తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shahrukh Khan: షారుఖ్ ఖాన్ పఠాన్ వీడియో గ్లింప్స్ రిలీజ్...యాక్షన్ రోల్ లో బాలీవుడ్ బాద్షా

Shahrukh Khan: షారుఖ్ ఖాన్ పఠాన్ వీడియో గ్లింప్స్ రిలీజ్...యాక్షన్ రోల్ లో బాలీవుడ్ బాద్షా

HT Telugu Desk HT Telugu

25 June 2022, 12:52 IST

  • శనివారం నాటితో బాలీవుడ్ అగ్ర నటుడు షారుఖ్ ఖాన్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి   30 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని అతడు హీరోగా నటించిన పఠాన్ ఫస్ట్ గ్లింప్స్ ను చిత్ర యూనిట్ విడుదలచేసింది. ఇందులో యాక్షన్ లుక్ లో షారుఖ్ ఖాన్ కనిపిస్తున్నారు. 

షారుఖ్ ఖాన్
షారుఖ్ ఖాన్ (instagram)

షారుఖ్ ఖాన్

పఠాన్ ఫస్ట్ గ్లింప్స్ తో శనివారం ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేశారు బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్. ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా రూపొందుతున్న ఈ చిత్రానికి సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నారు. శనివారం నాటితో షారుఖ్ ఖాన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 30 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని పఠాన్ వీడియో గ్లింప్స్ ను రిలీజ్ చేశారు.

ట్రెండింగ్ వార్తలు

PM Narendra Modi Biopic: ప్రధాని నరేంద్ర మోదీ పాత్రలో కట్టప్ప!: వివరాలివే

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Laya: ఆ డైరెక్టర్ చంపుతానని బెదిరించాడు.. 18 ఏళ్లకు నిజం బయటపెట్టిన హీరోయిన్ లయ

ఇందులో యాక్షన్ లుక్ లో షారుఖ్ కనిపిస్తున్నారు. అతడి చేతికి సంకెళ్లు ఉండటం ఆసక్తిని పంచుతోంది. గన్ పట్టుకొని శత్రువులతో ఫైట్ కు సిద్ధమైనట్లుగా పవర్ ఫుల్ గా తీర్చిదిద్దిన లుక్ అభిమానులను ఆకట్టుకుంటోంది. అభిమానుల ప్రేమ, ఆప్యాయతలతో 30 తెలియకుండానే పూర్తయ్యాయని షారుఖ్ ఖాన్ ఇన్ స్టాగ్రామ్ లో ఎమోషనల్ పోస్ట్ పెట్టారు.

రిపబ్లిక్ డే కానుకగా వచ్చే ఏడాది జనవరి 25న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్లుగా వెల్లడించారు. హిందీతో పాటు తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను రిలీజ్ చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇందులో షారుఖ్ ఖాన్ సరసన దీపికా పడుకోణ్ కథానాయికగా నటిస్తోంది. జాన్ అబ్రహమ్ విలన్ పాత్రను పోషిస్తున్నారు. సీనియర్ నటి డింపుల్ కాపాడియా కీలక పాత్రలో కనిపిస్తుంది.

వార్ ఘన విజయం తర్వాత సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. ఇందులో షారుఖ్ ఖాన్ డిఫరెంట్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దాదాపు 250 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతోంది. పఠాన్ తో పాటు తమిళ దర్శకుడు అట్లీతో జవాన్ అనే సినిమా చేస్తున్నారు షారుఖ్ ఖాన్.నయనతార హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది జూన్ లో ప్రేక్షకుల ముందుకు రానున్నది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం