తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha Lip Lock: ఆ బాలీవుడ్ హీరోతో సమంత లిప్ లాక్, ఇంటిమేట్ సీన్లు

Samantha Lip Lock: ఆ బాలీవుడ్ హీరోతో సమంత లిప్ లాక్, ఇంటిమేట్ సీన్లు

Hari Prasad S HT Telugu

22 May 2023, 16:05 IST

    • Samantha Lip Lock: ఆ బాలీవుడ్ హీరోతో సమంత లిప్ లాక్, ఇంటిమేట్ సీన్లు చేయనుందట. సిటడెల్ హిందీ రీమేక్ వస్తున్న సంగతి తెలుసు కదా. దీంతో ఇంగ్లిష్ వెర్షన్ లో ప్రియాంకా చోప్రాలాగే హిందీలోనూ సమంత రెచ్చిపోయి నటించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సమంత, వరుణ్ ధావన్
సమంత, వరుణ్ ధావన్

సమంత, వరుణ్ ధావన్

Samantha Lip Lock: సమంత లిప్ లాక్, సెక్స్ సీన్లలో నటించడం చాలా అరుదు. తొలి సినిమాలోనే తన మాజీ భర్త నాగ చైతన్యతో చాలాసార్లు లిప్ లాక్ సీన్లలో నటించినా.. తర్వాత అలాంటివి ఎక్కువగా చేయలేదు. అయితే తాజాగా సిటడెల్ హిందీ వెర్షన్ వెబ్ సిరీస్ కోసం మాత్రం ఆమె రెచ్చిపోయి నటిస్తున్నట్లు సమాచారం. ఇందులో బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్ తో కలిసి సమంత అలాంటి సీన్లలో నటిస్తున్నట్లు సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

Prabhas: నా బుజ్జిని చూస్తారా: కల్కి 2898 ఏడీపై ప్రభాస్ ఇన్‌స్టాగ్రామ్ స్టోరీ వైరల్

Prasanna Vadanam OTT Release date: ప్రసన్న వదనం ఓటీటీ రిలీజ్ డేట్ ఇదే.. ఇలా చేస్తే 24 గంటలు ముందుగానే చూడొచ్చు..

Devara fear song promo: దేవర ఫస్ట్ సింగిల్ ఫియర్ సాంగ్ ప్రోమో చూశారా.. అదిరిపోయిన బీజీఎం

Suresh Babu on Theatres: ఓటీటీ మమ్మల్ని దెబ్బ కొడుతోంది.. థియేటర్లలను ఫంక్షన్ హాల్స్‌గా మార్చాల్సిందే: సురేశ్ బాబు

ఈ మధ్యే ప్రైమ్ వీడియోలో వచ్చిన ఇంగ్లిష్ వెర్షన్ సిటడెల్ లో ప్రియాంకా చోప్రా జొనాస్ ఎలా రెచ్చిపోయి నటించిందో చూశారు కదా. రిచర్డ్ మాడెన్ తో లిప్ లాక్, సెక్స్ సీన్లలో ప్రియాంకా చెలరేగిపోయింది. ఇక ఇదే సిటడెల్ హిందీ వెర్షన్ లో ఆ పాత్రల్లో వరుణ్ ధావన్, సమంత కలిసి నటిస్తున్నారు. వాళ్లలాగే వీళ్ల మధ్య కూడా కొన్ని ఇంటిమేట్ సీన్లు ఉండనున్నట్లు తమిళ వెబ్ సైట్ దినమలార్ తన రిపోర్టులో వెల్లడించింది.

ఈ హిందీ సిటడెల్ కు రాజ్ అండ్ డీకే దర్శకత్వం వహిస్తున్నారు. నిజానికి ఇది ఇంగ్లిష్ వెర్షన్ కు రీమేక్ కాదని మేకర్స్ చెబుతున్నా.. ఆ సిరీస్ నే ఇండియన్ ప్రేక్షకులకు తగినట్లుగా రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంగ్లిష్ సిటడెల్ లో నాదియా సింగ్ గా నటించిన ప్రియాంకా, మేసన్ గా నటించిన రిచర్డ్ మధ్య కొన్ని సెక్స్ సీన్లు ఉన్నాయి.

ఇప్పుడు వాటిని హిందీ వెర్షన్ లో అలాగే ఉంచనున్నట్లు తెలుస్తున్నా దీనిపై మేకర్స్ నుంచి అధికారిక సమాచారం ఏదీ లేదు. రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లోనే వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో సమంత కొన్ని బోల్డ్ సీన్లలో నటించిన విషయం తెలిసిందే. అప్పుడే ఆమెపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. ఆ సిరీస్ లో నటిస్తున్న సమయానికి సమంత ఇంకా విడాకులు కూడా తీసుకోకపోవడంతో ఆ సీన్లపై విమర్శలు వెల్లువెత్తాయి.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం