arjun reddy: అర్జున్ రెడ్డి డిలీట్ సీన్ షేర్ చేసిన డైరెక్టర్
26 August 2022, 15:51 IST
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda) హీరోగా నటించిన అర్జున్‌రెడ్డి(Arjun reddy) సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చి ఐదేళ్లు దాటిపోయింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సినిమాలోని డిలీట్ సీన్‌ను దర్శకుడు సందీప్ వంగా (sandeep vanga) సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
విజయ్ దేవరకొండ
arjun reddy deleted scene: విజయ్ దేవరకొండ హీరోగా నటించిన అర్జున్ రెడ్డి సినిమా టాలీవుడ్ లో కల్ట్ క్లాసిక్‌గా నిలిచింది. సమాజ పోకడలకు భిన్నమైన వ్యక్తిత్వమున్న ఓ యువకుడి ప్రేమకథను ఆవిష్కరిస్తూ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాను తెరకెక్కించాడు. అవేశం, నిర్లక్ష్యపూరిత మనస్తత్వమున్న యువకుడిగా విజయ్ దేవరకొండ నటన, సందీప్ వంగా లవ్ స్టోరీని కొత్త కోణంలో ఆవిష్కరించిన తీరుకు ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు.
ఎలాంటి అంచనాలు లేకుండా చిన్న సినిమాగా విడుదలైన అర్జున్ రెడ్డి పెద్ద విజయాన్ని సొంతం చేసుకున్నది. విజయ్ దేవరకొండకు స్టార్ ఇమేజ్‌ను తీసుకొచ్చింది. బాలీవుడ్‌లో కబీర్‌సింగ్ పేరుతో రీమేక్ అయిన ఈ సినిమా అక్కడ కూడా రెండు వందల కోట్లకుపైగా వసూళ్లను రాబట్టింది. ఈ సినిమా విడుదలై గురువారం నాటితో ఐదేళ్లు పూర్తయ్యాయి.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సినిమాలోని డిలీట్ సీన్‌ను దర్శకుడు సందీప్ వంగా సోషల్‌మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. ఈ సీన్ లో ప్రియురాలిని ముద్దు పెట్టుకున్నందుకు అందరూ తనను ద్వేషించడంపై విజయ్ క్లారిటీ ఇస్తూ కనిపించాడు. సక్సెస్‌ఫుల్ లవ్ స్టోరీస్ లో అమ్మాయిల తండ్రులకు అబ్బాయిలు ఎప్పుడూ నచ్చారటూ విజయ్ కి రాహుల్ రామకృష్ణ సమాధానం చెబుతూ కనిపించడం ఆకట్టుకుంటోంది.
ఈ సీన్ బాగుందని డిలేట్ చేసుండకపోతే బాగుండేదని పలువురు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అర్జున్ రెడ్డి సినిమాలో షాలిని పాండే హీరోయిన్‌గా నటించింది.