తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shruti Haasan: వాల్తేర్ వీర‌య్య సెట్స్ లో అడుగుపెట్టిన శృతిహాస‌న్‌...

Shruti Haasan: వాల్తేర్ వీర‌య్య సెట్స్ లో అడుగుపెట్టిన శృతిహాస‌న్‌...

HT Telugu Desk HT Telugu

09 July 2022, 19:27 IST

google News
  • ప్ర‌స్తుతం ప్ర‌భాస్ స‌లార్ (salaar)తో పాటు బాల‌కృష్ణ 107 (nbk 107)సినిమా షూటింగ్ ల‌తో బిజీగా ఉంది శృతిహాస‌న్‌. తాజాగా ఆమె చిరంజీవి 154 సినిమాలో భాగ‌మైంది. తొలిసారి ఈ సినిమా సెట్స్ లో అడుగుపెట్టింది.

శృతిహాస‌న్‌
శృతిహాస‌న్‌ (instagram)

శృతిహాస‌న్‌

వాల్తేర్ వీర‌య్య( waltair veerayya)సినిమా కోసం తొలిసారి చిరంజీవితో(chiranjeevi) జోడిక‌ట్ట‌బోతున్న‌దిశృతిహాస‌న్(shruthi haasan). మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతున్న ఈ చిత్రానికి బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. వైజాగ్‌లోని జాల‌రీపేట బ్యాక్‌డ్రాప్‌లో ఈసినిమాను రూపొందిస్తున్నారు. చిరంజీవి హీరోగా న‌టిస్తున్న 154వ సినిమా ఇది. ప్ర‌స్తుతం హైద‌రాబాద్‌లో ఈ సినిమా షూటింగ్ జ‌రుగుతోంది.

జూలై 5 నుండి ప్రారంభ‌మైన కొత్త షెడ్యూల్‌లో కీల‌క ఘ‌ట్టాల‌ను చిత్రీక‌రిస్తున్నారు. కాగా శ‌నివారం నుండి ఈ సినిమా షూటింగ్ లో శృతిహాస‌న్ భాగ‌మైంది. తొలిసారి ఆమె ఈ సినిమా సెట్స్‌లో అడుగుపెట్టింది. ఇప్ప‌టివ‌ర‌కు ఈ సినిమా షూటింగ్ న‌ల‌భై శాతం పూర్త‌యిన‌ట్లు స‌మాచారం. క‌థానాయిక లేకుండానే ఈ సీన్స్ తెర‌కెక్కించారు. ఇటీవ‌లే హీరోయిన్‌గా శృతిహాస‌న్ న‌టించ‌బోతున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది. శ‌నివారం నుండి ఆమె షూటింగ్‌లో పాల్గొంటుంది. హైద‌రాబాద్ షెడ్యూల్‌లో చిరంజీవి, శృతిహాస‌న్ తో పాటు ప్ర‌ధాన తారాగ‌ణంపై కీల‌క స‌న్నివేశాల‌ను చిత్రీక‌రించ‌బోతున్న‌ట్లు స‌మాచారం. త‌దుప‌రి షెడ్యూల్స్ ను మాల్టా, గోవాల‌లో చిత్రీక‌రించ‌బోతున్న‌ట్లు తెలిసింది.

చిరంజీవి పుట్టిన‌రోజు సంద‌ర్భంగా ఆగ‌స్ట్ 22న ఈ సినిమా టీజ‌ర్‌ను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. నవంబర్ లోగా సినిమా షూటింగ్ ను పూర్తి చేసేలా దర్శకుడు బాబీ సన్నాహాలు చేస్తున్నారు. వ‌చ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా రిలీజ్ కానుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తమన్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ కీలక పాత్రలో నటించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

తదుపరి వ్యాసం