Samantha opted Ayurvedic Medicines: సమంత హెల్త్ అప్డేట్.. ఆయుర్వేద మందులను వాడుతున్న హీరోయిన్-samantha opted ayurvedic medicines for her health condition ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Samantha Opted Ayurvedic Medicines For Her Health Condition

Samantha opted Ayurvedic Medicines: సమంత హెల్త్ అప్డేట్.. ఆయుర్వేద మందులను వాడుతున్న హీరోయిన్

Maragani Govardhan HT Telugu
Nov 29, 2022 11:11 AM IST

Samantha opted Ayurvedic Medicines: సమంతా రూత్ ప్రభు తన ఆరోగ్యం కోసం ఆయుర్వేద మందులను వాడుతుందట. మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఈ హీరోయిన్.. ఓ పక్క ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటూనే మరోపక్క ఆయుర్వేద మందులను కూడా ఉపయోగిస్తున్నారట.

సమంత
సమంత

Samantha opted Ayurvedic Medicines: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత రూత్ ప్రభు మయోసైటిస్ అనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం గత కొన్ని నెలలుగా హైదరాబాద్‌ అపోలో ఆసుపత్రిలో చికిత్స తీసుకున్నారు. ఓ పక్క చికిత్స తీసుకుంటూనే ఆమె తను నటించిన యశోద చిత్ర ప్రమోషన్లలోనూ పాల్గొన్నారు. ఫలితంగా ఈ సినిమా కూడా మంచి సక్సెస్ అందుకోవడంతో ఆ విజయాన్ని ఆస్వాదిస్తున్నారు. ఇదిలా ఉంటే తన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం మెరుగుపడిందని ఫిల్మ్ వర్గాల సమాచారం.

త్వరలోనే తన ఆరోగ్యం పూర్తిగా మెరుగుపడుతుందని యశోద ప్రచార కార్యక్రమాల్లో భాగంగా సామ్ చెప్పింది. ఓ పక్క వైద్యుల చికిత్స తీసుకుంటూనే మరోపక్క ఆయుర్వేద మందులను కూడా ఉపయోగిస్తుందట. ఫిల్మ్ వర్గాల తాజాగా నివేదికల ప్రకారం సామ్ ఇమ్యూనిటీ బూస్టింగ్ థెరపీని చేయింకుంటోంది. మరోపక్క ఆయుర్వేద మందులను కూడా ప్రయత్నిస్తుంది. తన ఆరోగ్య పరిస్థితిని బట్టి రెండు రకాలుగా ఆమె ప్రయత్నిస్తున్నారు.

సామ్ తన ఆరోగ్య పరిస్థితి గురించి బహిర్గతపరచగానే.. ఆమె కండీషన్‌పై రకరకాలు వార్తలు సోషల్ మీడియాలో పుట్టుకొచ్చాయి. సామ్‌కు చాలా అరుదైన వ్యాధి వచ్చిందని.. తను చనిపోయే ప్రమాదముందని కూడా పుకార్లు వచ్చాయి. వీటన్నంటికీ ముద్దుగుమ్మ స్పష్టత కూడా ఇచ్చారు. తానున్న పరిస్థితి అంత తీవ్రమైంది కాదని, ప్రస్తుతానికి తాను ఇంకా బతికే ఉన్నానని తెలిపారు.

సమంత ప్రధాన పాత్రలో నటించిన యశోద చిత్రంలో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేష్, మురళి శర్మ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. హరి-హరీష్ సంయుక్తంగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమా నవంబరు 11న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. శ్రీదేవీ మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు. మణిశర్మ సంగీతాన్ని సమకూర్చారు.

IPL_Entry_Point

సంబంధిత కథనం

టాపిక్