Varun Dhawan On Samantha : సమంత అందంతో మెరిసిపోతోంది-samantha reacts to mean comment about losing her charm varun supports her ,ఎంటర్‌టైన్‌మెంట్ న్యూస్
తెలుగు న్యూస్  /  Entertainment  /  Samantha Reacts To Mean Comment About Losing Her Charm Varun Supports Her

Varun Dhawan On Samantha : సమంత అందంతో మెరిసిపోతోంది

HT Telugu Desk HT Telugu
Jan 10, 2023 03:21 PM IST

Tweet On Samantha Myositis Disease : సమంత మయోసిటీస్ తో బాధపడుతున్న విషయం తెలిసిందే. శాకుంతలం ట్రైలర్ రిలీజ్ సందర్భంగా ఆమె కెమెరా ముందుకు వచ్చింది. వ్యాధి నిర్ధారణ తర్వాత సమంత ఆకర్షణ కోల్పోయిందని ఓ ట్వీట్ వైరల్ అయింది. దీనిపై బాలీవుడ్ నటుడు వరుణ్ ధావన్ స్పందించాడు.

సమంతతో వరుణ్
సమంతతో వరుణ్ (twitter)

శాకుంతలం(Shaakuntalam) సినిమా ట్రైలర్ విడుదల అయింది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ట్రైలర్ లాంఛ్ సందర్భంగా కెమెరా ముందుకు వచ్చింది సమంత. ఈ సందర్భంగా ఓ ట్వీట్ వైరల్ అయింది. మయోసిటీస్ వ్యాధి తర్వాత.. సమంత'ఆకర్షణ, మెరుపును కోల్పోయిందని' ట్వీట్ చేశారు. దీనిపై వరుణ్ ధావన్(Varun Dhawan) సమంతకు మద్దతుగా నిలిచాడు. వరుణ్ ఆ ట్వీట్‌ను విమర్శించాడు.

'దేని గురించి నువ్ బాధపడకు. గ్లో అనేది ఇన్ స్టాగ్రామ్ ఫిల్టర్స్ లో అందుబాటులో ఉంటుంది. సమంతను కలవండి గ్లోతో ఉంది.. నన్ను నమ్మండి.' అంటూ వరుణ్ ధావన్ ట్వీట్ చేశాడు.

సోమవారం సమంత పాన్ ఇండియా చిత్రం శాకుంతలం ట్రైలర్‌ను లాంచ్ అయింది. ఈ కార్యక్రమానికి తెల్లటి చీరలో కళ్లద్దాలు ధరించి సమంత వచ్చింది. ట్రైలర్ లాంచ్ ఈవెంట్ ఫోటోలను పంచుకుంటూ ఒక ట్విట్టర్ హ్యాండిల్ ఇలా రాసింది, 'సమంత గురించి బాధపడుతున్నా. ఆమె తన అందాన్ని, ఆకర్షణను కోల్పోయింది. ఆమె విడాకుల నుండి బయటకు వచ్చిందని, ఆమె వృత్తిపరమైన జీవితం చాలా ఎత్తులో ఉందని అందరూ భావించారు. కానీ మయోసిటీస్(Myositis Disease) సమంతను తీవ్రంగా దెబ్బతీసింది, ఆమె మళ్లీ బలహీనపడింది.' అని ఉంది. దీనిపై వరుణ్ ధావన్ కౌంటర్ ఇచ్చాడు. సమంత అభిమానులు, నెటిజన్ల వరుణ్ ధావన్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఇదే విషయం మీద సమంత కూడా స్పందించింది. 'నేను చేసినట్లుగా మీరు నెలల తరబడి చికిత్స, మందులను వాడకూడదని నేను ప్రార్థిస్తున్నాను. మీ గ్లో పెరిగేందుకు నా నుండి కొంత ప్రేమ ఇస్తాను.' అని చెప్పింది సామ్. గతేడాది అక్టోబర్‌లో సమంత తనకు ఉన్న మయోసిటీస్ గురించి వెల్లడించింది. అప్పటి నుంచి ఆమె చికిత్స పొందుతోంది.

IPL_Entry_Point