Samantha Yashoda Teaser: యశోద టీజర్ వచ్చేసింది - ఇంటెన్స్ రోల్‌లో సమంత
09 September 2022, 10:52 IST
Samantha Yashoda Teaser: సమంత హీరోయిన్ గా నటించిన యశోద సినిమా టీజర్ శుక్రవారం విడుదలైంది. ఇందులో ప్రెగ్నెంట్ ఉమెన్ గా సమంత డిఫరెంట్ క్యారెక్టర్ లో కనిపిస్తోంది.
సమంత
Samantha Yashoda Teaser: హీరోయిన్ గా నటించిన యశోద సినిమా టీజర్ శుక్రవారం విడుదలైంది. ఈ టీజర్ లో యశోద అంటూ పేరు పిలవగానే సమంత ఎంట్రీ ఇవ్వడం ఆసక్తిని పంచుతోంది. ఇందులో కంగ్రాచ్యులేషన్స్ నువ్వు ప్రెగ్నెంట్. మొదటి మూడు నెలలు చాలా జాగ్రత్తగా ఉండాలి అంటూ డాక్టర్... సమంతకు సలహాలు ఇస్తూ కనిపిస్తోంది. నడిచేటప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకొని నడవాలి అంటూ డాక్టర్ చెబుతున్నప్పుడే సమంత అడవిలో నుంచి పరిగెత్తుతున్నట్లుగా టీజర్ లో చూపించారు.
బరువులు ఎత్తకూడదని చెప్పగానే వెయిట్ లిఫ్టింగ్ రాడ్ ఎత్తడానికి సమంత ప్రయత్నించడం ఆసక్తిని రేకెత్తిస్తోంది. ఏ పని చేసిన దెబ్బ తగలకుండా చూసుకోవాలని అనగానే సమంత శత్రువులతో ఫైట్ చేస్తూ కనిపిస్తోంది. డాక్టర్ చెప్పిన సలహాలకు పూర్తి భిన్నంగా ఆమెకు ఎదురైన పరిణామాలతో టీజర్ ను ఉత్కంఠభరితంగా తీర్చిదిద్దారు. ప్రెగ్నెంట్ ఉమెన్ గా సమంత పాత్ర పవర్ ఫుల్ గా టీజర్ లో కనిపిస్తోంది. తనకు ఎదురైన కఠిన పరిస్థితులను ఎదురించి పోరాడే మహిళగా ఆమె కనిపించబోతున్నది.
యాక్షన్, ఎమోషన్స్, థ్రిల్ అంశాలతో ఉత్కంఠభరితంగా టీజర్ సాగింది. ఈ టీజర్ లో సమంతతో పాటు ఉన్ని ముకుందన్ కనిపించాడు. లేడీ ఓరియెంటెడ్ కథాంశంతో రూపొందుతున్న ఈ చిత్రానికి హరీ, హరీష్ దర్శకత్వం వహిస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ తో పాటు హిందీలో ఈ సినిమాను రిలీజ్ చేయబోతున్నారు. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాతో పాటుగా తెలుగులో శాకుంతలం సినిమా చేస్తోంది సమంత.