HCU Recruitment: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్, 42 బ్యాక్‌లాగ్ టీచింగ్ పోస్టుల భర్తీ
HCU Recruitment: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన భారత పౌరులతో పాటు విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు కూడా ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
HCU Recruitment: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో స్పెషల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌కు నోటిఫికేషన్ విడుదలైంది. సైన్స్ అండ్ హ్యూమానిటీస్ విభాగాల్లో బ్యాక్‌లాగ్ రిజర్వ్‌డ్ ఉద్యోగాల భర్తీ చేపట్టనున్నారు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, వికలాంగ పోస్టుల్ని భర్తీ చేస్తారు. మొత్తం 42 పోస్టుల్ని తాజా నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తారు.
ముఖ్యమైన తేదీలు
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్యోగాల భర్తీ నోటిఫికేషన్ నవంబర్ 8వ తేదీన విడుదలైంది.ఈ లింకు ద్వారా నోటిఫికేషన్, ఇతర వివరాలను తెలుసుకోవచ్చు.
https://uohyd.ac.in/ కెరీర్స్‌లో తాజా నోటిఫికేషన్ అందుబాటులో ఉంటుంది.
అభ్యర్థులు ఉద్యోగాలను దరఖాస్తు చేసుకోడానికి ఈ లింకును అనుసరించండి. డిసెంబర్ 9వ తేదీలోకా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది.
Link for online application: https://curec.samarth.ac.in
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా...
అభ్యర్థులు ఆన్‌లైన్ దరఖాస్తులతో పాటు కావాల్సిన పత్రాలను పోస్టులో పంపాల్సి ఉంటుంది. డిసెంబర్ 12లోగా అసిస్టెంట్ రిజిస్ట్రార్, రిక్రూట్‌మెంట్ సెల్, రూమ్ నంబర్ 221, ఫస్ట్ ఫ్లోర్, అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్, సెంట్రల్ యూనివర్శిటీ, గచ్చిబౌలి, తెలంగాణ, హైదరాబాద్ 500046 పేరిట నకళ్లతో సహాపంపాలి.
ఖాళీల వివరాలు...
హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో భర్తీ చేసే ఉద్యోగాల్లో మ్యాథ్స్ విభాగంలో అకడమిక్ లెవల్ 14విభాగంలో మ్యాథ్స్ ప్రొఫెసర్ పోస్టు 1(ఎస్సీ), అసోసియేట్ ప్రొఫెసర్ ఎస్సీ 1, ఎస్టీ1, స్కూల్ ఆఫ్ కంప్యూటర్ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్సెస్‌లో ప్రొఫెసర్ పోస్టు 1 (ఓబీసీ), ఫిజిక్స్‌లో ప్రొఫెసర్ పోస్టులు 3, ఓబీసీ1, ఎస్టీ1, పిహెచ్ 1 ఉన్నాయి. అసోసియేట్ ప్రొఫెసర్ 1(ఓబీసీలు ఉన్నాయి.
కెమిస్ట్రీ ప్రొఫెసర్ పోస్టు 1(ఓబీసీ), అసిస్టెంట్ ప్రొఫెసర్ 1, ప్లాంట్ సైన్సెస్ ఓబీసీ 1, ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్1 పిడబ్లూ ,
మెడికల్ సైన్స్ ప్రొఫెసర్ 1, హెల్త్ సైకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ 1 (ఎస్టీ) ఉద్యోగాలు భర్తీ చేస్తారు.
హ్యుమానిటీస్‌లో ఇంగ్లీష్ ప్రొఫెసర్ పోస్టులు 2 (ఎస్సీ1, ఎస్టీ1, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 3 ఉన్నాయి. ఫిలాసఫీలో అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 2, ఉర్దూలో ప్రొఫెసర్ పోస్టు 1, దివ్యాంగులకు 1 ఉన్నాయి.
అప్లైడ్ లింగ్వస్టిక్స్ అండ్ ట్రాన్స్‌లేషన్‌లో ప్రొఫెసర్ 1 (ఓబీసీ) ఉన్నాయి. సంస్కృతం ప్రొఫెసర్ 1 ఎస్సీ, అసోసియేట్ ప్రొఫెసర్ 1 ఎస్సీఖాళీలు ఉన్నాయి. ఇంగ్లీష్ లాంగ్వేజ్ స్టడీస్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ 1 ఓబీసీ ఖాళీ ఉంది. ఎకనామిక్స్‌లో ప్రొఫెసర్ పోస్టు1, అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగాలు 2 ఉన్నాయి.
సోషల్ స్టడీస్‌లో హిస్టరీ ప్రొఫెసర్ 1, అసోసియేట్ ప్రొఫెసర్ 1 ఉన్నాయి. పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్ ఖాళీలు మూడు ఉన్నాయి. ఆంత్రోపాలజీలో ప్రొఫెసర్ 1 ఎస్సీ ఖాళీని భర్తీ చేస్తారు. మేనేజ్మెంట్ స్టడీస్‌లో ప్రొఫెసర్ 1ఎస్టీ, అసోసియేట్ ప్రొఫెసర్ 1 పోస్టును భర్తీ చేస్తారు.
ఆర్ట్స్‌లో థియేటర్ ఆర్ట్స్, డాన్స్, మ్యూజిక్ పోస్టులను భర్తీ చేస్తారు. మొత్తం ప్రొఫెసర్ పోస్టులు 20, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు 21, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు 1 ఉన్నాయి.
హెచ్‌సియూలో బ్యాక్‌లాగ్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన వయోపరిమితి, ఇతర నియమనిబంధనలు, అర్హతలు, విద్యార్హతలు, రిజర్వేషన్ల వివరాల కోసం నోటిఫికేషన్ చూడండి. https://uohyd.ac.in/teaching-guest-faculty/