తెలుగు న్యూస్  /  Entertainment  /  Samantha New Year Wishes With Her Cute Smile Photo

Samantha New Year Wishes: ఎన్నాళ్లకెన్నాళ్లకు.. న్యూఇయర్‌ విషెస్‌తో తన నాటీ ఫొటో షేర్‌ చేసిన సమంత

Hari Prasad S HT Telugu

29 December 2022, 20:05 IST

    • Samantha New Year Wishes: చాన్నాళ్ల తర్వాత సమంత న్యూఇయర్‌ విషెస్‌తో ఫ్యాన్స్‌ ముందుకు వచ్చింది. తన నాటీ ఫొటోను షేర్‌ చేస్తూ అటు ఇన్‌స్టాగ్రామ్‌లో, ఇటు ట్విటర్‌లో పోస్ట్‌లు చేసింది.
సమంత పోస్ట్ చేసిన ఫొటో
సమంత పోస్ట్ చేసిన ఫొటో

సమంత పోస్ట్ చేసిన ఫొటో

Samantha New Year Wishes: వరుస సినిమాలతో బిజీగా ఉండటంతోపాటు ఆరోగ్య సమస్యలతోనూ బాధపడుతోంది సమంత. దీంతో చాలా రోజులుగా సోషల్‌ మీడియాకు దూరంగా ఉంటోంది. అప్పుడెప్పుడో యశోద మూవీ ప్రమోషన్లలో భాగంగా కొన్ని పోస్ట్‌లు చేసింది. ఇక ఈ మధ్య తనలాగే అనారోగ్యంతో పోరాడుతున్న మహిళల కోసం ఓ స్ఫూర్తిదాయక పోస్ట్‌ చేసింది.

ట్రెండింగ్ వార్తలు

Panchayat Season 3 OTT: పాపులర్ సిరీస్ పంచాయత్ మూడో సీజన్‍పై అప్‍డేట్ ఇచ్చిన ఓటీటీ ప్లాట్‍ఫామ్

Romeo OTT: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేస్తున్న విజయ్ ఆంటోనీ సినిమా! కానీ..

Mahesh Babu new look: పెళ్లి వేడుకకు కొత్త లుక్‌లో మహేష్ బాబు.. జుట్టు పట్టుకొని ఆట పట్టించిన అక్క మంజుల

Theatre releases this week: ఈ వారం థియేటర్లలోకి రానున్న 5 సినిమాలు.. డిఫరెంట్ జానర్లతో..

ఇక ఇప్పుడు చాలా రోజుల తర్వాత తన ఫొటోను షేర్‌ చేస్తూ న్యూ ఇయర్‌ విషెస్‌ చెప్పింది. ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఆమె ఒకటే ఫొటో, సందేశాన్ని పోస్ట్‌ చేసింది. ఈ ఫొటోలో సమంత తన క్యూట్‌ స్మైల్‌తో కనిపిస్తోంది. దీనికితోడు ఓ మంచి న్యూ ఇయర్‌ మెసేజ్‌ను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంది.

"ముందుకు సాగండి.. మనం ఏం నియంత్రించగలమో వాటిని నియంత్రించండి!! ఇది కొత్త, సులువైన రెజల్యూషన్స్‌ తీసుకునే సమయం. గాడ్‌ బ్లెస్‌. హ్యాపీ 2023" అని సమంత క్యాప్షన్‌ ఉంచింది. చాలా రోజుల తర్వాత సమంతను ఇలా హ్యాపీగా చూసిన ఫ్యాన్స్‌.. ఇన్‌స్టాగ్రామ్‌లో లక్షల కొద్దీ లైక్స్‌, వేల కొద్దీ కామెంట్స్‌ చేస్తున్నారు.

చాలా మంది అభిమానులు హార్ట్‌ ఎమోజీలు పోస్ట్‌ చేశారు. 2022లో సమంత రెండు సినిమాల్లో కనిపించింది. అందులో యశోద కూడా ఒకటి. ఈ సినిమా సూపర్‌ హిట్‌ టాక్‌ సొంతం చేసుకుంది. ఇక వచ్చే ఏడాది కూడా రెండు పెద్ద సినిమాలతో సమంత ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

అందులో చాలా రోజులుగా వేచి చూస్తున్న శాకుంతలం ఒకటి కాగా.. మరొకటి విజయ్‌ దేవరకొండతో కలిసి నటిస్తున్న ఖుషీ. ఈ సినిమా షూటింగ్‌లో ఉన్న సమయంలోనే సమంత అనారోగ్యానికి గురైంది. దీంతో ఆమె కొత్త ప్రాజెక్ట్‌లకు సైన్‌ చేయలేదు. అయితే ఆమె త్వరలోనే తన అనారోగ్యాన్ని జయించి మళ్లీ కొత్త ప్రాజెక్ట్‌లతో వస్తుందని ఫ్యాన్స్‌ ఆశతో ఉన్నారు.

2023 ఏడాది ఆమె మరింత సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఇక ప్రస్తుతం ఆమె లేటెస్ట్‌ మూవీ యశోద ప్రస్తుతం అమెజాన్‌ ప్రైమ్‌ వీడియోలో స్ట్రీమ్‌ అవుతోంది. ఈ సినిమా రూ.40 కోట్లు వసూలు చేసినట్లు మేకర్స్‌ అనౌన్స్ చేశారు.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.