తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Salaar 10 Days Box Office Collections: స‌లార్ ప‌ది రోజుల బాక్సాఫీస్ క‌లెక్ష‌న్లు.. 500 కోట్లు దాటేసింది

Salaar 10 days Box Office Collections: స‌లార్ ప‌ది రోజుల బాక్సాఫీస్ క‌లెక్ష‌న్లు.. 500 కోట్లు దాటేసింది

Hari Prasad S HT Telugu

01 January 2024, 9:45 IST

google News
    • Salaar Box Office Collections: స‌లార్ మూవీ బాక్సాఫీస్ ద‌గ్గ‌ర త‌న దూకుడు కొన‌సాగిస్తూనే ఉంది. 10 రోజుల్లోనే ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.500 కోట్ల మార్క్ దాటేసింది.
ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.500 కోట్లు దాటిన స‌లార్ క‌లెక్ష‌న్లు
ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.500 కోట్లు దాటిన స‌లార్ క‌లెక్ష‌న్లు

ప్ర‌పంచ‌వ్యాప్తంగా రూ.500 కోట్లు దాటిన స‌లార్ క‌లెక్ష‌న్లు

Salaar Box Office Collections: ప్ర‌భాస్ న‌టించిన స‌లార్ మూవీ 2023ను ఘ‌నంగా ముగించింది. ప‌దో రోజైన ఆదివారం (డిసెంబ‌ర్ 31) ఈ సినిమా ఇండియాలో అన్ని భాష‌లు క‌లిపి రూ.14 నుంచి రూ.16 కోట్లు వ‌సూలు చేసింది. దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా మూవీ ప‌ది రోజుల్లో రూ.500 కోట్ల మార్క్ దాటింది.

ఇక స‌లార్ ఇండియా క‌లెక్ష‌న్లు రూ.345.91 కోట్లుగా ఉన్నాయి. ఇక తర్వాత ఇండియాలో రూ.400 కోట్ల క‌లెక్ష‌న్ల‌పై క‌న్నేసింది. సోమ‌వారం (జ‌న‌వరి 1) న్యూ ఇయ‌ర్ హాలీడే ఉండ‌టంతో క‌లెక్ష‌న్లు భారీగానే ఉండే అవ‌కాశాలు ఉన్నాయి. స‌లార్ తెలుగు వెర్ష‌న్‌లోనే అత్య‌ధికంగా వ‌సూలు చేసింది. ప‌ది రోజుల్లో ఈ ప్ర‌భాస్ మూవీ రూ.198.33 కోట్లు వ‌సూలు చేయ‌డం విశేషం.

స‌లార్ హిందీ వెర్ష‌న్‌కు 115.79 కోట్లు వచ్చాయి. హిందీ బెల్ట్‌లో షారుక్ ఖాన్ న‌టించిన డంకీ నుంచి స‌లార్‌కు గ‌ట్టి పోటీ ఎదురైంది. దీంతో అక్క‌డ క‌లెక్ష‌న్లు త‌గ్గాయి. ఒక‌వేళ పెద్ద సినిమాలేవీ పోటీలో లేకుండా ఇప్ప‌టికే స‌లార్ బాక్సాఫీస్ క‌లెక్ష‌న్లు మ‌రింత భారీగా ఉండేవి.

ప‌దో రోజు స‌లార్ మూవీకి హిందీ వెర్ష‌న్‌లో రూ.10 కోట్లు, తెలుగు వెర్ష‌న్‌లో 4.83 కోట్లు వ‌చ్చాయి. తెలుగు, హిందీ త‌ర్వాత త‌మిళంలో స‌లార్‌కు తొలి 10 రోజుల్లో రూ.1656 కోట్లు వ‌సూల‌య్యాయి. స‌లార్ కంటే ముందు హ్యాట్రిక్ ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మైన ప్ర‌భాస్‌కు ఈ సినిమా కొత్త ఊపిరిలూదింద‌నే చెప్పాలి.

గ‌తేడాది ఆదిపురుష్ కూడా రిలీజైనా ఆ మూవీ తీవ్రంగా నిరాశ‌ప‌రిచింది. స‌లార్ హిట్‌తో 2024లోకి ప్ర‌భాస్ మ‌రింత కాన్ఫిడెంట్‌గా అడుగుపెడుతున్నాడు. ఈ ఏడాది క‌ల్కి 2898 ఏడీ మూవీ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఇది కాకుండా అత‌డు స్పిరిట్‌, రాజా డీల‌క్స్‌లాంటి ఇత‌ర సినిమాల్లోనూ న‌టిస్తున్నాడు.

స‌లార్ ప‌క్కా ప్ర‌శాంత్ నీల్ మార్కు మూవీ. కేజీఎఫ్‌, కేజీఎఫ్ 2 స్టైల్‌లోనే క‌థ‌, క‌థ‌నాల కంటే హీరోయిజం, ఎలివేష‌న్స్‌పైనే ఎక్కువ‌గా ఫోక‌స్ పెట్టి ప్ర‌శాంత్ నీల్ స‌లార్ మూవీని తెర‌కెక్కించాడు. ప్ర‌తి సీన్‌లో ప్ర‌భాస్ హీరోయిజాన్ని నెక్స్ట్ లెవెల్‌లో చూపించాడు. ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ హీరోగా ప్ర‌భాస్‌ను సిల్వ‌ర్ స్క్రీన్‌పై అభిమానులు చూసి చాలా కాల‌మైంది. ఆ లోటును స‌లార్‌తో భ‌ర్తీ చేశాడు ప్ర‌శాంత్ నీల్‌. దేవాగా ప్ర‌భాస్ స్క్రీన్ ప్ర‌జెన్స్‌, హీరోయిజం ఫ్యాన్స్‌కు ఫీస్ట్‌లా ఉంటుంది.

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం