Salaar OTT: ప్రభాస్ సలార్ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఫిక్స్.. దిమ్మతిరిగే ధరకు హక్కులు.. కానీ, అదొక్కటే మైనస్!
Salaar OTT Release: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ క్రేజీయెస్ట్ మూవీగా తెరకెక్కింది సలార్. ఎంతగానో ఎదురు చూస్తున్న ఫ్యాన్స్ కోసం ఎట్టకేలకు డిసెంబర్ 22న సలార్ విడుదలైంది. ఈ నేపథ్యంలో సలార్ ఓటీటీ రైట్స్, రిలీజ్ డేట్ ఆసక్తికరంగా మారింది.
Prabhas Salaar OTT Streaming: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‍కు ఎంత క్రేజ్ ఉందో తెలిసిందే. బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సంపాదించుకున్నాడు. ఇక డార్లింగ్ సినిమాల కోసం ఫ్యాన్స్, తెలుగు ప్రేక్షకులే కాదు.. బాక్సాఫీస్ కూడా ఎదురుచూస్తుంటుంది. అలాంటి ప్రభాస్ నటించిన సినిమాల్లో సలార్ ఒకటి. ది మోస్ట్ క్రేజీయెస్ట్ చిత్రంగా సలార్ ఉండనుంది.
కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రభాస్ క్రేజీయెస్ట్ మూవీ సలార్. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ (Salaar: Part 1 Ceasefire) మూవీ భారీ అంచనాల నడుమ డిసెంబర్ 22న అంటే శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అర్ధరాత్రి నుంచే నైజాం ఏరియాలోని 20 థియేటర్లలో బెనిఫిట్ షోలు పడ్డాయి.
సలార్ మూవీకి అదిరిపోయే టాక్ వస్తోంది. సలార్‌తో బాక్సాఫీస్ రికార్డ్స్ అన్ని షేక్ అవుతాయని ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెడుతున్నారు. టాలీవుడ్ హీరోలు సైతం సలార్ మూవీ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. హీరో నితిన్, శ్రీవిష్ణు థియేటర్‌లో సలార్ ఎంజాయ్ చేస్తున్న వీడియోలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.
ఇదిలా ఉంటే సలార్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫామ్ వివరాలు హాట్ టాపిక్ అవుతున్నాయి. సలార్ మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. మొత్తంగా రూ. 160 కోట్ల భారీ ధర వెచ్చించి సలార్ ఓటీటీ స్ట్రీమింగ్ రైట్స్ నెట్‌ఫ్లిక్స్ కొనుక్కుందని తెలుస్తోంది.
అయితే, సలార్ ఓటీటీ రిలీజ్ డేట్‌పై క్లారిటీ రావాల్సి ఉంది. ఎలాంటి సినిమాను అయినా థియేటర్ రిలీజ్ తర్వాత నెల రోజులకు ఓటీటీలో ప్రదర్శిస్తారు. కొన్నిసార్లు ఆడియెన్స్ రెస్పాన్స్, కలెక్షన్స్ దృష్టిలో ఉంచుకుని రిలీజ్ చేస్తారు. కానీ, ఇదంతా సలార్ విషయంలో వేరేగా ఉండనుంది. సలార్ సినిమాను నెల రోజులు దాటిన తర్వాత కూడా ఓటీటీ స్ట్రీమింగ్ చేసే అవకాశం లేదని తెలుస్తోంది. ఇప్పట్లో సలార్ ఓటీటీ రిలీజ్ ఉందని అంచనా.