తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sathi Gani Rendu Ekaralu On Aha: 'సత్తి గాని రెండు ఎకరాలు'లో ఏముంది.. 'పుష్ప' కేశవకు ఏం పని?

Sathi Gani rendu Ekaralu on Aha: 'సత్తి గాని రెండు ఎకరాలు'లో ఏముంది.. 'పుష్ప' కేశవకు ఏం పని?

05 March 2023, 19:57 IST

    • Sathi Gani rendu Ekaralu on Aha: పుష్ప ఫేమ్ జగదీష్ ప్రతాప్ బండారి హీరోగా నటించిన సరికొత్త చిత్రం సత్తి గాని రెండు ఎకరాలు. ఈ సినిమాను ఆహా వేదికగా స్ట్రీమింగ్ కానుంది. మార్చి 17 నుంచి విడుదల కానుంది.
సత్తి గాని రెండు ఎకరాలు
సత్తి గాని రెండు ఎకరాలు

సత్తి గాని రెండు ఎకరాలు

Sathi Gani rendu Ekaralu on Aha: పుష్ప సినిమాలో అల్లు అర్జున్ పాత్రకు ఎంత పేరు వచ్చిందో.. హీరో పక్కనే ఉంటూ కామెడీ పండించిన కేశవ పాత్రకు కూడా అంతే గుర్తింపు వచ్చింది. ఈ క్యారెక్టర్ చేసింది నటుడు జగదీష్ ప్రతాప్ బండారి. తాజాగా జగదీష్ ప్రధాన పాత్రలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఓ సినిమా రూపొందింది. అతే 'సత్తి గాని రెండు ఎకరాలు'. అభినవ్ దండా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను ఓటీటీ వేదికగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

ట్రెండింగ్ వార్తలు

Single Screen Theatres: సినీ ల‌వ‌ర్స్‌కు షాక్‌ - తెలంగాణ‌లో ప‌ది రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేట‌ర్లు మూత - కార‌ణం ఇదే

Double Ismart Teaser: బూతులతో డబుల్ ఇస్మార్ట్ టీజర్.. రామ్ పోతినేని-పూరి జగన్నాథ్ మ్యాజిక్ రిపీట్ అవుద్దా?

Rajinikanth: ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌తో భారీ బ‌డ్జెట్ పాన్ ఇండియ‌న్ మూవీ తీయోచ్చు - ద‌ళ‌ప‌తి విజ‌య్ రికార్డ్ బ్రేక్‌

Satya OTT: ఓటీటీలోకి నెలకాకముందే తమిళ బ్లాక్ బస్టర్ మూవీ రీమేక్.. అందులో ఆరోజు నుంచే స్ట్రీమింగ్!

ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా వేదికగా ఈ సినిమా విడుదల చేయాలని భావిస్తున్నారు. మార్చి 17 నుంచి 'సత్తి గాని రెండు ఎకరాలు' మూవీని స్ట్రీమింగ్ చేయనున్నారు. ఈ సినిమాలో జగదీష్ ఇంతకుముందెన్నడు చేయని క్యారెక్టర్లో నటిస్తున్నాడు. డార్క్ కామెడీ జోనర్‌లో తెరకెక్కిన సినిమా కొల్లూర్ బ్యాక్ డ్రాప్‌లో సాగుతున్నట్లు తెలుస్తోంది.

ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, బిత్తిరి సత్తి, మోహన శ్రీ సురంగ, రాజ్ తిరనదాసు, అనీష్ దామ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రాంతీయ సినిమాలు, కంటెంట్ ఉన్న చిత్రాలకు ఆదరణ వస్తున్న తరుణంలో సత్తి గాని రెండు ఎకరాలు కూడా అదే కోవలోకి వస్తుందని మేకర్స్ అంటున్నారు. ప్రాంతీయ సినిమా అయినప్పటికే కంటెంట్ యూనివర్సల్‌గా ఉంటుందని స్పష్టం చేశారు.

మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై ఈ సినిమాను నవీన్ యర్నేని, వై రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అభినవ దండా ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఆహా వేదికగా మార్చి 12 నుంచి సత్తి గాని రెండు ఎకరాలు మూవీ స్ట్రీమింగ్ కానుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం