Kushi Movie - Samantha: ఉమెన్స్ డే రోజు ఖుషి సెట్స్‌లోకి సమంత రీఎంట్రీ - గ్రాండ్ వెల్కమ్ చెప్పిన టీమ్
09 March 2023, 8:28 IST
Kushi Movie - Samantha: ఉమెన్స్ డే రోజున ఖుషి సినిమా సెట్స్‌లోకి సమంత రీఎంట్రీ ఇచ్చింది. చిత్ర యూనిట్ ఆమెకు గ్రాండ్ వెల్కమ్ చెప్పారు.
సమంత, విజయ్ దేవరకొండ, శివనిర్వాణ
Kushi Movie - Samantha: ఖుషి సినిమా ఫ్యాన్స్‌కు ఉమెన్స్ డే రోజు చిత్ర యూనిట్ అదిరిపోయే అప్‌డేట్ అందించింది. ఈ సినిమా సెట్స్‌లో సమంత తిరిగి అడుగుపెట్టినట్లు తెలిపింది. సమంతకు చిత్ర యూనిట్ గ్రాండ్ వెల్కమ్ చెప్పారు రీఎంట్రీ ఇచ్చిన సామ్ చేత కేక్ కట్ చేయించారు. ఫైటర్ సమంత బ్యాక్ టూ ఖుషి సెట్స్ అంటూ దర్శకుడు శివనిర్వాణ ట్వీట్ చేశాడు.
సమంత కేక్ కట్ చేస్తోన్న ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్‌చేశాడు. ఈ ఫొటోల్లో సమంతతో పాటు విజయ్ దేవరకొండ, దర్శకుడు శివనిర్వాణతో పాటు ఇతర చిత్ర యూనిట్ సభ్యులు కనిపిస్తోన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. సినీ పరిశ్రమలో సమంత అడుగుపెట్టి పదమూడేళ్లు అయిన సందర్భంగా చిత్ర యూనిట్ ఆమెకు శుభాకాంక్షలు అందజేసింది.
చిత్ర యూనిట్ ఘన స్వాగతానికి సమంత ఆనందంలో మునిగిపోయింది. థాంక్యూ ఫర్ ఎవ్రీథింగ్ అంటూ దర్శకుడితో పాటు చిత్ర యూనిట్‌కు కృతజ్ఞతలు చెప్పింది. ఈ సినిమా తాజా షెడ్యూల్ హైదరాబాద్‌లో జరుగుతోన్నట్లు సమాచారం. ప్రస్తుతం విజయ్ దేవరకొండ, సమంతలపై కొన్ని కీలక సన్నివేశాలతో పాటు యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరిస్తోన్నట్లు తెలిసింది.
ఖుషి సినిమా లాంగ్ షెడ్యూల్ గత ఏడాది కశ్మీర్‌లో జరిగింది. ఆ తర్వాత సమంత మయోసైటిస్ బారిన పడటంతో షూటింగ్‌కు చాలా రోజుల పాటు బ్రేక్ ఇచ్చారు. దాదాపు ఆరేడు నెలల తర్వాత షూటింగ్ మొదలుకావడంతో విజయ్‌తో పాటు సమంత అభిమానుల్లో ఆనందం వ్యక్తమవుతోంది.
కశ్మీర్ బ్యాక్‌డ్రాప్‌లో లవ్‌స్టోరీతో ఈ సినిమా తెరకెక్కుతోంది. మహానటి తర్వాత విజయ్ దేవరకొండ సమంత నటిస్తోన్న సినిమా ఇది. మరోవైపు మజిలీ తర్వాత శివనిర్వాణ దర్శకత్వంలో సమంత నటిస్తోన్నసినిమా ఇది. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.