Crime news : 7 నెలల గర్భవతి అని కూడా చూడలేదు! చంపేసి, శరీరాన్ని 25 ముక్కలు నరికి..-pregnant pak woman killed chopped into 25 pieces by in laws alleges father ,జాతీయ - అంతర్జాతీయ న్యూస్
తెలుగు న్యూస్  /  జాతీయ - అంతర్జాతీయ  /  Crime News : 7 నెలల గర్భవతి అని కూడా చూడలేదు! చంపేసి, శరీరాన్ని 25 ముక్కలు నరికి..

Crime news : 7 నెలల గర్భవతి అని కూడా చూడలేదు! చంపేసి, శరీరాన్ని 25 ముక్కలు నరికి..

Sharath Chitturi HT Telugu
Nov 18, 2024 06:40 AM IST

Pregnant woman killed : పాకిస్థాన్​లో ఓ 7 నెలల గర్భవతి దారుణ హత్యకు గురైంది! ఆమె అత్త, మరదలు కలిసి బాధితురాలిని చంపేశారు. అనంతరం శరీరాన్ని 25 ముక్కలు చేసి వేరువేరు కాల్వల్లో పడేశారు.

మహిళను చంపేసి, శరీరాన్ని 25 ముక్కలు నరికి..
మహిళను చంపేసి, శరీరాన్ని 25 ముక్కలు నరికి..

పాకిస్థాన్​లో అత్యంత దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది! ఓ మహిళను ఆమె భర్త కుటుంబసభ్యులు చిత్రహింసలకు గురిచేసి చంపేసినట్టు సమాచారం! అనంతరం ఆమె శరీరాన్ని 25 ముక్కలుగా నరికారని తెలుస్తోంది. ఆ సమయంలో మృతురాలు 7నెలల గర్భవతి.

ఇదీ జరిగింది..

వ్యక్తిగత కలహాల నేపథ్యంలో తన కుమార్తెను, ఆమె భర్త కుటుంబసభ్యులు హత్య చేసి 25 ముక్కలుగా నరికి చంపారని బాధితురాలి తండ్రి వెల్లడించారు. ఘటన సమయంలో తన బిడ్డ ఏడు నెలల గర్భిణి అని వివరించారు.

తన కుమార్తె అత్తమామలు నేరాన్ని అంగీకరించారని, ప్రస్తుతం వారు పోలీసుల అదుపులో ఉన్నారని బాధితురాలి తండ్రి షబ్బీర్ అహ్మద్ తెలిపారు.

పాకిస్థాన్ పంజాబ్​లో దస్కాలోని కోట్లి మర్లాన్ అనే గ్రామంలో జరిగింది దారుణ హత్య. ఈ కేసులో మృతురాలి అత్త సుగ్రా బీబీ, మరదలు యాస్మీన్, మనవడు అబ్దుల్లాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులపై ఇతర అభియోగాలపై కేసు నమోదు చేసినట్లు సమాచారం.

"నా కుమార్తెను దిండుతో గొంతు నులిమి చంపారు. పదునైన కత్తి, మాంసం కత్తితో ఆమె శరీరాన్ని 25 ముక్కలుగా నరికారు," అని బాధితురాలి తండ్రి వెల్లడించారు. ఆయనొక పోలీస్​ ఇన్​స్పెక్టర్​!

శరీర భాగాలను వేరువేరు సంచుల్లో ప్యాక్ చేసి మురుగు కాల్వల్లో పడేశారని ఇన్​స్పెక్టర్ షబ్బీర్ అహ్మద్ తెలిపారు.

మృతురాలి పేరు జహ్రా ఖదీర్. ఆమె అత్త, మరదలు ఆమెను హత్య చేశారని పోలీసులు తెలిపారు.

అత్త సుగ్రా బీబీ తన కుమార్తె యాస్మీన్​తో కలిసి జెహ్రా (26)ను హత్య చేసి శవాన్ని ముక్కలు ముక్కలుగా చేసి సంచుల్లో ప్యాక్ చేసి కాలువలో పడేసింది. మృతదేహాన్ని గుర్తించకుండా ఉండేందుకు మృతురాలి అత్త, ఆమె అవయవాలను కోసి, తలను నరికేసింది. నేరాన్ని కప్పిపుచ్చుకునేందుకు జెహ్రా ఎవరితోనో పారిపోయినట్లు కుటుంబ సభ్యులు పుకార్లు వ్యాపింపజేశారు.

గుర్జన్ వాలా గ్రామం కోట్ మాండ్​కు చెందిన జెహ్రాకు 2020లో కోట్లి మర్లాన్​కు చెందిన ఖదీర్​తో వివాహమైంది. విదేశాల్లో పనిచేస్తున్న ఖదీర్​ను ఈ విషయంపై పోలీసులు ఇంకా సంప్రదించలేకపోయారు.

సూట్​ కేసులో మహిళ మృతదేహం..

ఇటు ఇండియాలోనూ నేరాలు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నాయి. మరీ ముఖ్యంగా మహిళలపై క్రైమ్స్​ వార్తలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ఉత్తర ప్రదేశ్​లోని హపూర్ జిల్లాలోని దిల్లీ-లక్నో హైవే సమీపంలోని సర్వీస్ రోడ్డు పక్కన ఒక ఎర్రటి సూట్ కేసును స్థానికులు గుర్తించారు. అందులో ఒక మహిళ మృతదేహం కుక్కి ఉండడం గమనించి, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సూట్ కేస్​ను తెరిచి చూడగా శరీరమంతా గాయాలున్న ఒక మహిళ మృతదేహం వారికి కనిపించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Whats_app_banner

సంబంధిత కథనం