Telangana News Live November 18, 2024: KTR : మణిపూర్ తరహాలో లగచర్ల ఘటన, గిరిజనులపై రేవంత్ సర్కార్ దమనకాండ- దిల్లీలో కేటీఆర్ విమర్శలు
తెలంగాణ లైవ్ న్యూస్ అప్‌డేట్స్, తాజా వార్తలు, బ్రేకింగ్ న్యూస్, పొలిటికల్ స్టోరీలు, క్రైమ్ న్యూస్, ప్రభుత్వ స్కీములు, ఇంకా మరెన్నో వార్తలు విశేషాలతో ఎప్పటికప్పుడు ఇక్కడ లైవ్ బ్లాగులో చూడొచ్చు.
Mon, 18 Nov 202404:56 PM IST
KTR : మణిపూర్ హింసాకాండ తరహాలో తెలంగాణలోని లగచర్లలో గిరిజనులపై అధికార కాంగ్రెస్, పోలీసులు దమనకాండకు పాల్పడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. గిరిజన మహిళలపై దాడుల గురించి ప్రధాని మోదీ, రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడడంలేదని ప్రశ్నించారు.
Mon, 18 Nov 202402:01 PM IST
Warangal : వరంగల్ ను రాష్ట్ర రెండో రాజధానిగా అభివృద్ధి చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అడుగులు వేస్తుంది. కుడా మాస్టర్ ప్లాన్ కు ఆమోదం, ఎయిర్ పోర్టు పునరుద్ధరణకు భూసేకరణతో పాటు పలు కీలక ప్రాజెక్టులకు బడ్జెట్ కేటాయించింది.
Mon, 18 Nov 202412:19 PM IST
- Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌పై హైదరాబాద్ పోలీసులకు ఎంఐఎం కార్యకర్త ఫిర్యాదు చేశారు. ఓల్డ్ సిటీ వాసులను అవమానించేలా పవన్ కళ్యాణ్ మాట్లాడారని కంప్లైంట్ చేశారు. దీనిపై హైదరాబాద్ పోలీసులు స్పందించారు. లీగల్ ఒపీనియన్ తీసుకుంటున్నాం అని స్పష్టం చేశారు.
Mon, 18 Nov 202411:53 AM IST
- Warangal : హైదరాబాద్ తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న వరంగల్‌ను.. రెండో రాజధానిగా డెవలప్ చేసేందుకు రేవంత్ సర్కారు అడుగులు వేస్తోంది. ఇప్పటికే కుడా మాస్టర్ ప్లాన్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కుకు భూములు ఇచ్చినవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది.
Mon, 18 Nov 202410:50 AM IST
- Medak Crime : మెదక్‌లో దారుణ హత్య జరిగింది. కూలీ డబ్బుల విషయంలో గొడవ జరిగింది. ఈ గొడవలో కూలి కోపంతో కర్రతో మేస్త్రి తలపై బలంగా కొట్టాడు. తలకు బలమైన గాయం కావడంతో మేస్త్రి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మెదక్ జిల్లా కాళ్లకల్ గ్రామంలో ఈ ఘటన జరిగింది.
Mon, 18 Nov 202408:52 AM IST
- Vemulawada : వేములవాడ.. దక్షిణ కాశీగా ఈ క్షేత్రానికి పేరుంది. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్‌ఘడ్ నుంచి భక్తులు వస్తుంటారు. కానీ.. భక్తులకు సరైన సౌకర్యాలు లేవు. ఈ నేపథ్యంలో.. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆలయ అభివృద్ధి భారీగా నిధులు మంజూరు చేసింది.
Mon, 18 Nov 202408:29 AM IST
- Apprentice Notification: కేంద్ర ప్రభుత్వ అటామిక్ ఎనర్జీ ఆధ్వర్యంలో నడిచే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్‌లో అప్రంటీస్‌లకు నోటిఫికేషన్ వెలువడింది. హైదరాబాద్‌లోని న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఐటీఐ పాస్ అయిన అభ్యర్థులకు అప్రంటీస్‌లో భాగస్వామ్యం కల్పిస్తారు.
Mon, 18 Nov 202408:03 AM IST
- Sangareddy : లగచర్ల లడాయి ఢీల్లీకి చేరింది. ఆ గ్రామస్తులు జాతీయ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేశారు. ఇటు సంగారెడ్డి జైల్లో ఉన్న నిందితులను బీజేపీ ఎంపీలు కలిశారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్, డీకే అరుణ కీలక వ్యాఖ్యలు చేశారు. లగచర్ల బాధితులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
Mon, 18 Nov 202407:23 AM IST
- TG Adulterated Ginger : కాసుల కోసం కక్కుర్తిపడి కొందరు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిత్యావసర వస్తువులను కల్తీ చేస్తున్నారు. ఏకంగా యాసిడ్ వినియోగిస్తున్నారు. తాజాగా.. యాసిడ్‌తో అల్లం పేస్ట్ తయారు చేసే ముఠాను పోలీసులు పట్టుకున్నారు. 8 మందిని అరెస్టు చేశారు.
Mon, 18 Nov 202405:52 AM IST
- Double Murders: రంగారెడ్డి జిల్లాలో జంట హత్యలు కలకలం రేపాయి. మాడ్గుల మండలం నగిల్లా గ్రామంలో ఆదివారం అర్థరాత్రి జరిగిన దాడి, ప్రతిదాడిలో ఇద్దరు మృతి చెందారు. పదేళ్ల క్రితం జరిగిన హత్యకు ప్రతీకారం తీర్చుకునే క్రమంలో ఈ హత్యలు జరిగినట్టు పోలీసులు భావిస్తున్నారు.
Mon, 18 Nov 202405:47 AM IST
- Adilabad : ఆదిలాబాద్ అడవుల్లో పెద్ద పులి సంచరిస్తోంది. ముఖ్యంగా ఉట్నూర్ ఫారెస్ట్‌లో పులి కదలికలను అధికారులు గుర్తించారు. ఆ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అటు కవ్వాల్ అడవుల్లోకి మగ పులి ప్రవేశించింది. ఆ ప్రాంత ప్రజలు కూడా అలర్ట్‌గా ఉండాలని ఫారెస్ట్ అధికారులు హెచ్చరించారు.
Mon, 18 Nov 202405:33 AM IST
- Korutla Missing: జగిత్యాల జిల్లా కోరుట్ల లో వివాహిత ముగ్గురు పిల్లల సహా అదృశ్యం అయింది. ఐదు రోజులైనా ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. ఆటో డ్రైవర్ పై అనుమానం వ్యక్తం చేస్తు పోలీసులకు పిర్యాదు చేయడంతో పోలీసులు విచారణ చేపట్టారు.
Mon, 18 Nov 202404:25 AM IST
- Warangal : ఎట్టకేలకు వరంగల్ మాస్టర్ ప్లాన్‌కు ఆమోదం లభించింది. దీంతో వరంగల్ అభివృద్ధి పరుగులు పెడుతుందని జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే.. అసలు మాస్టర్ ప్లాన్ అంటే ఏంటీ.. వరంగల్ మాస్టర్ ప్లాన్‌లో ఏముందనే చర్చ కూడా జరుగుతోంది. ఈ మాస్టర్ ప్లాన్‌లో ఏముందో ఓసారి చూద్దాం.
Mon, 18 Nov 202403:59 AM IST
- TG Samagra Kutumba Survey : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సమగ్ర కుటుంబ ఇంటింటి సర్వే.. విజయవంతంగా సాగుతోంది. ఈ సర్వేలో ములుగు జిల్లా టాప్‌లో ఉండగా.. హైదరాబాద్ లాస్ట్‌లో ఉంది. ఇప్పటివరకు 58 శాతం ఇంటింటి సర్వే పూర్తయ్యింది. దీనికి సంబంధించి 6 ముఖ్యాంశాలు ఇలా ఉన్నాయి.
Mon, 18 Nov 202401:58 AM IST
- Warangal Airport: రాష్ట్రంలో ప్రాచీన ఎయిర్ పోర్టుగా పేరున్న వరంగల్ లోని మామునూరు విమానాశ్రయ పునరుద్ధరణకు లైన్ క్లియర్ అయింది. దాదాపు 32 ఏళ్ల కిందట మామునూరు ఎయిర్ పోర్టు మూత పడగా.. ఇన్నాళ్లు దాని పునరుద్ధరణ అంశం కాగితాలకే పరిమితం అయింది. ఎయిర్ పోర్టు పునరుద్ధరణపై ప్రభుత్వం సీరియస్ ఫోకస్ పెట్టింది.
Mon, 18 Nov 202401:07 AM IST
- HCU Recruitment: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హులైన భారత పౌరులతో పాటు విదేశాల్లో స్థిరపడిన ప్రవాస భారతీయులు కూడా ఫ్యాకల్టీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
Mon, 18 Nov 202412:25 AM IST
- MIdManer Housing: మిడ్ మానేర్ నిర్వాసితులకు కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. దశాబ్ద కాలంగా నిర్వాసితులు ఎదురు చూస్తున్న కళను నెరవేర్చింది. మిడ్ మానేర్ నిర్వాసితులకు 4696 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తూ ఉత్తర్వుల జారీ చేసింది.