‌తో పాటు చాలా మంది కంటెస్టెంట్స్ త‌మ కామెడీతో ఎంట‌ర్‌టైన్‌చేస్తూ ప్రోమోలో క‌నిపించారు. కంటెస్టెంట్స్‌పై అనిల్ రావిపూడి ప‌లు పంచ్‌లు చేయ‌డం ప్రోమోకుహైలైట్‌గా నిలిచింది.

న‌రేష్‌, శివాని రాజ‌శేఖ‌ర్‌, ద‌క్షా న‌గార్క‌ర్‌తో పాటు ప‌లువురు సెల‌బ్రిటీలు ఈ షోలో సంద‌డి చేసిన‌ట్లుగా చూపించారు. బాల‌కృష్ణ, అనిల్ రావిపూడి కాంబోలో రూపొందిన భ‌గ‌వంత్ కేస‌రి మూవీ ద‌స‌రాకు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మ‌హిళా సాధికార‌త‌కు యాక్ష‌న్ మాస్ అంశాల‌ను జోడిస్తూ తెర‌కెక్కిన ఈ సినిమా వంద కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. ఇటీవ‌లే అమెజాన్ ప్రైమ్‌లో రిలీజైన ఈ ట్రెండింగ్‌లో ఉంది.

తదుపరి వ్యాసం