తెలుగు న్యూస్  /  ఎంటర్‌టైన్‌మెంట్  /  Sai Dharam Tej Marriage Plans: పెళ్లి ప్లాన్స్ పక్కన బెట్టిన మెగా హీరో.. కారణం ఏంటో తెలుసా?

Sai Dharam Tej Marriage Plans: పెళ్లి ప్లాన్స్ పక్కన బెట్టిన మెగా హీరో.. కారణం ఏంటో తెలుసా?

20 April 2023, 12:20 IST

    • Sai Dharam Tej Marriage Plans: సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ప్రస్తుతం తన పెళ్లి ప్లాన్స్ పక్కన బెట్టినట్లు తెలుస్తోంది. బైక్ ప్రమాదం తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ప్రస్తుతానికైతే కెరీర్‌పైనే ఫోకస్ పెట్టనున్నాడట ఈ హీరో.
సాయి ధరమ్ తేజ్
సాయి ధరమ్ తేజ్

సాయి ధరమ్ తేజ్

Sai Dharam Tej Marriage Plans: మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కాస్త గ్యాప్ తర్వాత ముఖానికి రంగు వేసుకున్నారు. దాదాపు రెండేళ్ల తర్వాత వెండితెరపై అలరించనున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం విరూపాక్ష ఈ శుక్రవారం విడుదలకు సిద్ధంగా ఉంది. ఇందులో భాగంగా సినిమా ప్రమోషన్లలో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇదిలా ఉంటే తాజాగా సాయి ధరమ్ తేజ్ తన వివాహానికి సంబంధించి ఆసక్తికర విషయాలను వెల్లడించినట్లు తెలుస్తోంది. మీడియా కథనాల ప్రకారం సాయి ధరమ్ తేజ్ ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకోవాలని అనుకోవట్లేదని సమాచారం.

ట్రెండింగ్ వార్తలు

Prabhas: ప్ర‌భాస్ చేతుల మీదుగా మొద‌లై రిలీజ్ కానీ దీపికా ప‌డుకోణ్ ఫ‌స్ట్ స్ట్రెయిట్ తెలుగు మూవీ ఏదో తెలుసా!

OTT Releases: ఒక్కరోజే ఓటీటీలోకి 10 సినిమాలు.. కచ్చితంగా చూడాల్సినవి 3 మాత్రమే.. ఎక్కడ చూస్తారంటే?

Abhay Movie: థియేట‌ర్ల‌లో రిలీజైన 23 ఏళ్ల త‌ర్వాత ఓటీటీలోకి వ‌చ్చిన క‌మ‌ల్‌హాస‌న్ సైకో థ్రిల్ల‌ర్ మూవీ!

Brahmamudi May 18th Episode: బ్రహ్మముడి- కిడ్నాపర్ల నుంచి బయటపడిన కావ్య.. భార్యను కొట్టబోయిన రాజ్.. మరదలిపై ఫైర్

సాయి ధరమ్ తేజ్‌కు రెండేళ్ల క్రితం బైక్ ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. దీంతో చాలా రోజుల వరకు బెడ్‌పై పరిమితమైన ఆయన కోలుకున్న తర్వాత చిన్నగా సినిమాలు చేయడం ప్రారంభించారు. అయితే సాయి ధరమ్మ తేజ్ ప్రమాదానికి గురి కావడానికంటే ముందు ఆయన తల్లిదండ్రులు పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి తెచ్చారంట. అంతేకాకుండా ఓ యువతిని కూడా ఎంపిక చేశారట. దీంతో చేసేదేమి లేక ఆయన కూడా వివాహానికి కూడా ఒప్పుకున్నాడట.

అయితే ఇంతలోనే సాయి తేజ్ ప్రమాదానికి గురికావడంతో అంతా మార్పిపోయింది. ఆసుపత్రి నుంచి కోలుకోవడంపై ఫోకస్ పెట్టిన ఆయన అనంతరం తన కెరీర్‌పై ఫోకస్ పెట్టి వరుసగా మూవీస్ చేస్తున్నారు. ప్రస్తుతం విరూపాక్ష ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా వివాహం గురించి ప్రశ్నించగా.. ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఆలోచనే లేనట్లు సమాధానం చెప్పారట ఈ మెగా హీరో. తల్లిదండ్రులు కూడా అతడి నిర్ణయానికి ఏకీ భవించి కొంతకాలం సర్దుకునేంత వరకు పెళ్లి ప్రస్తావన తీసుకురావట్లేదట.

ప్రస్తుతం ఈ 36 ఏళ్ల హీరో విరూపాక్ష కోసం వినూత్నంగా ప్రచారం చేస్తున్నారు. ముఖ్యంగా బైకర్స్ తప్పకుండా హెల్మెంట్ ధరించేలా అవగాహన కల్పిస్తున్నారు. తన ప్రమోషనల్ ఇంటర్వ్యూల్లో, ఈవెంట్లలో హెల్మెట్ ధరించడం ఎంతో ముఖ్యమో ప్రేక్షకులతో పాటు ఫ్యాన్స్‌లోనూ చైతన్యం తీసుకొస్తున్నారు.

విరూపాక్ష సినిమాలో సాయిధరమ్ తేజ్ సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా చేసింది. కాంతారా ఫేమ్ అజనీష్ లోక్ నాథ్ ఈ సినిమాకు స్వరాలు సమకూరుస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై సినిమాను నిర్మిస్తున్నారు. సుకుమార్ ఈ చిత్రానికి స్కీన్ ప్లే అందిస్తున్నారు. కార్తిక్ వర్మ దండు దర్శకత్వం వహిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఏప్రిల్ 21న ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది.

టాపిక్

హిందుస్తాన్ టైమ్స్ తెలుగు నుంచి ఎంటర్‌టైన్మెంట్, అలాగే ఓటీటీ తాజా అప్‌డేట్స్ పొందండి.
తదుపరి వ్యాసం