తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Squid Game: వివాదంలో స్క్విడ్ గేమ్ సిరీస్‍‍.. కోర్టుకెక్కిన బాలీవుడ్ డైరెక్టర్.. స్పందించిన నెట్‍ఫ్లిక్స్

Squid Game: వివాదంలో స్క్విడ్ గేమ్ సిరీస్‍‍.. కోర్టుకెక్కిన బాలీవుడ్ డైరెక్టర్.. స్పందించిన నెట్‍ఫ్లిక్స్

15 September 2024, 14:02 IST

google News
    • Squid Game Web Series - Soham Shah: పాపులర్ వెబ్ సిరీస్ స్క్విడ్ గేమ్ వివాదంలో చిక్కుకుంది. తమ చిత్రాన్ని కాపీ చేసి ఆ సిరీస్ తీశారని బాలీవుడ్ డైరెక్టర్ సోహమ్ షా కోర్టుకెక్కారు. దీనిపై నెట్‍ఫ్లిక్స్ కూడా స్పందించింది.
Squid Game: వివాదంలో స్క్విడ్ గేమ్ సిరీస్‍‍.. కోర్టుకెక్కిన బాలీవుడ్ డైరెక్టర్..  స్పందించిన నెట్‍ఫ్లిక్స్
Squid Game: వివాదంలో స్క్విడ్ గేమ్ సిరీస్‍‍.. కోర్టుకెక్కిన బాలీవుడ్ డైరెక్టర్.. స్పందించిన నెట్‍ఫ్లిక్స్

Squid Game: వివాదంలో స్క్విడ్ గేమ్ సిరీస్‍‍.. కోర్టుకెక్కిన బాలీవుడ్ డైరెక్టర్.. స్పందించిన నెట్‍ఫ్లిక్స్

‘స్క్విడ్ గేమ్’ వెబ్ సిరీస్ గ్లోబల్ రేంజ్‍లో సూపర్ సక్సెస్ అయింది. 2021లో నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో వచ్చిన ఈ కొరియన్ సర్వైవల్ థ్రిల్లర్ సిరీస్ భారీ స్థాయిలో వ్యూస్ దక్కించుకొని రికార్డులను బద్దలుకొట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సిరీస్ పేరు మార్మోగింది. ఇండియాలోనూ ఈ సిరీస్‍కు భారీగా ఆదరణ దక్కింది. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న సిరీస్‍గా చరిత్ర సృష్టించింది. రెండో సీజన్‍కు కూడా డేట్ ఫిక్స్ అయింది. అయితే, ఇంతలోనే స్విడ్ గేమ్ సిరీస్ వివాదంలో చిక్కుకుంది. తమ సినిమా కాన్సెప్ట్‌ను స్విడ్ గేమ్ మేకర్స్ కాపీ కొట్టారంటూ ఓ బాలీవుడ్ దర్శకుడు కోర్టును ఆశ్రయించారు. దీనికి నెట్‍ఫ్లిక్స్ కూడా స్పందించింది.

‘స్టోరీలైన్ కాపీ కొట్టారు’

తాను తెరకెక్కించిన లక్ (2009) చిత్రం నుంచి స్టోరీలైన్‍ను స్విడ్ గేమ్ మేకర్స్ కాపీ కొట్టారని బాలీవుడ్ దర్శకుడు సోహమ్ షా ఆరోపించారని టీఎంజెడ్ రిపోర్ట్ పేర్కొంది. ఈ విషయంపై ఆయన న్యూయార్క్‌లోని ఓ కోర్టులో కేసు కూడా నమోదు చేశారట. 2009లో వచ్చిన తన మూవీ కథను తీసుకొని.. స్క్విడ్ గేమ్ కథ రాసుకున్నారని ఆయన విమర్శించారు. నెట్‍ఫ్లిక్స్ ఓటీటీపై కేసు వేశారు.

స్క్విడ్ గేమ్‍లోని క్యారెక్టర్లతో సహా అన్నీ లక్‍ను పోలి ఉన్నాయని సోహమ్ షా పేర్కొన్నట్టు ఆ రిపోర్ట్ వెల్లడించింది. “స్విడ్‍గేమ్‍లోని ప్రధానమైన కథ, పాత్రలు, థీమ్స్, మూడ్, సెట్టింగ్, సిరీస్‍లో జరిగే ఘటనలు.. మా లక్ సినిమానే పోలి ఉన్నాయి. ఇది ఎట్టిపరిస్థితుల్లో యాధృచ్ఛికం కాదు” అని సోహమ్ ఆరోపించారు.

సినిమా చూసి కథ రాశారు

స్కిడ్‍ గేమ్ క్రియేటర్ హ్వాంగ్ డాంగ్ హ్యుక్‍ పేరును కూడా కేసులో సోహమ్ పొందుపరిచినట్టు తెలుస్తోంది. తాను తెరకెక్కించిన లక్ చిత్రం 2009లో రిలీజ్ అయిందని, హ్వాంగ్ కూడా అదే ఏడాది స్క్విడ్ గేమ్ కథ రాసుకున్నారని తెలిపారు. 2009 జూన్‍లో తమ చిత్రం ఇండియాతో పాటు యునైటెడ్ కింగ్‍డమ్, అమెరికా, యూఈఏలో రిలీజ్ అయిందని సోహమ్ తెలిపారు. అదే ఏడాది తన సినిమా చూసి అదే ఏడాది హ్వాంగ్ డాంగ్.. స్క్విడ్ గేమ్ కథ రాసుకున్నారని ఆరోపించారు.

స్పందించిన నెట్‍ఫ్లిక్స్

సోహమ్ షా చేసిన ఆరోపణలపై నెట్‍ఫ్లిక్స్ సంస్థ స్పందించింది. వాటిలో నిజం లేదంటూ కొట్టిపారేసింది. “ఆ ఆరోపణల్లో నిజాలు లేవు. స్విడ్ గేమ్‍ను హ్వాంగ్ డాంగ్ హ్యుక్ క్రియేట్ చేశారు. మేం దీన్ని ఎదుర్కొంటాం” అని పేర్కొంది.

లక్ మూవీ గురించి..

సోహమ్ షా దర్శకత్వం వహించిన లక్ చిత్రంలో సంజయ్ దత్, ఇమ్రాన్ ఖాన్, శృతి హాసన్ ప్రధాన పాత్రలు పోషించారు. ఓ జాక్‍పాట్ సాధించేందుకు ఓ గ్రూప్‍లోని కొందరు సభ్యులు ప్రమాదకమైన గేమ్స్ ఆడుతుంటారు. ఒక్కో ప్లేయర్ చనిపోయే కొద్దీ ప్రైజ్‍మనీ పెరుగుతుంటుంది. స్క్విడ్ గేమ్ వెబ్ సిరీస్ స్టోరీలైన్ దీనికి దగ్గరిగా ఉంటుంది. అయితే, ఈ సిరీస్‍లో చాలా పాత్రలు ఉంటాయి. కొత్త ప్రపంచాన్ని మేకర్స్ సృష్టించారు. గేమ్స్ వేరుగా ఉంటాయి.

స్క్విడ్ గేమ్ రెండో సీజన్ డేట్ ఇదే

స్క్విడ్ గేమ్ రెండో సీజన్ రెడీ అవుతోంది. ఈ సీజన్ ఈ ఏడాది డిసెంబర్ 26వ తేదీన నెట్‍ఫ్లిక్స్ ఓటీటీలో స్ట్రీమింగ్‍కు రానుంది. ఇప్పటికే డేట్‍పై అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. ఈ తరుణంలో ఈ వివాదం తెరపైకి వచ్చింది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం