Saindhav TV Premier Date: సైంధవ్ టీవీలోకి వచ్చేస్తోంది.. ఎప్పుడు, ఎక్కడ చూడాలంటే?
06 March 2024, 7:27 IST
- Saindhav TV Premier Date: విక్టరీ వెంకటేశ్ నటించిన సంక్రాంతి మూవీ సైంధవ్ టీవీలోకి వచ్చేస్తోంది. ఈ మూవీ హక్కులను దక్కించుకున్న ఈటీవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ అనౌన్స్ చేసింది.
టీవీలోకి వచ్చేస్తున్న సైంధవ్ మూవీ..
Saindhav TV Premier Date: ఈ ఏడాది సంక్రాంతి సినిమాగా రిలీజై బాక్సాఫీస్ దగ్గర దారుణంగా బోల్తా పడిన మూవీ సైంధవ్. సీనియర్ హీరో విక్టరీ వెంకటేశ్, యంగ్ డైరెక్టర్ శైలేష్ కొలను కాంబినేషన్ లో భారీ అంచనాల మధ్య రిలీజైనా ఈ సినిమా ప్రేక్షకులకు ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడీ సినిమా టీవీలోకి వచ్చేస్తోంది. ఓటీటీలోనూ పెద్దగా ఆదరణ లభించిన ఈ సినిమాకు టీవీలో ఎలాంటి రెస్సాన్స్ వస్తుందో చూడాలి.
సైంధవ్ టీవీ ప్రీమియర్ డేట్ ఇదే
ప్రేక్షకుల సంక్రాంతి మూడ్ ను అర్థం చేసుకోలేక ఓ యాక్షన్ డ్రామాతో ఫ్యామిలీ హీరో వెంకటేశ్ సైంధవ్ మూవీతో వచ్చి బోల్తా పడ్డాడు. సైంధవ్ మూవీ శాటిలైట్ హక్కులను దక్కించుకున్న ఈటీవీ ఈ సినిమాను మార్చి 17, సాయంత్రం 6 గంటలకు టెలికాస్ట్ చేయనుంది. ఈ మూవీ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ డేట్ ను ఆ ఛానెల్ అధికారికంగా అనౌన్స్ చేసింది.
సంక్రాంతికి రిలీజైన సినిమాల్లో కనీసం బ్రేక్ ఈవెన్ కూడా అందుకోలేక భారీ నష్టాలను చవిచూసిన సినిమాగా సైంధవ్ నిలిచిపోయింది. పాపకు అరుదైన వ్యాధి, రూ.16 కోట్ల ఖరీదైన ఇంజెక్షన్ అనే కొత్త కాన్సెప్ట్ తో ట్రైలర్ తోనే ఆసక్తి రేపినా.. మూవీ ఆకట్టుకోలేకపోయింది. విపరీతమైన హింస ఎవరికీ మింగుడు పడలేదు. దీంతో సైంధవ్ బాక్సాఫీస్ దగ్గర విఫలమైంది.
ఈ సినిమాలో వెంకటేశ్ తోపాటు శ్రద్ధా శ్రీనాథ్, రుహానీ శర్మ, నవాజుద్దీన్ సిద్దిఖీ, ఆండ్రియా జెర్మియా, ముకేశ్ రిషి, బేబీ సారాలాంటి వాళ్లు ముఖ్యమైన పాత్రలు పోషించారు. ఈ సైంధవ్ మూవీని వెంకట్ బోయనపల్లి.. నిహారిక ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్ లో నిర్మించాడు. సంతోష్ నారాయణన్ మ్యూజిక్ అందించాడు.
సైంధవ్.. ఎందుకు బోల్తా కొట్టింది?
సాదాసీదా లైఫ్‌ను లీడ్ చేసే హీరోకు పవర్‌ఫుల్ ఫ్లాష్‌బ్యాక్ ఉండటం అనే పాయింట్‌ను. ఫ్యాక్షన్, మాఫియా, గ్యాంగ్‌స్టర్స్ అన్ని జోనర్స్‌లో వాడేశారు టాలీవుడ్ డైరెక్టర్స్. ఆ పాయింట్‌ను తీసుకొని కొత్త క్యారెక్టరైజేషన్స్‌తో శైలేష్ కొలను ఈ కథ రాసుకున్నట్లుగా అనిపిస్తుంది. హీరోకు ఓ రేంజ్ ష్లాఫ్‌బ్యాక్..అతడికి సపోర్ట్‌గా నిలిచే పవర్‌ఫుల్ క్యారెక్టర్స్... ధీటైన విలన్స్...అన్ని ఉన్నా సినిమాలో ఏదో మిస్సయిన ఫీలింగ్ కలుగుతుంది.
యాక్షన్, ఎమోషన్స్ మధ్య కొన్ని సార్లు కనెక్టివిటీ కనిపించదు.సైకో నుంచి వెంకటేష్ సైంధవ్‌గా సాదాసీదా ఫ్యామిలీ మ్యాన్‌గా ఎందుకు మారాడన్నది సరిగా చూపించలేదు. ఆర్య, రుహాణిశర్మ, ఆండ్రియాతో పాటు చాలా మంది ప్రతిభావంతులైన నటీనటులు ఉన్నా వారి టాలెంట్‌ను పూర్తిస్థాయిలో వాడుకోలేదనిపిస్తుంది. పాన్ ఇండియా మార్కెటింగ్ కోసమే క్యారెక్టర్స్ క్రియేట్ చేసిన ఫీలింగ్ కలుగుతుంది.
సైంధవ్ అలియాస్ సైకో పాత్రలో వెంకటేష్ చెలరేగిపోయాడు. తనలోని మాస్ కోణాన్ని పీక్స్‌లో చూపించాడు. డైలాగ్ డెలివరీ కొత్తగా అనిపిస్తుంది. ఎమోషనల్ సీన్స్‌లో వెంకీ నటన గురించి ప్రత్యేకంగా చెప్పిది ఏం లేదు. నవాజుద్దీన్ విలనిజం కొత్తగా అనిపిస్తుంది. తెలుగు, హిందీ మిక్స్ చేస్తూ డిఫరెంట్‌గా అతడి క్యారెక్టర్‌ను స్క్రీన్‌పై ప్రజెంట్ చేశాడు డైరెక్టర్.
టాపిక్