Chinna OTT Streaming: సిద్ధార్థ్ చిన్నా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఇదే - ఐదు భాషల్లో రిలీజ్
21 November 2023, 11:52 IST
Chinna OTT Streaming: సిద్ధార్థ్ చిన్నా ఓటీటీ రిలీజ్‌డేట్‌ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ అఫీషియల్‌గా అనౌన్స్‌చేసింది. ఈ డ్రామా థ్రిల్లర్ మూవీ నవంబర్ 28 నుంచి ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతోంది.
సిద్ధార్థ్ చిన్నా
Chinna OTT Streaming: సిద్ధార్థ్ చిన్నా ఓటీటీ రిలీజ్ డేట్‌పై సస్పెన్స్ వీడింది. నవంబర్ 28 నుంచి డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో రిలీజ్ అవుతోంది. తొలుత ఈ సినిమా ఓటీటీలో నవంబర్ 17న రిలీజ్ కానున్నట్లు ప్రచారం జరిగింది. కానీ అదే రోజు చాలా సినిమాలు ఓటీటీలో రిలీజ్ కావడంతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ వెనక్కి తగ్గింది.
చిన్నా సినిమాలో హీరోగా నటిస్తూనే స్వయంగా సిద్ధార్థ్ ఈ మూవీని నిర్మించాడు. డ్రామా థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సినిమాకు ఎస్ యు అరుణ్ కుమార్ దర్శకత్వం వహించాడు. తమిళంలో చిత్తా పేరుతో సెప్టెంబర్ 28న ఈ సినిమా రిలీజైంది. తెలుగులో మాత్రం థియేటర్ల సమస్య కారణంగా వారం ఆలస్యంగా అక్టోబర్ 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది.
చిన్నా సినిమాలో సిద్ధార్థ్ యాక్టింగ్‌కు ప్రశంసలు దక్కాయి. ఓ చిన్నారిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని ఈశ్వర్ అనే యువకుడిపై నింద పడుతుంది. ఆ నింద నుంచి అతడు ఎలా బయటపడ్డాడు? కనిపించకుండా పోయినా తన మేనకోడలి ఆచూకీని ఎలా కనిపెట్టాడన్నదే ఈ సినిమా కథ.
చాలా రోజుల తర్వాత చిత్తా సినిమాతో కోలీవుడ్ సిద్ధార్థ్‌కు కమర్షియల్ సక్సెస్ దక్కింది. తెలుగులో మాత్రం ఈ సినిమా పెద్దగా వసూళ్లను రాబట్టలేకపోయింది.