తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Simbu Eswarudu: ఓటీటీలోకి శింబు ఈశ్వ‌రుడు - డిజాస్ట‌ర్ మూవీని రెంట‌ల్ విధానం రిలీజ్ చేయ‌డంపై ట్రోల్స్‌

Simbu Eswarudu: ఓటీటీలోకి శింబు ఈశ్వ‌రుడు - డిజాస్ట‌ర్ మూవీని రెంట‌ల్ విధానం రిలీజ్ చేయ‌డంపై ట్రోల్స్‌

HT Telugu Desk HT Telugu

06 June 2023, 12:18 IST

  • Simbu Eswarudu Telugu OTT Release: శింబు ఈశ్వ‌రుడు మూవీ సోమ‌వారం అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. రెండేళ్ల క్రితం థియేట‌ర్ల‌లో విడుద‌లై డిజాస్ట‌ర్‌గా నిలిచిన ఈ మూవీ రెంట‌ల్ విధానంలో ఓటీటీలో రిలీజ్ కావ‌డంలో నెటిజ‌న్లు ట్రోల్ చేస్తోన్నారు.

శింబు ఈశ్వ‌రుడు
శింబు ఈశ్వ‌రుడు

శింబు ఈశ్వ‌రుడు

Simbu Eswarudu Telugu OTT Release: స‌క్సెస్‌, ఫెయిల్యూర్స్‌కు అతీతంగా కోలీవుడ్‌లో స్టార్ హీరోల్లో ఒక‌రిగా కొన‌సాగుతోన్నాడు శింబు. తెలుగులో అత‌డికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అత‌డు హీరోగా న‌టించిన ప‌లు త‌మిళ సినిమాలు తెలుగులోనూ డ‌బ్ అయ్యాయి. శింబు హీరోగా న‌టించిన త‌మిళ సినిమా ఈశ్వ‌ర‌న్ తెలుగులో ఈశ్వ‌రుడు పేరుతో రిలీజైన సంగ‌తి తెలిసిందే.

ట్రెండింగ్ వార్తలు

Romeo OTT Release Date: విజయ్ ఆంటోనీ ‘రోమియో’ సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఖరారు.. ఏ ప్లాట్‍ఫామ్‍లోకి వస్తుందంటే..

Manjummel Boys OTT Release: మరికొన్ని గంటల్లో ఓటీటీలోకి మంజుమ్మల్ బాయ్స్: స్ట్రీమింగ్ వివరాలివే

Heeramandi OTT: 1920లో కరోనా వైరస్.. టీఆర్ఎస్: వెబ్ సిరీస్‍లో సంజయ్ లీలా భన్సాలీ పొరపాట్లు

Sundar C: దేశం గర్వించే చిత్రం అవుతుంది.. తెలుగు సినిమాపై తమిళ డైరెక్టర్ సుందర్ కామెంట్స్

రెండేళ్ల క్రితం థియేట‌ర్ల‌లో విడుద‌లైన‌ ఈశ్వ‌రుడు మూవీ సోమ‌వారం అమెజాన్ ప్రైమ్ ద్వారా ఓటీటీ ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది. ఈ సినిమాను రెంట‌ల్ విధానంలో అమెజాన్ ప్రైమ్ రిలీజ్ చేసింది.

ఈశ్వ‌రుడు తెలుగు వెర్ష‌న్ చూడాలంటే 79 రూపాయ‌లు చెల్లించాల్సిందేన‌ని ప్ర‌క‌టించింది. రెండేళ్ల క్రితం రిలీజై డిజాస్ట‌ర్‌గా నిలిచిన మూవీని రెంట‌ల్ విధానంలో ఓటీటీలో విడుద‌ల‌చేయ‌డంపై నెటిజ‌న్లు అమెజాన్ ప్రైమ్‌ను ట్రోల్ చేస్తోన్నారు.

ఈ సినిమాను ఫ్రీగా స్ట్రీమింగ్‌ పెట్టినా చూడ‌టం క‌ష్ట‌మేన‌ని కామెంట్స్ చేస్తోన్నారు. ఈశ్వ‌ర‌న్ సినిమాకు సుసీంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సినిమాలో శింబుకు జోడీగా నిధి అగ‌ర్వాల్‌, నందితా శ్వేత హీరోయిన్లుగా న‌టించారు. ఈ సినిమాతోనే నిధి అగ‌ర్వాల్ హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.

త‌మ‌న్ సంగీతాన్ని అందించాడు. 2021 సంక్రాంతికి రిలీజైన ఈ మూవీ తెలుగుతో పాటు త‌మిళంలో డిజాస్ట‌ర్‌గా నిలిచింది. ఈ సినిమా త‌మిళ వెర్ష‌న్ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో రిలీజ్ కాగా తెలుగు వెర్ష‌న్ మాత్రం అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ కావ‌డం హాట్ టాపిక్‌గా మారింది.

ప్ర‌స్తుతం శింబు త‌మిళంలో క‌మ‌ల్‌హాస‌న్ నిర్మాణంలో ఓ సినిమా చేస్తోన్నాడు. ఈ మూవీకి క‌నులు క‌నుల‌ను దోచాయంటే ఫేమ్ దేసింగు పెరియ‌సామి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్నాడు. అలాగే క‌రోనా కుమార్ పేరుతో మ‌రో మూవీ కూడా చేస్తోన్నాడు.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.