Salaar Day 2 Collection: సలార్ 2 రోజుల కలెక్షన్ల అంచనా.. అడ్వాన్స్ బుకింగ్స్‌తోనే వసూళ్ల తుఫాన్.. షారుక్‌కు షాక్
23 December 2023, 11:39 IST
Salaar 2 Days Collection Prediction: ప్రభాస్ సలార్ డే 2 కలెక్షన్స్ కోట్లల్లో కొల్లగొట్టనున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. మొదటి రోజు దేశవ్యాప్తంగా రూ. 95 కోట్లు కలెక్ట్ చేసిన సలార్ రెండో రోజు మరింత పుంజుకునే అవకాశం కనిపిస్తోంది.
సలార్ 2 రోజుల కలెక్షన్ల అంచనా.. డ్వాన్స్ బుకింగ్స్‌తోనే వసూళ్ల తుఫాన్.. షారుక్‌కు షాక్
మొదటి రోజు కలెక్షన్స్
రూ. 95 కోట్లల్లో తెలుగు నుంచి రూ. 69.5 కోట్లు, హిందీ నుంచి రూ. 17 కోట్లు, మలయాళంలో రూ. 3.5 కోట్లు, తమిళం నుంచి రూ. 4 కోట్లు వసూళు అయినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. మొదటి రోజు సాలిడ్ కలెక్షన్స్‌తో మొదలుపెట్టిన సలార్ మూవీ రెండో రోజు కూడా అదే కొనసాగించనుందని తెలుస్తోంది.
సలార్ అడ్వాన్స్ బుకింగ్స్
ప్రముఖ వెబ్సైట్ లెక్కల ప్రకారం ప్రభాస్ సలార్ సీజ్ఫైర్ మూవీ రెండో రోజు సుమారుగా రూ. 20 కోట్లు (రూ. 19.7 కోట్లు) వసూళు చేసే అవకాశం ఉందని సమాచారం. అంటే రెండో రోజు బుక్ అయిన అడ్వాన్స్ బుకింగ్స్ లెక్కల ప్రకారం రూ. 20 కోట్లుగా అంచనా వేశారు. వీటిలో తెలుగు వెర్షన్ దాదాపు రూ. 14 కోట్ల వరకు వసూలు చేస్తుందని చెబుతున్నారు.
థియేటర్ ఆక్యుపెన్సీ
సుమారు రూ. 3 కోట్ల వసూళ్లతో హిందీలోనూ సలార్ మార్కెట్ బలంగా ఉందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. అలాగే మలాయళంలో రూ. 89 లక్షల వరకు రాబట్టగలదని అంచనా వేశారు. 2డి తెలుగు వెర్షన్ లో 64 శాతం, ఐమాక్స్ 2డి హిందీ వెర్షన్ లో 56 శాతం ఆక్యుపెన్సీ నమోదు అయినట్లు సమాచారం.
హిందీలో కూడా
శనివారం అడ్వాన్స్ బుకింగ్స్ ముఖ్యంగా ప్రభాస్ సొంత గడ్డపైనే కాకుండా కీలకమైన హిందీ హబ్‌లలో కూడా ఈ యాక్షన్ ప్యాక్డ్ మూవీ సలార్‌కి మరో రికార్డ్ బ్రేకింగ్ రోజును సూచిస్తున్నాయి. కాబట్టి, సలార్ సినిమా తుఫాను తగ్గే సూచనలు ఏమాత్రం కనిపించడం లేదుని టాక్. ఇక రెండు రోజుల్లో సలార్‌కు వచ్చే కలెక్షన్స్ చూస్తే సుమారు రూ. 115 కోట్లుగా ఉండనుందని తెలుస్తోంది.
డంకీకి షాక్
అయితే, సలార్ కంటే ఒకరోజు ముందు విడుదలైన షారుక్ ఖాన్ డంకీ సినిమాకు రెండు రోజుల్లో రూ. 50 కోట్ల కలెక్షన్స్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో పోలిస్తే సలార్‌కు రెట్టింపు కలెక్షన్స్ వచ్చాయి. అంటే సలార్ దెబ్బకు షారుక్ ఖాన్ డంకీ వసూళ్లకు గండిపడినట్లు తెలుస్తోంది.
టాపిక్