తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sanjay Leela Bhansali Love And War: బాలీవుడ్ భార్యాభర్తలతో సంజయ్ లీలా భన్సాలీ లవ్ అండ్ వార్

Sanjay Leela Bhansali Love and War: బాలీవుడ్ భార్యాభర్తలతో సంజయ్ లీలా భన్సాలీ లవ్ అండ్ వార్

Hari Prasad S HT Telugu

24 January 2024, 18:54 IST

    • Sanjay Leela Bhansali Love and War: బాలీవుడ్ భార్యాభర్తలు రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్ లతో సంజయ్ లీలా భన్సాలీ లవ్ అండ్ వార్ పేరుతో ఓ సినిమా తీస్తున్నాడు. ఇందులో విక్కీ కౌశల్ కూడా నటిస్తున్నాడు.
సంజయ్ లీలా భన్సాలీ లవ్ అండ్ వార్ మూవీలో నటించనున్న రణ్‌బీర్, ఆలియా, విక్కీ కౌశల్
సంజయ్ లీలా భన్సాలీ లవ్ అండ్ వార్ మూవీలో నటించనున్న రణ్‌బీర్, ఆలియా, విక్కీ కౌశల్

సంజయ్ లీలా భన్సాలీ లవ్ అండ్ వార్ మూవీలో నటించనున్న రణ్‌బీర్, ఆలియా, విక్కీ కౌశల్

Sanjay Leela Bhansali Love and War: బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ సంజయ్ లీలా భన్సాలీ తన తర్వాతి సినిమా నటీనటులు, టైటిల్ ను అనౌన్స్ చేశాడు. ఈ సినిమాకు లవ్ అండ్ వార్ అనే టైటిల్ పెట్టడం విశేషం.

ట్రెండింగ్ వార్తలు

Heeramandi 2: హీరామండి వెబ్ సిరీస్‍ రెండో సీజన్ వస్తుందా? డైరెక్టర్, యాక్టర్ ఏం చెప్పారంటే..

OTT Web Series: నేహా శర్మ పాపులర్ వెబ్ సిరీస్ మూడో సీజన్ వచ్చేస్తోంది.. స్ట్రీమింగ్ డేట్ ఖరారు

Devara Fear Song: దేవర నుంచి వచ్చేసిన ఫియర్ సాంగ్.. పవర్‌ఫుల్‍గా ఫస్ట్ పాట: చూసేయండి

Adivi Sesh: హనీమూన్ ఎక్స్‌ప్రెస్ వదిలిన అడవి శేష్.. అన్నపూర్ణ ఏడెకరాల ప్రాంగణంలో అప్డేట్

ఈ మూవీలో బాలీవుడ్ కపుల్ రణ్‌బీర్ కపూర్, ఆలియా భట్, విక్కీ కౌశల్ నటిస్తున్నట్లు భన్సాలీ ప్రొడక్షన్స్ బుధవారం (జనవరి 24) సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. అంతేకాదు మూవీ రిలీజ్ టైమ్ ను కూడా అనౌన్స్ చేయడం విశేషం.

భన్సాలీ లవ్ అండ్ వార్

బాలీవుడ్ లో భారీ సినిమాలు తీస్తాడనే పేరున్న సంజయ్ లీలా భన్సాలీ 2022లో గంగూబాయి కఠియావాడి మూవీతో చివరిసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆ మూవీలో ఆలియా భట్ ఓ వేశ్యగా కనిపించింది. ఇక ఇప్పుడు మరోసారి ఆమెతోపాటు ఆమె భర్త రణ్‌బీర్ హీరోగా లవ్ అండ్ వార్ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ తో మూవీ తీస్తుండటం విశేషం.

మరో బాలీవుడ్ ప్రముఖ నటుడు విక్కీ కౌశల్ కూడా ఇందులో నటిస్తున్నాడు. 2025 క్రిస్మస్ సమయంలో ఈ మూవీని రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ వెల్లడించారు. ముగ్గురు నటీనటులు, టైటిల్ ను బట్టి చూస్తుంటే.. ఇది మరో ఎపిక్ లవ్ స్టోరీలాగా కనిపిస్తోంది. ఈ మూవీ అనౌన్స్‌మెంట్ ను అటు ఆలియా భట్ కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా షేర్ చేసుకుంది.

ఫ్యాన్స్‌లో ఫుల్ క్రేజ్

బాలీవుడ్ లో సంజయ్ లీలా భన్సాలీ మూవీస్ కు ఓ స్పెషల్ క్రేజ్, సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. గతంలో దేవదాస్, పద్మావత్, బాజీరావ్ మస్తానీ, రామ్ లీలా, గంగూబాయి కఠియావాడిలాంటి సినిమాలు అందించిన భన్సాలీ నుంచి ఏ అనౌన్స్‌మెంట్ వచ్చినా ఫ్యాన్స్ ఆసక్తిగా ఫాలో అవుతారు. తాజాగా ఈ లవ్ అండ్ వార్ మూవీ కూడా వాళ్లను చాలా ఎక్సైట్‌మెంట్ కు గురి చేసింది.

ముఖ్యంగా ఈ మూవీలో రణ్‌బీర్, ఆలియా, విక్కీ కౌశల్ నటించనుండటం వాళ్లలో ఉత్సాహాన్ని నింపుతోంది. ఈ ముగ్గురు అద్బుతమైన నటీనటులతో భన్సాలీ మ్యాజిక్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 2022లో ఆలియాతో గంగూబాయి కఠియావాడి మూవీ చేయగా.. ఆమెకు ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు రావడం విశేషం.

ఇక 2007లో రణ్‌బీర్ కూడా భన్సాలీ డైరెక్ట్ చేసిన సావరియా మూవీతోనే బాలీవుడ్ లో అరంగేట్రం చేశాడు. మళ్లీ 17 ఏళ్లకు అతనితో కలిసి మరో సినిమా చేయబోతున్నాడు. తొలి సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినా.. ఇప్పుడు బాలీవుడ్ లో రణ్‌బీర్ పెద్ద స్టార్. అతనితోపాటు నిజజీవితంలో తన భార్య అయిన ఆలియా కూడా ఈ మూవీలో ఉండటంతో లవ్ అండ్ వార్ పై అంచనాలు భారీగా ఉన్నాయి.

నిజానికి భన్సాలీ తన నెక్ట్స్ మూవీ బైజూ బావ్రాను నాలుగేళ్ల కిందటే అనౌన్స్ చేశాడు. ఇందులో రణ్‌వీర్ సింగ్ ను నటింపజేయాలని భావించారు. కానీ ఇప్పుడు లవ్ అండ్ వార్ అనౌన్స్‌మెంట్ తో ఆ మూవీని పూర్తిగా పక్కన పెట్టినట్లే కనిపిస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం