తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Naga Chaitanya On Samantha: స‌మంత ఏదైనా అనుకుంటే చేసి తీరుతుంది - మాజీ భార్య‌పై నాగ‌చైత‌న్య ప్ర‌శంస‌లు

Naga Chaitanya on Samantha: స‌మంత ఏదైనా అనుకుంటే చేసి తీరుతుంది - మాజీ భార్య‌పై నాగ‌చైత‌న్య ప్ర‌శంస‌లు

07 November 2023, 11:12 IST

google News
  • Naga Chaitanya on Samantha: మాజీ భార్య స‌మంత‌పై నాగ‌చైత‌న్య ప్ర‌శంస‌లు కురిపించాడు. స‌మంత చాలా హార్డ్ వ‌ర్క‌ర్ అని, త‌నలో సంక‌ల్ప బ‌లం ఎక్కువ‌ని ఇటీవ‌ల ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో నాగ‌చైత‌న్య పేర్కొన్నాడు. స‌మంత‌ను ఉద్దేశించి నాగ‌చైత‌న్య చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి

నాగ‌చైత‌న్య, స‌మంత‌
నాగ‌చైత‌న్య, స‌మంత‌

నాగ‌చైత‌న్య, స‌మంత‌

Naga Chaitanya on Samantha: స‌మంతలో సంక‌ల్ప‌బ‌లం ఎక్కువ‌ని, ఏదైనా ప‌ని చేయాల‌ని అనుకుంటే ఎన్ని అడ్డంకులు వ‌చ్చినా చేసి తీరుతుంద‌ని నాగ‌చైత‌న్య అన్నాడు. రీసెంట్‌గా ఇచ్చిన ఓ ఇంట‌ర్వ్యూలో మాజీ భార్య స‌మంత‌పై నాగ‌చైత‌న్య ప్ర‌శంస‌లు కురిపించాడు. ఈ ఇంట‌ర్వ్యూలో తాను ప‌నిచేసిన హీరోయిన్ల‌లో న‌చ్చే క్వాలిటీస్ గురించి నాగ‌చైత‌న్య వివ‌రించారు. కృతిశెట్టి, పూజాహెగ్డేతో పాటు స‌మంత లో న‌చ్చే క్వాలిటీస్ గురించి నాగ‌చైత‌న్య ఈ ఇంట‌ర్వ్యూలో చెప్ప‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

స‌మంత చాలా హార్డ్ వ‌ర్క‌ర్ , ఆమె సంక‌ల్ప బ‌లం అమేజింగ్ అని నాగ‌చైత‌న్య అన్నాడు. ఏదైనా ప‌ని చేయాల‌ని అనుకుంటే ఎన్ని అడ్డంకులు ఎదురైన స‌మంత పూర్తిచేసి తీరుతుంద‌ని నాగచైతన్య పేర్కొన్నాడు. స‌మంత గురించి నాగ‌చైత‌న్య చేసిన కామెంట్స్ వైర‌ల్ అవుతోన్నాయి.

నాగ‌చైత‌న్య హీరోగా న‌టించిన ఏ మాయ చేశావే సినిమాతోనే స‌మంత హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. చాలా ఏళ్ల పాటు ప్రేమ‌లో ఉన్న ఈ జంట 2017లో పెళ్లితో ఒక్క‌ట‌య్యారు. నాలుగేళ్ల పాటు ఎలాంటి అర‌మ‌రిక‌లు లేకుండా వారి కాపురం స‌జావుగా సాగింది.

2021లో మ‌న‌స్ఫ‌ర్థ‌ల‌తో విడాకులు తీసుకున్నారు. నాగ‌చైత‌న్య‌తో విడాకుల త‌ర్వాత తిరిగి సినిమాల‌పై ఫోక‌స్ పెట్టింది స‌మంత‌. ఇటీవ‌లే విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో ఖుషి సినిమా చేసింది. ప్ర‌స్తుతం మ‌యోసైటిస్ కార‌ణంగా సినిమాల‌కు దూరంగా ఉంటోంది స‌మంత‌.

తదుపరి వ్యాసం