తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha: నిర్మాతగా మారుతున్న సమంత.. ప్రొడక్షన్ హౌస్‍కు డిఫరెంట్ పేరు

Samantha: నిర్మాతగా మారుతున్న సమంత.. ప్రొడక్షన్ హౌస్‍కు డిఫరెంట్ పేరు

10 December 2023, 22:48 IST

google News
    • Samantha New Production House: హీరోయిన్ సమంత కొత్త ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. దీని కింద ఆమె సినిమాలను నిర్మించనున్నారు. ఈ విషయాన్ని ఆమె అధికారికంగా ప్రకటించారు.
Samantha: నిర్మాతగా మారుతున్న సమంత.. ప్రొడక్షన్ హౌస్‍కు డిఫరెంట్ పేరు
Samantha: నిర్మాతగా మారుతున్న సమంత.. ప్రొడక్షన్ హౌస్‍కు డిఫరెంట్ పేరు

Samantha: నిర్మాతగా మారుతున్న సమంత.. ప్రొడక్షన్ హౌస్‍కు డిఫరెంట్ పేరు

Samantha New Production House: స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు.. సినిమాల నుంచి బ్రేక్ తీసుకున్నారు. మయోసైటిస్‍తో బాధ పడుతున్న ఆమె కోలుకునేందుకు విరామం తీసుకున్నారు. చివరిగా ఖుషి చిత్రంలో ఆమె కనిపించారు. విజయ్ దేవరకొండ హీరోగా నటించిన ఆ చిత్రం ఈ ఏడాది సెప్టెంబర్ 1వ తేదీన రిలీజ్ అయింది. ఖుషి తర్వాత ఏ సినిమాకు ఓకే చెప్పలేదు సమంత. ఇంకా బ్రేక్ కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో సడన్‍గా ఓ కీలక ప్రకటన చేశారు సమంత. సొంత ప్రొడక్షన్ హౌస్‍ను స్థాపించారు.

తన ప్రొడక్షన్ హౌస్‍ను సోషల్ మీడియా వేదికగా నేడు (డిసెంబర్ 10) ప్రకటించారు సమంత. ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ (Tralala Moving Pictures) అనే పేరును ప్రొడక్షన్ హౌస్‍కు పెట్టారు. తన ఫేవరెట్ ఇంగ్లిష్ పాప్ సాంగ్ ‘బ్రౌన్ గర్ల్ ఇన్ ది రింగ్’ పాట స్ఫూర్తిగా ప్రొడక్షన్ హౌస్‍కు ఈ పేరు నిర్ణయించినట్టు ఇన్‍స్టాగ్రామ్‍లో సమంత తెలిపారు.

కొత్త తరం ఆలోచనలను, భావవ్యక్తీకరణలు ఉన్న కంటెంట్‍ను ప్రొడ్యూజ్ చేయడమే ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ లక్ష్యమని సమంత పేర్కొన్నారు. మన సామాజిక పరిస్థితుల్లోని సంక్లిష్టతలను, బలాల గురించి తెలిపే కథలను ఆహ్వానిస్తామని, ప్రోత్సహిస్తామని తెలిపారు. అర్థవంతమైన, యూనివర్సల్, ప్రామాణికమైన కథలను చెప్పాలనుకుంటున్న వారికి ఇది ఒక ప్లాట్‍ఫామ్‍గా ఉంటుందని సమంత తెలిపారు.

ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ ప్రొడక్షన్ హౌస్‍ను సమంత ప్రకటించడంతో చాలా మంది ఆమెకు రిక్వెస్టులు చేశారు. తమ వద్ద మంచి కథలు ఉన్నాయంటూ కొందరు కామెంట్లు చేస్తున్నారు. తమకు ఓ ఛాన్స్ ఇవ్వాలని కొందరు రాసుకొస్తున్నారు. చాలా మంది సమంతకు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

సమంత మళ్లీ హీరోయిన్‍గా రీ-ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్టు కనిపిస్తోంది. మయోసైటిస్‍కు చికిత్సను ఆమె పూర్తి చేసుకున్నారని తెలుస్తోంది. ఎంటీవీ హసల్ షోలోనూ జడ్జిగా ఆమె పాల్గొననున్నారు. అలాగే, ఇటీవల వరుసగా ఫొటో షూట్‍లను కూడా సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారు.

సమంత నటించిన సిటాడెల్ ఇండియన్ వెర్షన్ వెబ్ సిరీస్ రిలీజ్ కావాల్సి ఉంది. అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లో ఈ సిరీస్ రానుంది. వరుణ్ ధావన్, సమంత ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సిరీస్ స్ట్రీమింగ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు. ఈ వెబ్ సిరీస్‍ కోసం తన షూటింగ్‍ను ఈ ఏడాది జూలైలోనే ఫినిష్ చేశారు సమంత. ఖుషి సినిమా సెప్టెంబర్ 1న రిలీజ్ కాగా.. ఆ తర్వాతి నుంచి ఆమె విరామం తీసుకుంటున్నారు. సమంత మళ్లీ సినిమాల్లోకి రావాలని అభిమానులు వేచిచూస్తున్నారు.

తదుపరి వ్యాసం