తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha Injured: సమంత చేతులకు ఆ గాయాలేంటి? అసలేం జరిగింది?

Samantha Injured: సమంత చేతులకు ఆ గాయాలేంటి? అసలేం జరిగింది?

Hari Prasad S HT Telugu

28 February 2023, 15:58 IST

google News
    • Samantha Injured: సమంత చేతులకు ఆ గాయాలేంటి? అసలేం జరిగింది? ఇప్పుడీ ప్రశ్నలు అభిమానులను వేధిస్తున్నాయి. తాజాగా సామ్ తన ఇన్‌స్టా స్టోరీల్లో పోస్ట్ చేసిన ఫొటో వైరల్ అవుతోంది.
సమంత చేతులకు గాయాలు
సమంత చేతులకు గాయాలు

సమంత చేతులకు గాయాలు

Samantha Injured: సమంత టాలెంటెడ్ నటే కాదు.. అంతకుమించి అంకితభావం కలిగిన వ్యక్తి. ఈ మధ్యే మయోసైటిస్ అనే వ్యాధి నుంచి కోలుకుంటున్న సామ్.. తిరిగి పూర్తి ఫిట్‌నెస్ సాధించడానికి ప్రయత్నిస్తోంది. ఓవైపు సిటడెల్ అనే వెబ్ సిరీస్ లోనూ నటిస్తోంది. దీనికోసం ఆమె స్టంట్స్ చేయాల్సి వస్తోంది. ఇందులో భాగంగా ఆమె గాయపడింది.

తాజాగా తన చేతులకు అయిన గాయాలను చూపుతూ ఓ ఫొటోను సమంత తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేసింది. యాక్షన్ కు దక్కిన ఫలాలు అనే క్యాప్షన్ తో సామ్ ఈ పోస్ట్ చేయడం విశేషం. అందులో సమంత చేతులకు ఉన్న రక్తపు మరకలను చూడొచ్చు. ఈ సిరీస్ లో ఆమె చాలా యాక్షన్ సీన్స్ లో కనిపించబోతోంది. రాజ్ అండ్ డీకే డైరెక్షన్ లోనే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2లో నటించిన సమంత.. అందులోనూ కొన్ని యాక్షన్ సీన్స్ లో నటించిన విషయం తెలిసిందే.

ఇక ఇప్పుడు సిటడెల్ ఇండియన్ వెర్షన్ లో సామ్ నటిస్తోంది. ఈ సిరీస్ కోసం ఆమె తన ఫిట్‌నెస్ పై పని చేస్తోంది. ఈ మధ్యే నైనితాల్ లో గడ్డ కట్టించే చలిలో ఆమె ట్రైనింగ్ తీసుకుంటున్న వీడియో వైరల్ అయిన విషయం తెలిసిందే. అంతకుముందు హార్స్ రైడింగ్ చేస్తున్న ఫొటోను కూడా షేర్ చేసుకుంది.

రూసో బ్రదర్స్ క్రియేట్ చేసిన సిటాడెల్ ఇండియన్ వెర్షన్ ను రాజ్ అండ్ డీకే తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్ లో సమంత.. వరుణ్ ధావన్ తో కలిసి నటిస్తోంది. ఇదే సిరీస్ ఇంగ్లిష్ వెర్షన్ లో ప్రియాంకా చోప్రా నటిస్తోంది.

సమంత చివరిసారి యశోద మూవీలో కనిపించగా.. శాకుంతలం మూవీతో మరోసారి మెస్మరైజ్ చేయనుంది. ఈ సినిమా ఏప్రిల్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మైథలాజికల్ డ్రామాను గుణశేఖర్ తెరకెక్కించాడు. ఇక సమంత ఈ మధ్యే ఇండస్ట్రీలో 13 ఏళ్లు పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ లో ఓ ఎమోషనల్ పోస్ట్ చేసింది.

తదుపరి వ్యాసం