తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar Remuneration: సలార్ బడ్జెట్ 400 కోట్లు! ఒక్కొక్కరి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Salaar Remuneration: సలార్ బడ్జెట్ 400 కోట్లు! ఒక్కొక్కరి రెమ్యునరేషన్ ఎంతో తెలుసా?

Sanjiv Kumar HT Telugu

23 December 2023, 13:10 IST

google News
  • Salaar Actors Remuneration: ప్రభాస్ సలార్ మూవీ మొదటి పార్ట్ డిసెంబర్ 22న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో సలార్ బడ్జెట్ అండ్ ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, ప్రశాంత్ నీల్, శ్రుతి హాసన్, జగపతి బాబు రెమ్యునరేషన్ హాట్ టాపిక్ అవుతోంది.

సలార్ బడ్జెట్ 400 కోట్లు! ఒక్కొక్కరి రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
సలార్ బడ్జెట్ 400 కోట్లు! ఒక్కొక్కరి రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?

సలార్ బడ్జెట్ 400 కోట్లు! ఒక్కొక్కరి రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?

Prabhas Remuneration For Salaar: ఎట్టకేలకు ప్రభాస్ అభిమానులు ఎదురుచూసిన పండుగ రానే వచ్చింది. డిసెంబర్ 22న అంటే శుక్రవారం రోజున ఎంతగానో ఎదురుచూసిన సలార్ మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అత్యంత భారీ అంచనాలతో రిలీజైన సలార్ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ టాక్‌తో దూసుకుపోతోంది. అంతేకాకుండా బాక్సాఫీస్ వద్ద సలార్ కలెక్షన్ల తుఫాన్ సృష్టిస్తోంది.

హైదరబాద్ బిర్యానీ

కేజీఎఫ్ సిరీస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన సలార్ మూవీతో ప్రభాస్ ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ హిట్ కోసం ఆవురావురుమంటూ ఆకలితో ఎదురుచూసిన డార్లింగ్ అభిమానులకు హైదరాబాద్ బిర్యానీ లభించినట్లు అయింది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. హోంబళే ఫిల్మ్స్ నిర్మాణ సంస్థలో వచ్చిన సలార్ మూవీలో భారీ తారాగణమే నటించింది.

కీలక పాత్రలు

సలార్ సీజ్‌ఫైర్‌ మూవీలో ప్రభాస్‌తోపాటు మలయాళ పాపులర్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్, హీరోయిన్ శ్రుతిహాసన్, జగపతిబాబు, బాబీ సింహా, బ్రహ్మాజీ, ఈశ్వరీ రావు, మైమ్ గోపీ, యాంకర్ ఝాన్సీ తదితరులు నటించారు. వీరిలో కొందరి పారితోషికానికి సంబంధించిన వివరాలు హాట్ టాపిక్ అవుతున్నాయి.

ఎవరికీ ఎంత?

బాహుబలితో రెమ్యునరేషన్ పెంచేసిన ప్రభాస్ సలార్ కోసం రూ. 100 కోట్లతోపాటు మూవీ లాభాల్లో 10 శాతం షేర్ తీసుకుంటున్నట్లు సమాచారం. డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌కి సుమారు రూ. 50 కోట్లు మేకర్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అలాగే హీరోయిన్ శ్రుతి హాసన్‌కు రూ. 8 కోట్లు, పృథ్వీరాజ్ సుకుమారన్, జగపతి బాబుకు రూ. 4 కోట్లు రెమ్యునరేషన్ ఇచ్చినట్లు టాక్.

బడ్జెట్ అదేనా?

ఇక సలార్ మూవీ బడ్జెట్ దాదాపు రూ. 400 కోట్లకు చేరిందని ఓ టాక్ వినిపిస్తోంది. కానీ, గూగుల్ మాత్రం రూ. 270 కోట్లు అని చూపిస్తోంది. కాబట్టి, సలార్ బడ్జెట్ విషయంలో క్లారిటీ లేదు. అయితే సలార్ మూవీ నటీనటులకు ఇచ్చిన రెమ్యునరేషనే బడ్జెట్‌లో సగం వరకు ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.

తదుపరి వ్యాసం