Salaar OTT Release date: థియేటర్లలో రిలీజైన నెలలోనే ఓటీటీలోకి ప్రభాస్ సలార్? - సోషల్ మీడియా ప్రచారం నిజమేనా?
Salaar OTT Release date: ప్రభాస్ సలార్ మూవీ థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. జనవరి 12 నుంచి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి.
Salaar OTT Release date: ప్రభాస్ సలార్ మూవీ అనుకున్నదానికంటే ముందుగానే ఓటీటీలోకి రాబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జనవరిలోనే ప్రభాస్ మూవీ ఓటీటీ ఆడియెన్స్ ముందుకు వస్తున్నట్లు చెబుతున్నారు.
ఈ బ్లాక్‌బస్టర్ మూవీ స్ట్రీమింగ్ హక్కులను నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకున్నది. జనవరి 12న నుంచి ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ కానున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. థియేటర్లలో రిలీజైన నెల రోజుల్లోపే ఈ మూవీని ఓటీటీలో రిలీజ్ చేసేలా నిర్మాతలతో నెట్‌ఫ్లిక్స్ ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం.
ఆ ఒప్పందం మేరకు జనవరి 12న సలార్ మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతోన్నట్లు వార్తలొస్తున్నాయి. థియేటర్ రిలీజ్‌కు, ఓటీటీ రిలీజ్‌కు ఇరవై రోజులు మాత్రమే గ్యాప్ కనిపిస్తోండటంతో ఈ పుకార్లను ప్రభాస్ ఫ్యాన్స్ కొట్టిపడేస్తున్నారు. జనవరి 12న సలార్ ఓటీటీలో రిలీజ్ అన్నది అబద్ధమంటూ ట్వీట్స్ చేస్తున్నారు. జనవరి తర్వాతే ఈ మూవీ ఓటీటీ రిలీజ్ ఉంటుందని అంటున్నారు. సలార్ మూవీకి ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించాడు.
స్నేహం, యాక్షన్ అంశాలతో తెరకెక్కిన ఈ మూవీలో పృథ్వీరాజ్ సుకుమారన్, శృతిహాసన్ కీలక పాత్రలు పోషించారు. ఖాన్సార్ అనే క్రైమ్ సిటీకి తన స్నేహితుడు రాజమన్నార్‌ను రాజును చేయడం కోసం దేవా ఎలాంటి పోరాటం చేశాడు? అసలు దేవా ఎవరు అన్నదే సలార్ మూవీ కథ. సలార్ మూవీకి సెకండ్ పార్ట్ కూడా రానుంది. శౌర్యంగపర్వం పేరుతో ప్రశాంత్ నీల్ ఈ సీక్వెల్‌ను తెరకెక్కిస్తోన్నాడు.