తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Skanda Twitter Review: స్కంద ట్విట్ట‌ర్ రివ్యూ - రామ్‌, బోయ‌పాటి మూవీ ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉందంటే?

Skanda Twitter Review: స్కంద ట్విట్ట‌ర్ రివ్యూ - రామ్‌, బోయ‌పాటి మూవీ ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉందంటే?

HT Telugu Desk HT Telugu

28 September 2023, 6:39 IST

google News
  • Skanda Twitter Review: రామ్ హీరోగా బోయ‌పాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వంలో ఫ‌స్ట్‌టైమ్ రూపొందిన‌ స్కంద మూవీ గురువారం వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందిన ఈ సినిమాలో శ్రీలీల హీరోయిన్‌గా న‌టించింది.

స్కంద మూవీ
స్కంద మూవీ

స్కంద మూవీ

Skanda Twitter Review: రామ్ పోతినేని, బోయ‌పాటి శ్రీను కాంబినేష‌న్‌లో రూపొందిన స్కంద మూవీ గురువారం(సెప్టెంబ‌ర్ 28న‌) పాన్ ఇండియ‌న్ లెవెల్‌లో రిలీజైంది. ఈ సినిమా టీజ‌ర్‌, ట్రైల‌ర్స్ లో కంప్లీట్ ఔట్ అండ్ ఔట్ మాస్ క్యారెక్ట‌ర్‌లో రామ్ క‌నిపించి ఆడియెన్స్‌ను స‌ర్‌ప్రైజ్ చేశాడు. ఇందులో రామ్‌కు జోడీగా శ్రీలీల హీరోయిన్‌గా న‌టించింది. యూత్‌లో ఆమెకున్న క్రేజ్ కూడా స్కంద‌కు ప్ల‌స్స‌యింది. స్కంద మూవీ ఓవ‌ర్‌సీస్ ప్రీమియ‌ర్స్ టాక్ ఎలా ఉందంటే?

టిపిక‌ల్ క‌మ‌ర్షియ‌ల్ మూవీ...

బోయ‌పాటి శ్రీను త‌న సినిమాల్లో క‌థ‌కంటే మాస్‌, యాక్ష‌న్ అంశాలు, ఎలివేష‌న్స్‌కే ఇంపార్టెన్స్ ఇస్తారు. స్కంద కూడా అలాగే సాగింద‌ని ఓవ‌ర్‌సీస్ ఆడియెన్స్ చెబుతోన్నారు. టిపిక‌ల్ మాస్ మ‌సాలా క‌మ‌ర్షియ‌ల్ టెంప్లేట్ సినిమా ఇద‌ని అంటున్నారు. యాక్ష‌న్ ల‌వ‌ర్స్ కు ఈ సినిమా మంచి ట్రీట్‌లా ఉంటుంద‌ని కామెంట్స్ వినిపిస్తున్నాయి. కంప్లీట్ ర‌గ్గ్‌డ్ లుక్‌లో రామ్ క్యారెక్ట‌ర్, డైలాగ్ డెలివ‌రీ కొత్త‌గా ఉన్నాయ‌ని పేర్కొంటున్నారు. అత‌డిపై వ‌చ్చే యాక్ష‌న్ సీక్వెన్స్‌లు ఈ సినిమాకు పెద్ద ప్ల‌స్ అని అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఫ్యామిలీ సెంటిమెంట్‌...

ఫ్యామిలీ సెంటిమెంట్ సీన్స్ కొన్ని చోట్ల వ‌ర్క‌వుట్ అయ్యాయ‌ని చెబుతున్నారు. రొమాంటిక్ సీన్స్‌, పాట‌ల్లో రామ్‌, శ్రీలీల కెమిస్ట్రీ ని డైరెక్టర్ బోయపాటి శ్రీను స్క్రీన్ పై బాగా ప్రజెంట్ చేశాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి. రామ్‌, శ్రీలీల స్టెప్పులు కూడా ఆక‌ట్టుకుంటాయ‌ని అంటున్నారు. త‌మ‌న్ బీజీఎమ్ మ‌రో బిగ్గెస్ట్ అస్సెట్ అని ఓవ‌ర్‌సీస్ ఆడియెన్స్ చెబుతోన్నారు.

తదుపరి వ్యాసం