తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Samantha Diagnosed With Myositis: ఆసుపత్రిలో సమంత.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న బ్యూటీ.. ఇంతకీ ఏమైంది?

Samantha Diagnosed with Myositis: ఆసుపత్రిలో సమంత.. అరుదైన వ్యాధితో బాధపడుతున్న బ్యూటీ.. ఇంతకీ ఏమైంది?

29 October 2022, 16:46 IST

google News
    • Samantha Diagnosed with Myositis: టాలీవుడ్ స్టార్ సమంత అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది. త్వరలోనే కోలుకుని తిరిగొస్తానని ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఫొటోను షేర్ చేసింది.
సమంత
సమంత (Twitter)

సమంత

Samantha Diagnosed with Myositis: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత చాలా కాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. ఇటీవలే మళ్లీ తన సామాజిక మాధ్యమాల వేదికగా వరుస పోస్టులతో సందడి చేస్తోంది. అయితే ఈ బ్యూటీ ఈ విధంగా గ్యాప్ తీసుకోవడానికి కారణమేంటి? అని సర్వత్రా ఆరా తీశారు. ఆమె అనారోగ్యం పాలైందని, అరుదైన వ్యాధితో బాధపడుతుందని రకరకాల ఊహాగానాలు వినిపించాయి. ఆమె కూడా ఈ వార్తలపై స్పందించలేదు. కానీ తొలిసారిగా తన ఆరోగ్యం గురించి సోషల్ మీడియా వేదికగా మాట్లాడింది. తాను అరుదైన వ్యాధితో బాధపడుతున్న సామ్ స్పష్టం చేసింది. అంతేకాకుండా తను ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకుంటున్న ఫొటోను కూడా షేర్ చేసింది.

"యశోద ట్రైలర్‌కు మీ స్పందన బాగుంది. మీ అందరితో నేను పంచుకునే ఈ ప్రేమ, అనుబంధమే జీవితం నాపై విసిరే సవాళ్లను ఎదుర్కోడానికి రక్షణ ఇస్తుంది. కొన్ని నెలల నుంచి నేను మయాసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ కండీషన్‌తో బాధపడుతున్నాను. ఈ పరిస్థితి నుంచి కోలుకున్న తర్వాత మీతో పంచుకుందామని అనుకున్నా. కానీ ఇది నేను అనుకున్నదానికంటే ఎక్కువ సమయం పట్టేలా కనిపిస్తోంది. మనం ఎల్లప్పుడూ బలమైన ముందడుగు వేయాల్సిన అవసరం లేదని నిదానంగా గ్రహించాను. ఈ పరిస్థితిని అంగీకరించడానికి నేను ఇంకా కష్టపడుతూనే ఉన్నాను. త్వరలోనే నేను పూర్తిగా కోలుకుంటానని వైద్యులు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. నాకు మంచి, చెడు రోజులు వచ్చాయి. శారీరకంగా, మానసికంగా వీటిని నేను హ్యాండిల్ చేయలేనని అనిపించినప్పుడు కూడా ఏదోక విధంగా సమయం గడిచిపోయింది. నేను కోలుకునే రోజు దగ్గరగా ఉందని ఆశిస్తున్నాను. నేను ఎల్లప్పుడు మిమ్మల్ని ప్రేమిస్తూ ఉంటాను." అని సమంత తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ పెట్టింది. ఈ పోస్టుపై నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు. ఆమె త్వరగా కోలుకోవాలని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం సమంత నటించిన యశోద సినిమా వచ్చే నెలలో విడుదల కానుంది. ఇటీవలే విడుదలైన ఈ చిత్ర ట్రైలర్‌కు విశేష స్పందన లభిస్తోంది. ఇది కాకుండా గుణశేఖర్ దర్శకత్వంలో శాకుంతలం అనే సినిమా చేస్తోంది. వీటితో పాటు కొన్ని బాలీవుడ్ ఆఫర్లకు కూడా పచ్చజెండా ఊపింది సామ్.

తదుపరి వ్యాసం