తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Pathaan Collections: హిందీలో 250 కోట్లు - తెలుగు త‌మిళ‌ భాష‌ల్లో ఏడు కోట్లు - ఫ‌లించ‌ని ప‌ఠాన్ డ‌బ్బింగ్ మంత్రం

Pathaan Collections: హిందీలో 250 కోట్లు - తెలుగు త‌మిళ‌ భాష‌ల్లో ఏడు కోట్లు - ఫ‌లించ‌ని ప‌ఠాన్ డ‌బ్బింగ్ మంత్రం

30 January 2023, 8:10 IST

  • Pathaan Collections: షారుఖ్‌ఖాన్ ప‌ఠాన్ సినిమా బాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు బ్రేక్ చేస్తూ దూసుకుపోతుంది. తెలుగు, త‌మిళ డ‌బ్బింగ్ వెర్ష‌న్స్‌కు మాత్రం యావ‌రేజ్ క‌లెక్ష‌న్స్‌ను ద‌క్కించుకుంటున్నాయి.

షారుఖ్‌ఖాన్ ప‌ఠాన్
షారుఖ్‌ఖాన్ ప‌ఠాన్

షారుఖ్‌ఖాన్ ప‌ఠాన్

Pathaan Collections: ప‌ఠాన్ సినిమాతో గ్రాండ్‌గా రీఎంట్రీ ఇచ్చాడు బాలీవుడ్ బాద్‌షా షారుఖ్‌ఖాన్‌. నాలుగు రోజుల్లోనే వ‌ర‌ల్డ్ వైడ్‌గా ప‌ఠాన్ సినిమా 419 కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి రికార్డులు తిర‌గ‌రాస్తోంది. ఇండియ‌న్ సినిమా ఇండ‌స్ట్రీలో అత్యంత వేగంగా 250 కోట్ల మార్కును అందుకున్న సినిమాగా ప‌ఠాన్ నిలిచింది.

ట్రెండింగ్ వార్తలు

Kareena Kapoor Toxic: యశ్ టాక్సిక్ నుంచి తప్పుకున్న కరీనా కపూర్.. కారణం అదేనా?

Bharti Singh Hospitalised: హాస్పిటల్లో చేరిన ప్రముఖ కమెడియన్.. కంటతడి పెడుతూ వీడియో

Salaar TRP: ప్రభాస్ సలార్ మూవీకి టీవీలో దారుణమైన టీఆర్పీ.. ఆ రెండు సినిమాల కంటే తక్కువే.. కారణం ఇదేనా?

Kamal Haasan Linguswamy: కమల్ హాసన్ మోసం చేశాడు: నిర్మాతల మండలికి డైరెక్టర్ ఫిర్యాదు

గ‌తంలో కేజీఎఫ్ -2 హిందీ వెర్ష‌న్ ఏడు రోజుల్లో 250 కోట్ల మైలురాయిని చేరుకున్న‌ది. ఆ రికార్డ్‌ను ప‌ఠాన్ ఐదు రోజుల్లోనే అందుకొని య‌శ్ సినిమా రికార్డ్‌ను అధిగ‌మించింది. మొత్తంగా నాలుగు రోజుల్లో ప‌ఠాన్ సినిమాకు ఇండియా వైడ్‌గా 265 కోట్ల క‌లెక్ష‌న్స్ రాగా ఓవ‌ర్‌సీస్‌లో 164 కోట్ల వ‌సూళ్లు వ‌చ్చాయి. రిలీజ్ అనంత‌రం వ‌రుస‌గా నాలుగు రోజులు ప్ర‌తి రోజు యాభై కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టిన ఏకైక ఇండియ‌న్ సినిమా ప‌ఠాన్ కావ‌డం గ‌మ‌నార్హం.

ప‌ఠాన్ సినిమాను హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో డ‌బ్ చేసి ఒకేరోజు రిలీజ్ చేశారు. హిందీ వెర్ష‌న్ అద్భుత వ‌సూళ్ల‌తో దూసుకుపోతుండ‌గా తెలుగు, త‌మిళ వెర్ష‌న్స్‌ను ఎవ‌రూ ప‌ట్టించుకోవ‌డం లేదు.

నాలుగు రోజుల్లో తెలుగు, త‌మిళ డ‌బ్బింగ్ వెర్ష‌న్స్ రెండు క‌లిపి ఏడున్న‌ర కోట్ల క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టాయి. అందులో తెలుగు డ‌బ్బింగ్ వాటానే అధికంగా ఉండ‌టం గ‌మ‌నార్హం. తెలుగులో ప‌ఠాన్ సినిమా దాదాపు ఐదు కోట్ల క‌లెక్ష‌న్స్ సాధించ‌గా త‌మిళ వెర్ష‌న్ మాత్రం రెండున్న‌ర కోట్ల‌కు ప‌రిమిత‌మైన‌ట్లు చెబుతున్నారు.

ఇటీవ‌ల‌కాలంలో ద‌క్షిణాదిలో డ‌బ్ అయిన బాలీవుడ్ సినిమాల‌తో పోలిస్తే ప‌ఠాన్ సినిమాకు చాలా త‌క్కువ క‌లెక్ష‌న్స్ రావ‌డం గ‌మ‌నార్హం. ప‌ఠాన్ సినిమాకు సిద్ధార్థ్ ఆనంద్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు.

ఇందులో ఐఎస్ఐ ఏజెంట్ పాత్ర‌లో దీపికా ప‌డుకోణ్ న‌టించింది. జాన్ అబ్ర‌హం విల‌న్‌గా క‌నిపించాడు. ఇండియాపై దాడుల‌కు ప్లాన్ వేసిన ఓ ప్రైవేజ్ ఏజెంట్‌ను ఇండియా రా ఏజెంట్ ప‌ఠాన్ ఎలా అడ్డుకున్నాడ‌న్న‌దే ఈ సినిమా క‌థ. ఈ సినిమాలోని భారీ యాక్ష‌న్ స‌న్నివేశాలు ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుంటున్నాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.