తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sai Pallavi: అభిమాని ప్రేమకు ఫిదా అయిన సాయిప‌ల్ల‌వి...

Sai Pallavi: అభిమాని ప్రేమకు ఫిదా అయిన సాయిప‌ల్ల‌వి...

17 June 2022, 8:46 IST

google News
  • లేడీ సూప‌ర్ స్టార్ గా తెలుగు ప్రేక్ష‌కుల అభిమానాన్ని సొంతం చేసుకున్న‌ది సాయిప‌ల్ల‌వి. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ పంథాకు భిన్న‌మైన క‌థాంశాల‌తో సినిమాలు చేస్తూ అభిమానుల మ‌న‌సుల్ని గెలుచుకుంటోంది. విరాట‌ప‌ర్వం సినిమాతో నేడు ప్రేక్ష‌కుల ముందుకొచ్చింది సాయిప‌ల్ల‌వి. ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌లో ఓ అభిమాని చేసిన ప‌నికి సాయిప‌ల్ల‌వి ఫిదా అయ్యింది.

సాయిప‌ల్ల‌వి
సాయిప‌ల్ల‌వి (twitter)

సాయిప‌ల్ల‌వి

తెలుగులో చేసింది త‌క్కువ సినిమాలే అయినా భారీగా ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సొంతం చేసుకున్న‌ది సాయిప‌ల్ల‌వి. అగ్ర‌హీరోలతో స‌మానంగా ఆమెకు పాపులారిటీ ఉంద‌న‌డంలో అతిశ‌యోక్తి లేదు.  లేడీ సూప‌ర్ స్టార్ అంటూ ఫ్యాన్స్ ఆమెను పిలుచుకుంటుంటారు. 

విరాట‌ప‌ర్వం సినిమాతో నేడు ప్రేక్ష‌కుల ముందుకు వచ్చింది సాయిప‌ల్ల‌వి. ఇందులో ప్రేమ కోసం త‌పించే వెన్నెల అనే యువ‌తిగా ఆమె కనిపించింది.  అర‌ణ్య అనే న‌క్స‌ల్ నాయ‌కుడి ప్రేమ కోసం వెన్నెల సాగించిన ప్ర‌యాణంతో ద‌ర్శ‌కుడు వేణు ఊడుగుల ఈ సినిమాను తెర‌కెక్కించారు. రానా హీరోగా న‌టించారు. సాయిప‌ల్ల‌వి ధృక్కోణం నుంచి సాగే క‌థ ఇది. ఆమె పాత్ర‌కు ఎక్కువ‌గా ప్రాధాన్య‌ముంటుంది. అందుకే రానాతో పాటు చిత్ర యూనిట్ స‌భ్యులంద‌రూ ఆమెపై ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. 

గ‌త కొన్ని రోజులుగా ఈ సినిమా ప్ర‌మోష‌న్స్‌తో సాయిప‌ల్ల‌వి బిజీగా ఉంది. ప్ర‌మోష‌న్స్‌లో భాగంగా ఇటీవ‌లే వైజాగ్ వెళ్లింది. అక్క‌డ ఓ  ఫ్యాన్‌ చేసిన ప‌నికి సాయిప‌ల్ల‌వి ఫిదా అయ్యింది. సాయిప‌ల్ల‌విపై అభిమానంతో ఆమె రూపాన్ని గుండెల‌పై ప‌చ్చ‌బొట్టు పొడిపించుకున్నాడు.  అత‌డి అభిమానాన్ని చూసి సాయిప‌ల్ల‌వి ఎమోష‌న‌ల్ అయ్యింది. అత‌డితో ఫొటోలు దిగింది. ప్ర‌స్తుతం ఈ ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి. విరాట‌ప‌ర్వం త‌ర్వాత గార్గి అనే సినిమా చేస్తోంది సాయిప‌ల్ల‌వి. లేడీ ఓరియెంటెడ్ క‌థాంశంతో రూపొందిన ఈ చిత్రం రిలీజ్‌కు సిద్ధంగా ఉంది. 

తదుపరి వ్యాసం