Gold and Silver prices today : గుడ్​ న్యూస్​! మరింత పడిన పసిడి ధరలు- వెండి రేటు ఎంతంటే..-gold and silver prices today 18th november 2024 hyderabad ,బిజినెస్ న్యూస్
తెలుగు న్యూస్  /  బిజినెస్  /  Gold And Silver Prices Today : గుడ్​ న్యూస్​! మరింత పడిన పసిడి ధరలు- వెండి రేటు ఎంతంటే..

Gold and Silver prices today : గుడ్​ న్యూస్​! మరింత పడిన పసిడి ధరలు- వెండి రేటు ఎంతంటే..

Sharath Chitturi HT Telugu

Gold and Silver prices today : దేశంలో బంగారం ధరలు పడ్డాయి. వెండి ధరలు సైతం దిగొచ్చాయి. మీ నగరాల్లో నేటి పసిడి, వెండి ధరల వివరాలను ఇక్కడ తెలుసుకోండి..

నేటి పసిడి, వెండి ధరలు ఇలా..

దేశంలో బంగారం ధరలు సోమవారం స్వల్పంగా తగ్గాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 10 దిగొచ్చి.. రూ. 69,340కి చేరింది. ఆదివారం ఈ ధర రూ. 69,350గా ఉంది. ఇక 100 గ్రాముల(22క్యారెట్లు) బంగారం ధర రూ. 100 తగ్గి.. రూ. 6,93,400గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ప్రస్తుతం 6,934గా ఉంది.

మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర సైతం రూ. 10 దిగొచ్చి.. రూ. 75,640గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 75,650గా ఉండేది. అదే సమయంలో 100 గ్రాముల(24క్యారెట్లు) పసిడి ధర రూ. 100 దిగొచ్చి రూ. 7,56,400గా ఉంది. 1 గ్రామ్​ గోల్డ్​ ధర రూ. 7,564గా ఉంది.

ఇక దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు సోమవారం తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 69,490గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 75,790గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 69,340 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 75,640గా ఉంది. ముంబై, పుణె, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి.

కాగా.. చెన్నైలో 22క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 69,340గాను, 24 క్యారెట్ల పసిడి ధర రూ. 75,640గా ఉంది. ఇక బెంగళూరులో 22 క్యారెట్ల గోల్డ్​ రూ. 69,340గాను.. 24 క్యారెట్ల పసిడి రూ. 75,640గాను ఉంది.

Gold rate today Hyderabad : హైదరాబాద్​లో ప్రస్తుతం 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 69,340గా ఉంది. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 75,640గా నమోదైంది. విజయవాడలో సైతం ఈ రేట్లే కొనసాగుతున్నాయి. విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి.

అహ్మదాబాద్​లో.. 22 క్యారెట్ల గోల్డ్​ ధర రూ. 69,390గా.. 24 క్యారెట్ల పసిడ ధర రూ. 75,690గా కొనసాగుతోంది. భువనేశ్వర్​లో 22 క్యారెట్ల బంగారం రేటు రూ. 69,340గా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 75,640గా ఉంది.

ఫెడ్​ వడ్డీ రేట్ల కోత వంటి అంశాలు పసిడి ధరల్లో హెచ్చుతగ్గులకు కారణమవుతున్నాయని నిపుణులు చెబుతున్నారు.

వెండి కూడా..

Silver price in Hyderabad : దేశంలో వెండి ధరలు సోమవారం స్వల్పంగా పడ్డాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 8,940గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ. 89,400గా కొనసాగుతోంది. ఆదివారం ఈ ధర రూ. 89,500గా ఉండేది.

కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 98,900 పలుకుతోంది. వెండి ధరలు కోల్​కతాలో రూ.​ 89,400.. బెంగళూరులో రూ. 89,400గా ఉంది.

ప్లాటీనం ధరలు ఇలా..

దేశంలో ప్లాటీనం రేట్లు స్థిరంగా ఉన్నాయి. 10 గ్రాముల ప్లాటీనం ధర రూ. 25,430గా ఉంది. క్రితం రోజు కూడా ఇదే ధర పలికింది.

ఇక హైదరాబాద్​లో ప్లాటీనం ధర(10గ్రాములు) రూ. 25,430గా ఉంది. విజయవాడ, విశాఖపట్నం, బెంగళూరు, ముంబై తదితర నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి.

(గమనిక: ఈ లెక్కల్లో జీఎస్​టీ, టీసీఎస్​, ఇతర పన్నులను పరిగణలోకి తీసుకోలేదు.)

సంబంధిత కథనం