Bigg Boss Nominations: ఎలిమినేషన్ నుంచి బయటపడ్డ అవినాష్ - మందేస్తానన్న యష్మి - నిఖిల్‌పై సోనియా రివేంజ్!
Bigg Boss Nominations: ఈ వీక్ బిగ్‌బాస్ ఎలిమినేషన్ లేకుండా ముగిసింది. నామినేషన్స్ చివరలో టేస్టీ తేజ, అవినాష్ నిలిచారు. అవినాష్ ఎలిమినేట్ అయినట్లు బిగ్‌బాస్ ప్రకటించాడు. తన దగ్గర ఉ న్న ఎవిక్షన్ ఫ్రీ పాస్‌తో అవినాష్ ఎలిమినేట్ కాకుండా నబీల్ కాపాడాడు.
Bigg Boss Nominations: ఈ వీక్ బిగ్‌బాస్ తెలుగు ఎలిమినేషన్ లేకుండానే ముగిసింది. ఈ వీక్ ఎలిమినేట్ అయిన అవినాష్‌ను ఎవిక్షన్ షీల్డ్ పాస్ ద్వారా నబీల్ కాపాడాడు. నామినేషన్స్ చివరలో టేస్టీ తేజ, అవినాష్ నిలవడంతో ఇద్దరిలో ఒకరు ఎలిమినేట్ అవుతారని నాగార్జున ప్రకటించాడు. ఇందులో టేస్టీ తేజ సేవ్ అవ్వగా...అవినాష్ ఎలిమినేట్ అవుతోన్నట్లు బిగ్‌బాస్ చెప్పాడు.
తాను ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలవడానికి అవినాష్ కారణమని, అతడి కోసం ఈ పాస్ వాడుతానని నబీల్ అన్నాడు. అన్నట్లుగా అతడిని హౌజ్ నుంచి బయటకు వెళ్లిపోకుండా కాపాడాడు. బిగ్‌బాస్ నాలుగో సీజన్‌లో కూడా ఎవిక్షన్ ఫ్రీ పాస్ ద్వారా తాను ఎలిమినేషన్ నుంచి బయటపడిన సంగతిని అవినాష్ గుర్తుచేసుకున్నాడు.
ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు గెస్ట్‌లు...
అంతకుముందు బిగ్‌బాస్ సండే ఎపిసోడ్‌లో కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ సందడి చేశారు. వారితో పాటు బిగ్‌బాస్ మాజీ హౌజ్‌మేట్స్ అయిన, వీజే సన్నీ, శ్రీసత్య, అమర్‌దీప్ తో పాటు రైటర్ కోన వెంకట్ కూడా సండే ఎపిసోడ్‌కు గెస్టులుగా వచ్చారు.
మందేస్తానన్న యష్మి...
ముందుగా యష్మి కోసం శ్రీసత్య, సంయుక్త బిగ్‌బాస్‌లోకి వచ్చారు. యష్మికి సంబంధించిన ఓ సీక్రెట్‌ను బయటపెడితే మూడు లక్షలు ప్రైజ్‌మనీ పెంచుతానని నాగార్జున అన్నాడు. ప్రతిరోజు సాయంత్రం ఆరు తర్వాత యష్మి మందేస్తుందని శ్రీసత్య అన్నది. ఏక్ పెగ్‌లా అంటూ చిల్ అవుతుందని తెలిపింది. యష్మి మందు తాగుతానని ఒప్పుకుంది. బిగ్‌బాస్‌లో టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్‌గా గౌతమ్, నిఖిల్, నబీల్, అవినాష్, ప్రేరణ పేర్లు చెప్పింది శ్రీసత్య.
బిగ్‌బాస్ విన్నర్...
ఆ తర్వాత టేస్టీ తేజ కోసం అతడి తండ్రితో పాటు బిగ్‌బాస్ విన్నర్ వీజే సన్నీ స్టేజ్‌పైకి వచ్చారు. టేస్టీ తేజ బిగ్‌బాస్‌కు వస్తాడని, టాప్ ఫైవ్‌లో ఉంటాడని ఊహించలేదని టేస్టీ తేజ తండ్రి అన్నాడు. మిగిలిన వాళ్లను వదిలేసి నీ ఆట నువ్వు ఆడితే మంచిదని నిఖిల్‌కు వీజే సన్నీ సలహా ఇచ్చాడు. అతడితో పాటు అందరికి సలహాలు ఇచ్చాడు. వీ అచ్చి పై వాలితే ఎవరు పట్టించుకోవడం లేదని విష్ణుప్రియపై సెటైర్లువేశాడు. వీళ్లు టాప్ ఫైవ్‌లో గౌతమ్‌కు ఫస్ట్ ప్లేస్ ఇచ్చారు. ఆ తర్వాత నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్ ఉన్నట్లు వీజే సన్నీ చెప్పాడు
రైటర్ కోన వెంకట్...
ఆ తర్వాత అవినాష్ కోసం అతడి తమ్ముడితో పాటు రైటర్ కోన వెంకట్ స్టేజ్‌పైకి ఎంట్రీ ఇచ్చాడు. అవినాష్‌తో సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. కంటెస్టెంట్స్ కు తన సినిమా టైటిల్స్‌ను ఇచ్చాడు. నిఖిల్‌కు బాద్‌షా, విష్ణుప్రియకు నిన్నుకోరి, యష్మికి రెడీ, గౌతమ్‌కు శివమణితో పాటు మరికొందరికి టైటిల్స్ ఇచ్చాడు. టాప్ ఫైవ్‌గా నబీల్, నిఖిల్, రోహిణి, విష్ణుప్రియ, గౌతమ్ టాప్ ఫైవ్‌గా అవినాష్ తమ్ముడు చెప్పాడు.
అమర్‌దీప్ చౌదరి...
ఆ తర్వాత నిఖిల్ కోసం అతడి తండ్రితో పాటు బిగ్‌బాస్ రన్నరప్ అమర్‌దీప్ చౌదరి వచ్చాడు. నిఖిల్ ఫ్రెండ్‌షిప్‌కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తాడని తన జీవితంలో జరిగిన ఓ సంఘటనను చెప్పాడు. టాప్ ఫైవ్‌లో విష్ణుప్రియకు టాప్ ప్లేస్ ఇచ్చాడు అమర్‌దీప్. నబీల్, రోహిణి, గౌతమ్, తేజ పేర్లు చెప్పాడు.
సోమవారం నామినేషన్స్ ఎపిసోడ్‌లో ఈ బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయిన మణికంఠ, సోనియా, శేఖర్ బాషాతో మిగిలిన వాళ్లు అటెండ్ కాబోతున్నారు. ఎలిమినేట్ అయినా కంటెస్టెంట్స్...హౌజ్‌లో ఉన్న వారిని నామినేట్ చేయబోతున్నట్లు సమాచారం. ఒక్కొక్కరు ఇద్దరిని నామినేట్ చేస్తారని సమాచారం. ఇందులో నిఖిల్‌ను సోనియా నామినేట్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. నిఖిల్‌పై రివేంజ్ తీర్చుకోనున్నట్లు చెబుతోన్నారు.