తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Shaakuntalam Release Date: శాకుంతలం రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసిన మేకర్స్.. 3డీలోనూ విజువల్‌ వండర్‌

Shaakuntalam Release Date: శాకుంతలం రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేసిన మేకర్స్.. 3డీలోనూ విజువల్‌ వండర్‌

Hari Prasad S HT Telugu

02 January 2023, 11:26 IST

    • Shaakuntalam Release Date: శాకుంతలం రిలీజ్‌ డేట్‌ అనౌన్స్‌ చేశారు మేకర్స్. ఎప్పుడెప్పుడా అని సమంత అభిమానులు ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ విజువల్ వండర్‌ 3డీలోనూ రిలీజ్‌ కానున్నట్లు ప్రకటించారు.
ఈ కొత్త పోస్టర్ ద్వారా శాకుంతలం రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్
ఈ కొత్త పోస్టర్ ద్వారా శాకుంతలం రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్

ఈ కొత్త పోస్టర్ ద్వారా శాకుంతలం రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన మేకర్స్

Shaakuntalam Release Date: టాలీవుడ్‌లో మోస్ట్‌ అవేటెడ్‌ మూవీస్‌లో ఒకటి శాకుంతలం. సమంత, గుణశేఖర్‌ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. చాలా కాలంగా రిలీజ్ వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఫ్యాన్స్‌ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. వాళ్ల ఎదురు చూపులకు ఫుల్‌స్టాప్‌ పెడుతూ సినిమా రిలీజ్ డేట్‌ను మేకర్స్‌ సోమవారం (జనవరి 2) అనౌన్స్‌ చేశాడు.

ట్రెండింగ్ వార్తలు

Chandini Chowdary: కొత్తగా పెళ్లైన జంట ఎదుర్కొనే సమస్యతో మూవీ- గామి హీరోయిన్ చాందినీ చౌదరి మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్

OTT Horror Movie: ఓటీటీలో భయపెట్టనున్న సరికొత్త హారర్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్! ఎక్కడంటే?

Siddharth40: సిద్ధార్థ్ హీరోగా 40వ సినిమా.. తెలుగు తమిళంలో ద్విభాషా చిత్రం.. డైరెక్టర్ ఎవరంటే?

Balakrishna vs Jr NTR: బాక్సాఫీస్ వద్ద బాబాయి, అబ్బాయి పోటీ ఉండనుందా?

ఈ శాకుంతలం మూవీ ఫిబ్రవరి 17న రిలీజ్‌ కాబోతోంది. 3డీ వెర్షన్ కోసమంటూ గతేడాది రిలీజ్‌ డేట్‌ను వాయిదా వేసిన మేకర్స్‌.. ఈసారి ఆ వెర్షన్‌లోనూ ఈ విజువల్‌ వండర్‌ను చూడొచ్చని అనౌన్స్‌ చేశారు. మూవీ రిలీజ్‌ డేట్‌ను సమంత కూడా తన ట్విటర్‌లో షేర్‌ చేసింది. "అద్భుతమైన లవ్‌స్టోరీ శాకుంతలం మూవీని థియేటర్లలో చూసి ఎంజాయ్‌ చేయండి. ఫిబ్రవరి 17న 3డీలోనూ ఈ సినిమా మీ ముందుకు వస్తోంది" అని సమంత ట్వీట్‌ చేసింది.

ఈ సినిమాలో మలయాళం నటుడు దేవ్‌ మోహన్‌.. దుశ్యంతుని పాత్రలో కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో ఉంది. ఈ సినిమా నుంచి వచ్చిన ఫస్ట్ లుక్‌ ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంది. కాళిదాసు రచించి అభిజ్ఞాన శాకుంతలం రచన ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

ఈ పాన్‌ ఇండియా మూవీ ఫిబ్రవరి 17న తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళంలలో పాన్‌ ఇండియా మూవీగా రిలీజ్ కాబోతోంది. నిజానికి గతేడాది చివర్లో రిలీజ్‌ చేస్తున్నట్లు మేకర్స్‌ మొదట ప్రకటించారు. అయితే 3డీ వెర్షన్‌ కూడా తెస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో రిలీజ్‌ను వాయిదా వేశారు. ఇప్పుడు ఆ వెర్షన్‌ను కూడా సిద్ధం చేసి ఒకేసారి 2డీ, 3డీల్లో రిలీజ్‌ చేయనున్నారు.

గుణశేఖర్‌ కూతురు నీలిమా గుణ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించింది. గుణ టీమ్‌వర్క్స్‌ బ్యానర్‌ కింద తెరకెక్కింది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌ కింద దిల్ రాజు సమర్పిస్తున్నాడు. ఈ మూవీకి మణిశర్మ మ్యూజిక్‌ అందించాడు. ఈ మధ్యే యశోద మూవీతో హిట్‌ అందుకున్న సమంత.. ఇప్పుడు మరోసారి శాకుంతలంతో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. త్వరలోనే మేకర్స్‌ మూవీ ప్రమోషన్లను ప్రారంభించనున్నారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం