తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar 5 Days Box Office Collections: ఐదో రోజు తగ్గిన సలార్ వసూళ్లు.. అయినా డంకీ కంటే రెట్టింపే

Salaar 5 Days Box Office Collections: ఐదో రోజు తగ్గిన సలార్ వసూళ్లు.. అయినా డంకీ కంటే రెట్టింపే

Hari Prasad S HT Telugu

27 December 2023, 7:37 IST

    • Salaar 5 Days Box Office Collections: సలార్ మూవీ ఐదో రోజు బాక్సాఫీస్ వసూళ్లు కాస్త తగ్గాయి. సోమవారం (డిసెంబర్ 25)తో లాంగ్ వీకెండ్ ముగియడంతో మంగళవారం (డిసెంబర్ 26) నుంచి ఈ సినిమాకు అసలు పరీక్ష మొదలైంది.
సలార్ మూవీ బాక్సాఫీస్ ఊచకోత
సలార్ మూవీ బాక్సాఫీస్ ఊచకోత

సలార్ మూవీ బాక్సాఫీస్ ఊచకోత

Salaar 5 Days Box Office Collections: ప్రభాస్ నటించిన సలార్ మూవీ తొలి మంగళవారం (డిసెంబర్ 26) పరీక్షను పాసైందనే చెప్పాలి. తొలి నాలుగు రోజులతో పోలిస్తే ఐదో రోజు వసూళ్లు తగ్గినా.. షారుక్ ఖాన్ డంకీతో పోలిస్తే భారీ వసూళ్లే సాధించింది. ఐదో రోజు ప్రభాస్ మూవీ ఇండియాలో అన్ని భాషల్లో కలిపి రూ.25.13 కోట్లు వసూలు చేసినట్లు sacnilk.com వెల్లడించింది.

ట్రెండింగ్ వార్తలు

TV Serial Actor Chandu: ఆమె వల్లే మేం విడిపోయాం.. ఆత్మహత్య చేసుకుంటాడనుకోలేదు: సీరియల్ నటుడు చందూ భార్య

OTT Movie: చైన్ బిజినెస్ మోసాలు.. ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసిన ఫ్యామిలీ ఎమోషన్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?

Laya: ఆ డైరెక్టర్ చంపుతానని బెదిరించాడు.. 18 ఏళ్లకు నిజం బయటపెట్టిన హీరోయిన్ లయ

Sunil: మ‌మ్ముట్టి సినిమాలో విల‌న్‌గా సునీల్ - ట‌ర్బోతో మ‌ల‌యాళంలోకి ఎంట్రీ - ఫ‌స్ట్ లుక్ రిలీజ్‌

దీంతో తొలి ఐదు రోజుల్లో ఇండియాలో సలార్ సాధించిన వసూళ్లు రూ.280 కోట్లకు చేరాయి. ఐదో రోజు సాధించిన రూ.25 కోట్ల వసూళ్లలో సగానికి పైగా తెలుగులోనే రావడం విశేషం. తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం సలార్ మూవీ రూ.13.19 కోట్లు వసూలు చేసింది. హిందీలో రూ.9.7 కోట్లు, తమిళంలో రూ.1.2 కోట్లు, మలయాళంలో రూ.0.72 కోట్లు, కన్నడలో రూ.0.32 కోట్లు రాబట్టింది.

ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే రూ.450 కోట్ల మార్క్ దాటి రూ.500 కోట్లకు చేరవవుతోంది. ఆరు లేదా ఏడో రోజుల్లో ఈ మార్క్ అందుకునే అవకాశాలు ఉన్నాయి. డంకీలాంటి మూవీ నుంచి హిందీ బెల్ట్ లో గట్టి పోటీ ఉన్నా కూడా సలార్ సత్తా చాటుతూనే ఉంది. డంకీ మంగళవారం (డిసెంబర్ 26) ఇండియాలో కేవలం రూ.10 కోట్లు వసూలు చేయగా.. సలార్ మాత్రం రూ.25 కోట్లు రాబట్టడం విశేషమే.

సలార్ కు తొలి రోజు నుంచే పాజిటివ్ టాక్ రావడం, అంతకుముందు రోజే రిలీజైన డంకీపై ప్రేక్షకులు పెదవి విరవడంతో కలెక్షన్లలో ప్రభాసే పైచేయి సాధించాడు. డంకీ మూవీ తొలి రోజులు కలిపి ఇండియాలో కేవలం రూ.140 కోట్లు మాత్రమే వసూలు చేసింది. సలార్ మాత్రం ఐదు రోజుల్లోనే అంతకు రెట్టింపు అంటే రూ.280 కోట్లు వసూలు చేస్తూ దూసుకెళ్తోంది.

2023లో హ్యాట్రిక్ రూ.1000 కోట్ల సినిమాలు అందిస్తాడనుకున్న షారుక్ కు తీవ్ర నిరాశే ఎదురైంది. హిందీ బెల్ట్ లోనూ చాలా చోట్ల థియేటర్లలో డంకీని తీసేసి సలార్ షోలు వేస్తున్నారు. దీంతో క్రమంగా డంకీ తెరమరుగవుతుండగా.. సలార్ స్పష్టమైన ఆధిపత్యం చెలాయిస్తోంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం