తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Ram Miriyala: బన్నీ వాస్‌కు నో చెప్పేద్దామనుకున్నా.. సింగర్ రామ్ మిరియాల కామెంట్స్

Ram Miriyala: బన్నీ వాస్‌కు నో చెప్పేద్దామనుకున్నా.. సింగర్ రామ్ మిరియాల కామెంట్స్

Sanjiv Kumar HT Telugu

24 March 2024, 14:21 IST

google News
  • Ram Miriyala About Aay Tillu Square Movie: ఒగ్గేసి పోయినాదే వంటి ఫోక్ సాంగ్ నుంచి పొట్టి పిల్ల అనే జానపద గేయం వరకు తన మార్క్ చూపించాడు సింగర్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిరియాల. తాజాగా తన కెరీర్‌కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.

బన్నీ వాస్‌కు నో చెప్పేద్దామనుకున్నా.. సింగర్ రామ్ మిరియాల కామెంట్స్
బన్నీ వాస్‌కు నో చెప్పేద్దామనుకున్నా.. సింగర్ రామ్ మిరియాల కామెంట్స్

బన్నీ వాస్‌కు నో చెప్పేద్దామనుకున్నా.. సింగర్ రామ్ మిరియాల కామెంట్స్

Ram Miriyala About Aay Movie: రామ్ మిరియాల.. ఆయన పాట వింటుంటే మన స్నేహితుడే పాడుతున్నట్లుంటుంది. మన మట్టి వాసనను గుర్తుకు తెచ్చేలా, మన భావోద్వేగాలను స్పృశించేలా పాట పాడటం ఆయన నైజం. ఓ వైపు సింగర్‌గా, మరో వైపు మ్యూజిక్ డైరెక్టర్‌గా తనదైన గుర్తింపు తెచ్చుకుని ప్రేక్షకుల హృదయాల్లో సుస్థిరమైన స్థానాన్ని దక్కించుకున్నారు. ప్రస్తుతం ఆయన అచ్చ తెలుగు వినోదాల విందుల ఆయ్ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు.

ఎన్నో సక్సెస్‌ఫుల్ మూవీస్ అందించిన ప్రతిష్టాత్మక సంస్థ జీఏ2 పిక్చర్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న నెటివిటీ ఫన్ ఎంటర్‌టైనర్ సినిమా ఆయ్. హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్న ఈ సినిమాకు అంజి కె. మణిపుత్ర దర్శకత్వం వహిస్తున్నారు. టాలెంటెడ్ యంగ్ ప్రొడ్యూసర్స్ బన్నీ, విద్యా కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ వేసవిలో సందడి చేసేందుకు మూవీ రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో సింగర్, మ్యూజిక్ డైరెక్టర్ రామ్ మిరియాల ఆసక్తకిర విశేషాలు చెప్పారు.

"ఆయ్ సినిమా కోసం నన్ను బన్నీవాస్‌ గారు పిలిచారు. నా స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ఒకలా ఉంటుంది. ఆయనేమో నెటివిటీ ఫన్ ఎంటర్‌టైనర్ మూవీ చేస్తామని అన్నారుగా.. నాకేం సెట్ అవుతుందిలే నో చెప్పేద్దామని అనుకున్నాను. కానీ, అక్కడకు వెళ్లి కథ విన్నాక.. చాలా బాగా నచ్చేసింది. గోదావరి బ్యాక్ డ్రాప్‌లో సాగే సినిమా. చిత్రంలో ఆసాంతం కామెడీతో పాటు చక్కటి లవ్ స్టోరీ కూడా ఉంటుంది. అన్నీ వర్గాల ప్రేక్షకులకు నచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీ ఇది" అని రామ్ మిరియాల అన్నారు.

"సినిమాలో రెండు పాటలు చేశాను. రీసెంట్‌గా ‘సూఫియానా..’ అనే మెలోడి సాంగ్ రిలీజైంది. పాటకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. రేపు థియేటర్స్‌లో సినిమా వచ్చిన తర్వాత సాంగ్ నెక్ట్స్ రేంజ్‌లో కనెక్ట్ అవుతుందనే నమ్మకం ఉంది. మరో పాట పెళ్లి నేపథ్యంలో ఉంటుంది. అది కూడా త్వరలోనే రిలీజ్ అవుతుంది" అని సింగర్ రామ్ మిరియాల తెలిపారు.

"సాధారణంగా మ్యూజిక్ డైరెక్టర్‌కి, చిత్ర దర్శకుడితో మంచి బంధం ఉండాలి. అప్పుడే మంచి సంగీతం కుదురుతుంది. ఇది చాలా సందర్భాల్లో నిజమైయ్యాయి. ఇక ఆయ్ సినిమాలో ‘సూఫియానా..’ సాంగ్ ఇంత చక్కగా రావటానికి కారణం.. డైరెక్టర్ అంజి కె. మణిపుత్ర. ఆయన నాకు సిచ్యువేషన్ వివరించిన తీరుతో మంచి పాటలను అందించగలిగాను" అని రామ్ మిరియాల వెల్లడించారు.

"ఓ సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా అన్నీ రకాల పాటలను చేయాలనేది నా కోరిక. కొన్ని సందర్భాల్లో చేయగలమా లేదా అని అనుకునే అవకాశం ఉంటుంది. అయితే ఇంతకు ముందు చెప్పినట్లు దర్శకుడితో ఉన్న బాండింగ్ కూడా మనలో కొత్త ఔట్ పుట్‌ను తీసుకొస్తుంది. ఆయ్ సినిమాకు సంబంధించి నా విషయంలో జరిగిందదే. ఎందుకంటే ఇప్పటి వరకు ఇలాంటి జోనర్‌లో నేను సినిమా చేయలేదు. నాకు కొత్త ఎక్స్‌పీరియెన్స్‌నిచ్చింది. తప్పకుండా పాటలు మెప్పిస్తాయి" అని రామ్ మిరియాల పేర్కొన్నారు.

"ఓ టెక్నీషియన్‌గా ప్రతీరోజు నేర్చుకుంటూనే ఉండాలి. సింగర్‌గా, మ్యూజిక్ డైరెక్టర్‌గా కొత్త సౌండింగ్‌ను ప్రేక్షకుడికి అందించాలనే తాపత్రయంతో పని చేయాలి. అప్పుడే ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు. ఈ జర్నీలో మనం పని చేసే దర్శకుల సహకారం కూడా ఎంతో అవసరం. ఇప్పటి వరకు నేను పని చేసిన మ్యూజిక్ డైరెక్టర్స్, డైరెక్టర్స్ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను. వారందరికీ థాంక్స్" అని రామ్ మిరియాల చెప్పుకొచ్చారు.

ఇదిలా ఉంటే రామ్ మిరియాల ప్రస్తుతం ఆయ్ సినిమాతోపాటు టిల్లు స్క్వేర్ మూవీకి పని చేస్తున్నారు. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన ఈ సినిమా మార్చి 29న విడుదల కానున్న విషయం తెలిసిందే.

తదుపరి వ్యాసం