OTT Comedy Thriller: థియేటర్లలో ప్లాఫ్.. ఓటీటీలో హిట్.. నేషనల్ వైడ్‍లో ట్రెండ్ అవుతున్న కామెడీ థ్రిల్లర్ చిత్రం
29 October 2024, 15:17 IST
- Swag OTT Streaming: స్వాగ్ చిత్రం ఓటీటీలో దుమ్మురేపుతోంది. థియేటర్లలో ఫట్ అయినా ఓటీటీలో మాత్రం దూసుకెళుతోంది. నేషనల్ వైడ్‍లో ఈ చిత్రం ట్రెండ్ అవుతోంది. భారీ వ్యూస్ సాధిస్తోంది.
OTT Telugu Comedy Thriller: థియేటర్లలో ప్లాఫ్.. ఓటీటీలో హిట్.. నేషనల్ వైడ్‍లో ట్రెండ్ అవుతున్న కామెడీ థ్రిల్లర్ చిత్రం
యంగ్ హీరో శ్రీవిష్ణు నటించిన శ్వాగ్ చిత్రం చాలా హైప్ మధ్య థియేటర్లలోకి వచ్చింది. ఫస్ట్ లుక్ నుంచి ట్రైలర్ వరకు ఈ చిత్రంపై అంచనాలు పెరుగుతూనే వచ్చాయి. అక్టోబర్ 4వ తేదీన ఈ క్రేజీ కామెడీ థ్రిల్లర్ మూవీ థియేటర్లలోకి వచ్చింది. అయితే, శ్వాగ్ చిత్రానికి మిక్స్డ్ టాక్ వచ్చింది. శ్రీవిష్ణు నటనకు ప్రశంసలు విపరీతంగా వచ్చినా.. చిత్రంపై మిశ్రమ స్పందనలు వినిపించాయి. దీంతో అనుకున్న స్థాయిలో కలెక్షన్లు రాలేదు.
థియేటర్లలో కమర్షియల్‍గా ప్లాఫ్‍గా నిలిచిన శ్వాగ్ మూవీ ఓటీటీలో మాత్రం శ్వాగ్ సత్తాచాటుతోంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో భారీ వ్యూస్‍తో దూసుకెళుతోంది. థియేటర్లలో చూడని చాలా మంది ఓటీటీలో ఈ మూవీని చూసి ప్రశంసిస్తున్నారు.
నేషనల్ వైడ్‍లో టాప్‍లో..
శ్వాగ్ చిత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో అక్టోబర్ 25వ తేదీన సడెన్‍గా స్ట్రీమింగ్‍కు వచ్చింది. థియేటర్లలో రిలీజైన 21 రోజుల్లోనే ఓటీటీలోకి అడుగుపెట్టింది. అయితే, మంచి క్రేజ్ ఉన్న ఈ మూవీకి మొదటి నుంచే మంచి వ్యూస్ దక్కాయి. అలాగే ఓటీటీ రిలీజ్ తర్వాత సోషల్ మీడియాలో పాజిటివ్ బజ్ రావటంతో ఈ చిత్రానికి క్రేజ్ మరింత పెరిగింది. దీంతో వ్యూస్ కూడా భారీగా పెరిగేశాయి. దీంతో అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో ప్రస్తుతం శ్వాగ్ చిత్రం నేషనల్ వైడ్‍లో టాప్ ప్లేస్‍లో ట్రెండ్ అవుతోంది.
విష్ణు నటనపై ప్రశంసలు
శ్వాగ్ చిత్రంలో శ్రీవిష్ణు ఐదు విభిన్నమైన పాత్రలు పోషించారు. ఎనిమిది గెటప్‍ల్లో కనిపించారు. ఈ చిత్రంలో విష్ణు నటనపై ప్రశంసలు భారీ స్థాయిలో వస్తున్నాయి. పాత్రలకు తగ్గట్టు వేరియేషన్లను కూడా శ్రీవిష్ణు అద్భుతంగా చూపించారని, అన్ని క్యారెక్టర్లకు పూర్తి న్యాయం చేశారని నెటిజన్లు పోస్టులు చేస్తున్నారు. విష్ణు వేసిన గెటప్‍ల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. థియేటర్లలో మిస్ అయ్యామంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. విష్ణు కెరీర్లో ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అంటూ రాసుకొస్తున్నారు.
మొత్తంగా ఓటీటీ రిలీజ్ తర్వాత ‘శ్వాగ్’ మూవీకి ఫుల్ క్రేజ్ వచ్చేసింది. ఈ మూవీని కొన్ని సీన్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఈ చిత్రాన్ని యంగ్ డైరెక్టర్ హర్షిత్ గోలీ డిఫరెంట్‍గా తెరకెక్కించారు. నరేషన్ విభిన్నంగా ట్రై చేశారు. థియేటర్లలో రిలీజైనప్పుడు నరేషన్ విషయంలోనూ ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ రెస్పాన్స్ వచ్చింది. అయితే, ఓటీటీలో వచ్చాక మాత్రం ఈ చిత్రంపై ప్రశంసలు కురుస్తున్నాయి.
శ్వాగ్ చిత్రంలో శ్రీవిష్ణుతో పాటు రితూ వర్మ, దక్ష నగార్కర్, మీరా జాస్మిన్, సునీల్, రవిబాబు, గెటప్ శ్రీను, గోపరాజు రమణ్ కీలకపాత్రలు పోషించారు. కామెడీ థ్రిల్లర్ కొన్ని తరాల మధ్య సాగే కథతో డిఫరెంట్ స్టోరీ లైన్‍తో ఈ మూవీని డైరెక్టర్ హర్షిత్ గోలీ రూపొందించారు. ఈ మూవీని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వప్రసాద్ ప్రొడ్యూజ్ చేశారు. వివేక్ సాగర్ సంగీతం అందించారు. వేద రమణ్ సినిమాటోగ్రఫీ చేసిన ఈ మూవీకి విప్లవ్ నైషాదం ఎడిటింగ్ చేశారు.