Salaar Release date: ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‍న్యూస్.. సలార్ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఇదే! షారుఖ్ సినిమాతో ఢీ
25 September 2023, 21:40 IST
- Salaar Release date: సలార్ పార్ట్ 1: సీజ్‍ఫైర్ సినిమా రిలీజ్ డేట్ ఖరారైనట్టు సమాచారం బయటికి వచ్చింది. ప్రముఖ ట్రేడ్ ఎనలిస్టులు ఈ విషయంపై నేడు ట్వీట్స్ చేస్తున్నారు. వివరాలివే..
Salaar vs Dunki: సలార్ మూవీ కొత్త రిలీజ్ డేట్ ఇదే! షారుఖ్ మూవీతో ఢీ
Salaar Release date: పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన సలార్ మూవీ కోసం సినీ ప్రేక్షకులందరూ వేయికళ్లతో ఎదురుచూస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. సెప్టెంబర్ 28వ తేదీన రిలీజ్ కావాల్సిన ‘సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్’ చిత్రం వాయిదా పడింది. ఈ ప్రభావంతో చాలా సినిమాల రిలీజ్ డేట్లు కూడా మారాయి. ఒక్కసారిగా కుదుపు వచ్చింది. సలార్‌ను వాయిదా వేస్తున్నట్టు ప్రకటించిన చిత్రయూనిట్.. మరో రిలీజ్ డేట్‍ను వెల్లడించలేదు. అయితే, తాజాగా ‘సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్’ రిలీజ్‍కు కొత్త డేట్ ఫిక్స్ అయిందని సమాచారం బయటికి వచ్చింది. ఆ వివరాలు ఇవే.
‘సలార్: పార్ట్ 1 - సీజ్‍ఫైర్’ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 22వ తేదీన రిలీజ్ అవుతుందనే సమాచారం బయటికి వచ్చింది. బాలీవుడ్ ట్రేడ్ అనలిస్ట్ తరణ్ ఆదర్శ్ ఈ విషయంపై ట్వీట్ చేశారు. సలార్ ఎగ్జిబిటర్లకు ఈ కొత్త రిలీజ్ డేట్‍కు సంబంధించి మెయిల్స్ కూడా వెళ్లాయని ఆయన పేర్కొన్నారు. డిసెంబర్ 22న సలార్ రిలీజ్ అవుతుందని తెలిపారు. ఈ విషయంపై సెప్టెంబర్ 29న హొంబాలే ఫిల్మ్స్ అధికారిక ప్రకటన చేస్తుందని తెలిపారు. షారుఖ్ వర్సెస్ ప్రభాస్ తప్పేలా లేదని పేర్కొన్నారు.
క్రిస్మస్ వీకెండ్ అయిన డిసెంబర్ 22న సలార్ థియేటర్లలో విడుదవుతుందని తరుణ్ ఆదర్శ్ పేర్కొన్నారు. బాలీవుడ్ బాద్‍షా షారుఖ్ ఖాన్ నటించిన డుంకీ చిత్రం కూడా అదే రోజున రిలీజ్ కానుంది. దీంతో సలార్ వర్సెస్ డుంకీ, ఎస్‍ఆర్‌కే వర్సెస్ ప్రభాస్ ఉంటుందని ట్వీట్ చేశారు.
ఒకవేళ సలార్ చిత్రం డిసెంబర్ 22న రిలీజ్ అవడం ఫైనల్ అయితే.. మరి డుంకీ చిత్రం వాయిదా పడుతుందో.. లేకపోతే అదే రోజు వచ్చి ఢీకొంటుందో అనేది ఆసక్తికరంగా మారనుంది.
హొంబాలే ఫిల్మ్స్ నిర్మించిన కేజీఎఫ్ పార్ట్-1.. 2018లో షారుఖ్ 'జీరో' మూవీతో పోటీ పడింది. ఇప్పుడు కూడా క్రిస్మస్‍కే హొంబాలే ప్రొడ్యూజ్ చేసిన సలార్ మూవీ షారుఖ్ డుంకీకి పోటీగా వచ్చేలా కనిపిస్తోంది.
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఫుల్ హైవోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా సలార్ రూపొందింది. ఇప్పటికే వచ్చిన టీజర్‌తో అంచనాలు భారీగా పెరిగాయి. ఈ చిత్రంలో ప్రభాస్ లుక్, యాక్షన్ అదిరిపోయాయి. చాలా కలెక్షన్ల రికార్డులను సలార్ బద్దలు కొడుతుందనే అంచనాలు ఉన్నాయి.
సలార్ మూవీలో ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్‍గా నటించగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్ పాత్ర పోషించారు. హొంబాలే ఫిల్మ్స్ నిర్మించిన ఈ మూవీకి రవి బస్సూర్ సంగీతం అందించారు. తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో సలార్ విడుదల కానుంది. ఇంగ్లిష్ వెర్షన్ కూడా విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావిస్తోంది.