Vijay Deverakonda: ర‌ష్మిక‌తో ప్రేమాయ‌ణంపై ఓపెన్ అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌-vijay deverakonda opens up his relationship with rashmika mandanna on koffee with karan show ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Vijay Deverakonda: ర‌ష్మిక‌తో ప్రేమాయ‌ణంపై ఓపెన్ అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

Vijay Deverakonda: ర‌ష్మిక‌తో ప్రేమాయ‌ణంపై ఓపెన్ అయిన విజ‌య్ దేవ‌ర‌కొండ‌

HT Telugu Desk HT Telugu
Jul 29, 2022 07:17 AM IST

కాఫీ విత్ క‌ర‌ణ్ టాక్ షోకు లైగ‌ర్ హీరోయిన్ అన‌న్యా పాండే (Ananya Panday)తో క‌లిసి హాజ‌ర‌య్యాడు విజ‌య్ దేవ‌ర‌కొండ‌(Vijay.Deverakonda) గురువారం ఈ ఎపిసోడ్ రిలీజ్ అయ్యింది. ఇందులో ర‌ష్మిక మంద‌న్న‌తో (Rashmika Mandanna) త‌న రిలేష‌న్‌షిప్ గురించి విజ‌య్ ఏమ‌న్నాడంటే...

<p>రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ</p>
రష్మిక మందన్న, విజయ్ దేవరకొండ (twitter)

విజయ్ దేవరకొండతో రష్మిక మందన్న ప్రేమలో ఉన్నట్లుగా చాలా కాలంగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. వీరిద్దరు కలిసి గీతా గోవిందం, డియర్ కామ్రేడ్ సినిమాలో జంటగా నటించారు. ఈ సినిమాల్లో విజ‌య్‌, రష్మిక కెమిస్ట్రీ బాగా వర్కవుట్ అయ్యింది.

ఈ షూటింగ్స్ లో ఇద్ద‌రి మ‌ధ్య మొద‌లైన ప‌రిచ‌యం కాస్త ప్రేమ‌గా దారితీసిన‌ట్లు వార్త‌లొచ్చాయి. విజ‌య్ దేవ‌ర‌కొండ ఇంట్లో జ‌రిగిన ప‌లు ఫంక్ష‌న్స్‌కు ర‌ష్మిక మంద‌న్న ప్ర‌త్యేకంగా హాజ‌రైంది. 2022 న్యూ ఇయ‌ర్ వేడుక‌ల్లో విజ‌య్ ఫ్యామిలీతో క‌లిసి ర‌ష్మిక మంద‌న్న గోవా వెళ్ల‌డం హాట్ టాపిక్‌గా మారింది. తాజాగా కాఫీ విత్ క‌ర‌ణ్ షోకు లైగర్ హీరోయిన్ అన‌న్యా పాండేతో క‌లిసి విజ‌య్ దేవ‌ర‌కొండ హాజ‌ర‌య్యాడు.

ఈ షోలో త‌న సీక్రెట్ రిలేష‌న్‌షిప్స్ గురించి క‌ర‌ణ్ జోహార్ అడిగిన ఓ ప్ర‌శ్న‌కు బ‌దులిచ్చిన విజయ్ ర‌ష్మిక‌తో అనుబంధాన్ని గురించి వెల్ల‌డించాడు. ర‌ష్మిక త‌న డార్లింగ్ అంటూ పేర్కొన్నాడు. త‌న బెస్ట్ ఫ్రెండ్స్‌ ర‌ష్మిక ఒక‌ర‌ని అన్నాడు. ర‌ష్మిక ప‌ట్ల త‌న‌కు అభిమానం, ఇష్టం ఉన్నాయ‌ని, తన జీవితంలోని ఎత్తుప‌ల్లాల గురించి ఏదీ దాచ‌కుండా పంచుకునే మంచి స్నేహం ఇద్ద‌రి మ‌ధ్య ఉంద‌ని అన్నాడు. ర‌ష్మిక కూడా త‌న వ‌ద్ద ఏది దాచ‌కుండా చెబుతుంద‌ని విజ‌య్ చెప్పాడు.

ప్ర‌జెంట్ రిలేష‌న్‌షిప్ స్టేట‌స్ గురించి క‌ర‌ణ్‌జోహార్ అడిగిన ప్ర‌శ్న‌కు విజ‌య్ తెలివిగా స‌మాధానం చెప్పాడు. త‌న ప్రేమాయ‌ణం గురించి చెప్పి అభిమానుల‌ను బాధ‌పెట్ట‌డం ఇష్టం లేదంటూ స‌మాధానం ఇచ్చాడు. ఏదో ఒక‌రోజు త‌ప్‌ాకుండా తాను పెళ్లి చేసుకుంటానని, పిల్లల్ని కంటానని అన్నారు. ఆరోజు త‌న రిలేష‌న్‌షిప్ గురించి అంద‌రికి చెబుతాన‌ని అన్నారు.

అప్ప‌టివ‌ర‌కు తన ప్రేమాయణాన్ని ర‌హ‌స్యంగానే ఉంచ‌డం మంచిదంటూ విజ‌య్ అన్నాడు. ఓ న‌టుడిగా త‌న‌పై ఎంతో మంది ప్రేమ‌ను కురిపిస్తున్నార‌ని, ఆరాధిస్తున్నార‌ని చెప్పారు. తన ప్రేమ‌క‌థ గురించి చెప్పి వారంద‌రి మ‌న‌సుల్ని నొప్పించ‌కూడ‌ద‌ని అనుకుంటున్న‌ట్లు కరణ్ ప్రశ్నకు విజయ్ స‌మాధానం ఇచ్చాడు.

Whats_app_banner

సంబంధిత కథనం