తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Bigg Boss Singer Revanth: తండ్రైన సింగ‌ర్ రేవంత్ - ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చిన రేవంత్ భార్య‌

Bigg Boss Singer Revanth: తండ్రైన సింగ‌ర్ రేవంత్ - ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చిన రేవంత్ భార్య‌

02 December 2022, 13:29 IST

google News
  • Bigg Boss Singer Revanth: సింగ‌ర్ రేవంత్ తండ్రిగా మారాడు. అత‌డి భార్య అన్విత పండంటి ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ప్ర‌స్తుతం రేవంత్ బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 6 కంటెస్టెంట్స్‌లో ఒక‌రిగా కొన‌సాగుతోన్నాడు.

రేవంత్, అన్విత
రేవంత్, అన్విత

రేవంత్, అన్విత

Bigg Boss Singer Revanth: బిగ్‌బాస్ కంటెస్టెంట్‌, సింగ‌ర్ రేవంత్ ఇంట సంబ‌రాలు మొద‌ల‌య్యాయి. రేవంత్ తండ్రిగా మారాడు. అత‌డి భార్య అన్విత ఆడ‌పిల్ల‌కు జ‌న్మ‌నిచ్చింది. ఈ విష‌యాన్ని శుక్ర‌వారం ఆమె సోష‌ల్ మీడియా ద్వారా వెల్ల‌డించింది. రేవంత్‌, అన్విత‌ల‌కు నెటిజ‌న్లు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు.

ప్ర‌స్తుతం రేవంత్ బిగ్‌బాస్ తెలుగు సీజ‌న్ 6 కంటెస్టెంట్స్‌లో ఒక‌రిగా కొన‌సాగుతున్నాడు. టాప్ ఫైవ్ కంటెస్టెంట్‌లో ఒక‌రిగా నిలిచేందుకు చేరువ‌లో ఉన్నాడు. రేవంత్‌ విన్న‌ర్‌గా నిలిచే అవ‌కాశం ఉందంటూ ప్ర‌చారం జ‌రుగుతోంది. బిగ్‌బాస్‌లోకి అడుగుపెట్టే స‌మ‌యంలో భార్య ప్రెగ్నెంట్ అనే విష‌యాన్ని రేవంత్ వెల్ల‌డించాడు. ప్రెగ్నెంట్‌గా ఉన్న భార్య‌కు అండ‌గా నిల‌బ‌డాల్సిన స‌మ‌యంలో ఆమెకు దూరంగా ఉంటున్నానంటూ ప‌లుమార్లు ఎమోష‌న‌ల్ అయ్యాడు.

అన్విత సీమంతం వేడుక‌ల‌ను బిగ్‌బాస్ హౌజ్‌లో నిర్వ‌హించారు. ఇండియ‌న్ ఐడ‌ల్ సీజ‌న్ 9 విన్న‌ర్‌గా నిల‌వ‌డంతో రేవంత్ ప్ర‌తిభ వెలుగులోకి వ‌చ్చింది. బాహుబ‌లి, అర్జున్‌రెడ్డి, గీతాగోవిందంతో పాటు ప‌లు సినిమాల్లో పాట‌లు పాడాడు రేవంత్‌.

తదుపరి వ్యాసం