Samantha: నాగచైతన్యతో తాను కలిసి ఉన్న ఇంటిని మళ్లీ కొనుక్కున్న సమంత
28 July 2022, 13:03 IST
- Samantha: నాగచైతన్యతో విడాకుల విషయంలో చాలా మంది సమంతనే నిందించారు. సోషల్ మీడియాలో ఆమెను దారుణంగా ట్రోల్ చేశారు. అయితే తాజాగా వచ్చిన వార్తలు చూస్తే మాత్రం సమంత చేసిన పని కాస్త ఆశ్చర్యానికి గురి చేస్తుంది.
సమంత
టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో ఒకటిగా నిలిచింది నాగచైతన్య, సమంత జోడీ. అయితే గతేడాది వీళ్లు విడిపోవడం చాలా మంది ఫ్యాన్స్‌కు ఇప్పటికీ మింగుడుపడటం లేదు. ఈ విడాకుల విషయంలో నాగచైతన్యపై చాలా మంది సానుభూతి చూపించగా.. సమంత వల్లే ఇలా జరిగిందంటూ ఆమెను నిందించారు. అయితే తాజాగా ఆమె చేసిన ఓ పని మాత్రం ఆశ్చర్యం కలిగిస్తోంది.
గతంలో నాగచైతన్యతో తాను కలిసి ఉన్న ఇంటిని సమంత మళ్లీ కొన్నదట. ఈ విషయాన్ని ప్రముఖ నటుడు, నిర్మాత మురళీ మోహన్ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. గతంలో ఈ ఇంటిని వేరే వాళ్లకు అమ్మేయగా.. సమంత ఇప్పుడు తన సొంత డబ్బులతో వాళ్ల నుంచి తిరిగి కొన్నదని అతడు వెల్లడించాడు. ఎవరికైతే ఆ ఇల్లు అమ్మేశారో.. వాళ్లకే కాస్త ఎక్కువ మొత్తం ఇచ్చి మరీ సామ్ ఈ ఇల్లు కొన్నదట.
ఇప్పుడు సమంత అదే ఇంట్లో తన తల్లితో కలిసి ఉంటోందని మురళీ మోహన్ ఈ ఇంటర్వ్యూలో చెప్పాడు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇది చూసిన చాలా మంది సమంత చేసిన పనికి ఆశ్చర్యపోతున్నారు. ఇక గతేడాది అక్టోబర్‌లో చైతూతో విడిపోయిన సమంత.. విడాకులపై తొలిసారి కాఫీ విత్ కరణ్ షోలో స్పందించిన విషయం తెలిసిందే.
విడాకుల సమయంలో అందరూ తనను నిందించడం బాధ కలిగించినా.. అప్పుడు తన దగ్గర దానికి సమాధానం లేదని ఈ ఇంటర్వ్యూలో సమంత చెప్పింది. ఇప్పుడు తాను దాన్నుంచి పూర్తిగా కోలుకున్నానని, దృఢంగా ఉన్నట్లు కూడా సమంత తెలిపింది. అయితే ప్రస్తుతానికైతే చైతూతో అంత మంచి సంబంధాలు లేవని, భవిష్యత్తులో ఏమైనా మెరుగవుతాయేమో చెప్పలేనని సామ్ చెప్పింది.